Rajinikanth | ప‌వ‌న్ క‌ళ్యాణ్ తుఫాన్ అంటూ ర‌జ‌నీకాంత్ ప్ర‌శంస‌లు | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Rajinikanth | ప‌వ‌న్ క‌ళ్యాణ్ తుఫాన్ అంటూ ర‌జ‌నీకాంత్ ప్ర‌శంస‌లు

 Authored By sandeep | The Telugu News | Updated on :17 August 2025,2:00 pm

Rajinikanth | సూపర్ స్టార్ రజనీకాంత్ సినీ రంగ ప్రవేశం చేసి 50 ఏళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ త‌న సోష‌ల్ మీడియా ద్వారా హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలిపారు. తరాలు మారుతున్నా రజనీకాంత్ అంటే.. సినీ ప్రియుల్లో ఆ ఆనందోత్సాహాల వన్నె తగ్గలేదని చెప్పారు. ఆ స్థాయి అభిమానులను దక్కించుకున్న అగ్రశ్రేణి కథానాయకుడు రజనీకాంత్ అని కొనియాడారు.

#image_title

వెండి తెరపై ‘సూపర్ స్టార్ రజనీ’ అని టైటిల్ కనిపించగానే థియేటర్ ఏ విధంగా మార్మోగుతుందో పలుమార్లు తాను చెన్నైలో చూశానని ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ గుర్తు చేసుకున్నారు. నటుడిగా ఆయన ప్రయాణం ఎందరికో స్ఫూర్తిగా నిలిచిందన్నారు. ప్రతినాయక పాత్ర పోషించినా.. కథానాయకుడిగా మెప్పించినా రజనీకాంత్ తనదైన స్టైల్‌ను చూపించి ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేశారంటూ ప్రశంసించారు.

నటుడిగా శిఖరాగ్ర స్థాయికి చేరిన రజనీకాంత్ మహావతార్ బాబాజీ భక్తుడిగా ఆధ్యాత్మిక విషయాలు, యోగా సాధనపై ప్రత్యేక శ్రద్ధ చూపడం.. ఆయనలో భక్తి భావాన్ని, ధార్మిక విశ్వాసాలను తెలియజేస్తుందని తెలిపారు. రజనీకాంత్‌కి సంపూర్ణ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు అందించాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నానని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. ఈ ట్వీట్‌కి స్పందించిన ర‌జ‌నీకాంత్.. ఏపీ ఉప ముఖ్య‌మంత్రి, నా సోద‌రుడు, పొలిటిక‌ల్ తుఫాన్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కి నా ధ‌న్య‌వాదాలు.దేవుడు మీకు సంపూర్ణ ఆయురారోగ్యాలు అందించాల‌ని కోరుకుంటున్నాను అని అన్నారు.

Tags :

    sandeep

    ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది