Raghuveera Reddy : తమ పార్టీలో చేరాలంటూ.. రఘువీరారెడ్డికి అన్ని పార్టీల నుంచి ఆహ్వానాలు.. మరి ఆయన దారి ఎటో? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Raghuveera Reddy : తమ పార్టీలో చేరాలంటూ.. రఘువీరారెడ్డికి అన్ని పార్టీల నుంచి ఆహ్వానాలు.. మరి ఆయన దారి ఎటో?

 Authored By sukanya | The Telugu News | Updated on :26 August 2021,1:15 pm

తెలుగు రాష్ట్రాలలో పరిచయం అవసరం లేని కొద్ది మంది రాజకీయ నాయకులలో, మాజీ మంత్రి, పీసీసీ మాజీ అధ్యక్షుడు రఘువీర రెడ్డి ఒకరు. రాజకీయాలలో ప్రత్యేక స్వరాన్ని వినిపించిన రఘువీర రెడ్డి, ఒక్క ముఖ్యమంత్రి పదవిని తప్ప, రాష్ట్ర స్థాయి రాజకీయాల్లో ఎత్తుపల్లాలు అన్నీ చూశారు. కీలక పదవులు అనుభవించారు. వ్యవసాయ మంత్రిగా కరవు జిల్లా అనంతపురం అభివృద్ధికి చాలా గట్టి ప్రయత్నం చేశారు.

జిల్లా రాజకీయలోనే కాకుండా రాష్ట్ర రాజకీయ్లలోనూ తమదైన ముద్ర వేశారు. అయితే,,2019 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ రెండోసారి కూడా ఓడిపోవడంతో పీసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. ఇక అక్కడినుంచి అప్రకటిత రాజకీయ సన్యాసం స్వీకరించారు. స్వగ్రామం, అనంతపురం జిల్లా మడకశిర మండలం నీలకంఠపురానికి మకాం మార్చారు. సాధారణ రైతుగా మారి, గ్రామస్తుల సహకారంతో, గ్రామంలోని 1200 సంవత్సరాల పురాతన నీలకంటేశ్వర ఆలయ పునర్నిర్మాణానికి నడుం బిగించి, ఆ దైవ కార్యాన్ని దిగ్విజయంగా పూర్తి చేశారు.

Congress

Congress

రీ ఎంట్రీ..? Raghuveera Reddy

అయితే, గత కొంత కాలంగా, రఘువీరరెడ్డి పొలిటికల్ రీఎంట్రీపై రాజకీయ, మీడియా వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. విభిన్న కోణాల్లో వ్యూహాగానాలు వినిపిస్తునాయి. ఆయన తిరిగి రాజకీయాల్లోకి రావడం నిజం అయితే, ఏ పార్టీలో చేరతారు… మాతృ సంస్థ కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతారా.. వైఎస్ ఫ్యామిలీతో ఉన్న అనుబంధంతో అధికార వైసీపీలో చేరతారా, లేక వైసీపీ అరాచక పాలనను అంతమొందించేందుకు, ప్రతిపక్ష నాయకుడు, తెలుగు దేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుతో చేతులు కలుపుతారా? అనే చర్చ అన్ని వర్గాలలోనూ వినవస్తోంది. అయితే, రఘువీరారెడ్డిఆయన ప్రధానంగా కాంగ్రెస్ వాది. ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ అంటేనే ఇష్టం అయినా, కాంగ్రెస్ పార్టీలో చేరే ఆలోచన లేదని టాక్ వినిపిస్తోంది.

నిజానికి, రఘువీరారెడ్డి కాంగ్రెస్ పార్టీని బతికించేందుకు, బలోపేతం చేసేందుకు 3,4 ఏళ్లు చాలా గట్టి ప్రయత్నమే చేశారు. అయినా, ఆశించిన ఫలితం రాలేదు. అందుకే చివరాఖరుకు, చేసేది లేక అస్త్ర సన్యాసం చేశారు. అలిమి కానీ చోట అధికులమన రాదనే విజ్ఞతను చూపి, రాజకీయాల నుంచి తప్పుకున్నారు. ఇటీవల రాహుల్ గాంధీ ఏపీ కాంగ్రెస్ నాయకులతో ప్రత్యేకంగా చర్చలు జరిపారు, ఆ సమావేశానికి, మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి, కేవీపీ రామచంద్ర రావు, రఘువీరారెడ్డికి కూడా ఆహ్వానం అందింది. అయినా, రఘువీరారెడ్డి హాజరు కాలేదు. దీన్నిబట్టి చూస్తే రఘువీరారెడ్డికి మళ్ళీ కాంగ్రేస్ లో చేరే ఆలోచన లేదని అనుకోవచ్చని అంటున్నారు.


వైసీపీలోకా .. టీడీపీలోకా.. ? Raghuveera Reddy 

అదే విధంగా, వైసీపీలో చేరే అవకాశం కూడా లేదని, అలాంటి ఆలోచనే ఉంటే, ఎప్పుడోనే ఆపని చేసేవారని అంటారు. అదీ గాక, ఇప్పటికే రఘువీర, జగన్ కారణంగా ఒక సారి అప్రదిష్ట పాలయ్యారు. వైఎస్ చనిపోయిన తర్వాత జగన్ ప్రోద్బలంతో ఆయన్నిముఖ్యమంత్రిని చేయాలని ఇంకెవరో చేపట్టిన సంతకాల సేకరణ, వెనక రఘువీర ఉన్నారని ప్రచారం జరిగింది. నిజానికి, ఆ వ్యవహారంలో రఘువీర ప్రమేయం లేక పోయినా, జగన్ చేసిన తప్పుడు ప్రచారం కారణంగా అపవాదు భరించవలసి వచ్చింది. అదీ, కాక, జగన్ రెడ్డి అరాచక పాలన చూస్తూ రఘువీర, ఆయనతో చేతులు కలపడం వంటి దుస్సాహసం చేయరని అంటున్నారు. మరోవైపు తెలుగు దేశం పార్టీ, చాలా కాలంగా రఘువీరా రెడ్డితో వివిధ స్థాయిల్లో చర్చలు జరుపుతోంది.

Raghuveera Reddy Reentry in congress

Raghuveera Reddy Reentry in congress

తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర రెడ్డి, సీమ హక్కుల కోసం కలిసిపోరాటం చేసేందుకు కలిసి రావాలని కోరినట్లు ప్రచారం జరిగింది. చంద్రబాబు సూచన మేరకే ప్రభాకర్ రెడ్డి, రఘువీరా రెడ్డిని టీడీపీలోకి ఆహ్వానించడానికే అక్కడకు వెళ్లారనే చర్చ కూడా సాగుతోంది. రఘువీరారెడ్డి తిరిగి రాజకీయాలలోకి రావడం అంటూ జరిగితే, తెలుగు దేశంలో చేరే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు. అదే జరిగి, రఘువీరరెడ్డి టీడీపీలో చేరితే, ప్రస్తుతం బీజేపీ,జనసేన, వైసీపీలలో ఇతర పార్టీలలో ఉన్న మాజీ కాంగ్రెస్ నాయకులు టీడీపీ తలుపులు తట్టడం ఖాయమని పరిశీలకులు భావిస్తున్నారు. నిజానికి, ఇటీవల కాలంలో వస్తున్న సర్వేలు అన్నీ, రానుంది టీడీపీ ప్రభుత్వమే అని స్పష్టమైన సంకేతాలు ఇస్తున్న నేపధ్యంలో కాంగ్రెస్ మాజీలు చాలా మంది ఇప్పటికే టీడీపీ వైపు చూస్తున్నారని, రఘువీరారెడ్డి చేరికతో జోరు పెరుగుతుందని అంటున్నారు.

sukanya

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది