Railway Recruitment : రైల్వే శాఖ భారీ రిక్రూట్ మెంట్ నోటిఫికేషన్…రెండు తెలుగు రాష్ట్రాలలో 4,862 పోస్టుల భర్తీ…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Railway Recruitment : రైల్వే శాఖ భారీ రిక్రూట్ మెంట్ నోటిఫికేషన్…రెండు తెలుగు రాష్ట్రాలలో 4,862 పోస్టుల భర్తీ…!

Railway Recruitment : నిరుద్యోగులకు శుభవార్త…ఇటీవల రైల్వే శాఖలో ఖాళీగా ఉన్నటువంటి పోస్టులను భర్తీ చేసేందుకు దరఖాస్తులు కోరుతూ సంబంధిత శాఖ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఇక ఈ నోటిఫికేషన్ ద్వారా 4,862 అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయనున్నారు. మరి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. Railway Recruitment నోఫికేషన్ విడుదల చేసిన సంస్థ… మనకు ఈ భారీ రిక్రూట్ మెంట్ నోటిఫికేషన్ రైల్వే రిక్రూట్ మెంట్ బోర్డ్ మరియు సెంట్రల్ […]

 Authored By ramu | The Telugu News | Updated on :7 August 2024,10:00 am

ప్రధానాంశాలు:

  •  Railway Recruitment : రైల్వే శాఖ భారీ రిక్రూట్ మెంట్ నోటిఫికేషన్...రెండు తెలుగు రాష్ట్రాలలో 4,862 పోస్టుల భర్తీ...!

Railway Recruitment : నిరుద్యోగులకు శుభవార్త…ఇటీవల రైల్వే శాఖలో ఖాళీగా ఉన్నటువంటి పోస్టులను భర్తీ చేసేందుకు దరఖాస్తులు కోరుతూ సంబంధిత శాఖ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఇక ఈ నోటిఫికేషన్ ద్వారా 4,862 అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయనున్నారు. మరి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Railway Recruitment నోఫికేషన్ విడుదల చేసిన సంస్థ…

మనకు ఈ భారీ రిక్రూట్ మెంట్ నోటిఫికేషన్ రైల్వే రిక్రూట్ మెంట్ బోర్డ్ మరియు సెంట్రల్ రైల్వే నుండి విడుదల కావడం జరిగింది.

Railway Recruitment మొత్తం ఖాళీలు…

ఈ రిక్రూట్ మెంట్ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 4,862 అప్రెంటిస్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. దీనిలో సెంట్రల్ రైల్వే నుండి 2,424 పోస్టులు , సదరన్ రైల్వే నుండి 2,438 అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు తెలుస్తోంది.

విద్యార్హత…

ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి అనుకునేవారు 10th + ITI విద్యార్హత కలిగి ఉండాలి. లేదా సంబంధిత విభాగంలో 12th పూర్తి చేసి ఉండాలి.

స్టైఫండ్

ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి పోస్టులను బట్టి స్టై ఫండ్ ఇవ్వడం జరుగుతుంది.

వయస్సు…

ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి అనుకునే వారి వయసు కనీసం 15 సంవత్సరాల నుండి 24 సంవత్సరాలు మధ్య ఉండాలి. అప్పుడే మీరు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోగలరు.

ఎలా అప్లై చేయాలంటే..

Railway Recruitment రైల్వే శాఖ భారీ రిక్రూట్ మెంట్ నోటిఫికేషన్రెండు తెలుగు రాష్ట్రాలలో 4862 పోస్టుల భర్తీ

Railway Recruitment : రైల్వే శాఖ భారీ రిక్రూట్ మెంట్ నోటిఫికేషన్…రెండు తెలుగు రాష్ట్రాలలో 4,862 పోస్టుల భర్తీ…!

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలి అనుకునేవారు సంబంధిత అఫీషియల్ వెబ్ సైట్ లోకి వెళ్లి మీ పూర్తి వివరాలను నమోదు చేసి సబ్ మిట్ చేయాల్సి ఉంటుంది.

ఎంపిక ప్రక్రియ..

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న వారికి 10th + ITI , 10+2 లో వచ్చిన మార్కుల మెరిట్ లిస్ట్ ఆధారంగా చేసుకుని ఎంపిక చేయడం జరుగుతుంది.

రుసుము..

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలి అనుకునేవారు రూ.100 దరఖాస్తు ఫీ చెల్లించాల్సి ఉంటుంది

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది