Ram Red Movie Review : రామ్ రెడ్ మూవీ రివ్యూ
సినిమా పేరు : రెడ్
నటీనటులు : రామ్(ద్విపాత్రాభినయం), మాళవిక శర్మ, నివేతా పేతురాజ్, అమృత అయ్యర్
బ్యానర్ : స్రవంతి మూవీస్ బ్యానర్
మ్యూజిక్ డైరెక్టర్ : మణిశర్మ
నిర్మాత : స్రవంతి రవికిశోర్
డైరెక్టర్ : కిశోర్ తిరుమల
రామ్ అంటేనే ఎనర్జీ. సినిమా మొత్తం ఫుల్లు ఎనర్జీతో నటించడమే రామ్ స్పెషాలిటి. తెలుగులో ఉన్న స్టార్ హీరోల్లో ఎక్కువ ఎనర్జీతో నటించేది రామ్ మాత్రమే. అందుకే రామ్ ను అందరూ ఎనర్జిటిక్ స్టార్ అని పిలుస్తుంటారు. ఆయన ఎనర్జీ ఏంటో.. ఇస్మార్ట్ శంకర్ సినిమాతోనే తెలిసిపోయింది.
ఆ ఎనర్జీని ఏమాత్రం మిస్ కాకుండా.. అదే ఎనర్జీని మెయిన్ టెన్ చేస్తూ తీసిన సినిమా రెడ్. ఈ సినిమా తమిళ్ మూవీ తడమ్ కు రీమేక్. క్రైమ్ థ్రిల్లర్ గా ఈ సినిమాను కిశోర్ తిరుమల తెరకెక్కించాడు. రామ్ ఈ సినిమాలో ద్విపాత్రాభినయం చేశాడు. మొదటి సారి రామ్.. డబుల్ రోల్ లో అలరించాడు.

ram pothineni red telugu movie review
అయితే.. ఈ సినిమా గత సంవత్సరం వేసవి కానుకగానే విడుదల కావాల్సి ఉంది. కానీ.. కరోనా వల్ల సినిమా విడుదల వాయిదా పడింది. మొత్తం మీద ఈ సంక్రాంతి కానుకగా సినిమా విడుదలయింది. ఇప్పటికే విడుదలైన సినిమా ట్రైలర్స్, టీజర్స్, ఫస్ట్ లుక్స్ లాంటివి సినిమా మీద భారీగా అంచనాలను పెంచాయి.
రామ్ డబుల్ రోల్ తో పాటు ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు తమ అందాలను ఆరబోశారు. నివేతా పేథురాజ్ తో పాటు మాళవిక శర్మ, అమృత అయ్యర్ సినిమాలో ఉండటంతో సినిమాలో గ్లామర్ షోకు ఏమాత్రం తక్కువ లేదు అనే విషయం అర్థమయింది.
తెలుగుతో పాటు.. మరో 7 భాషల్లో విడుదలైన రెడ్ సినిమా ప్రేక్షకులను మెప్పించిందా? లేదా? అనే విషయం తెలియాలంటే ముందు కథలోకి వెళ్లాలి.
కథ ఏంటంటే?
ఇద్దరు రామ్ లు. అంటే ఒకరు సిద్ధార్థ్.. ఇంకొకరు ఆదిత్య. ఇద్దరూ ఒక కన్నతల్లి బిడ్డలే కానీ.. చిన్నప్పుడే వీళ్లిద్దరి తల్లిదండ్రులు విడిపోవడంతో.. ఒకరు తండ్రి దగ్గర.. ఇంకొకరు తల్లి దగ్గర పెరుగుతారు. తండ్రి దగ్గర పెరిగిన సిద్ధార్థ్.. మంచిగా చదువుకొని సివిల్ ఇంజినీర్ అవుతాడు. తల్లి దగ్గర పెరిగిన ఆదిత్య… ఆవరాగా తిరుగుతూ పేకాట ఆడుతూ.. టైమ్ పాస్ చేస్తుంటాడు.

ram pothineni red telugu movie review
సిద్ధార్థ్.. తనతోనే పనిచేసే మాళవిక శర్మ(మహిమ)ను లవ్ చేస్తుంటాడు. తన వెంట పడుతున్నా… తను మాత్రం పెద్దగా పట్టించుకోదు. ఇంతలో తను లవ్ చేసిన మహిమకు వేరే వ్యక్తి ప్రపోజ్ చేస్తాడు. అది తట్టుకోలేక.. సిద్ధార్థ.. ఆ వ్యక్తిని మర్డర్ చేస్తాడు. ఈ కేసును నివేత పేతురాజ్(యామిని) డీల్ చేస్తుంది. ఓ సెల్ఫీ ఫోటో.. సిద్ధార్థ్ ను పట్టిస్తుంది. దీంతో సిద్ధార్థ్ ను యామిని అరెస్ట్ చేసి స్టేషన్ కు తీసుకెళ్తుంది.
కట్ చేస్తే.. ఆవరాగా తిరిగే ఆదిత్య.. పేకాటలో 8 లక్షలు పోగొట్టుకుంటాడు. రౌడీలు.. 8 లక్షలు వెంటనే ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తారు. దీంతో ఏం చేయాలో తెలియక.. అక్కడ ఇక్కడ డబ్బుల కోసం తిరుగుతుంటాడు. తర్వాత ఒకరోజు డ్రంక్ అండ్ డ్రైవ్ లో ఆదిత్య పోలీసులకు దొరుకుతాడు. దీంతో అతడిని కూడా అరెస్ట్ చేసి.. సిద్ధార్థ ఉన్న సేమ్ స్టేషన్ కు తీసుకొస్తారు.

ram pothineni red telugu movie review
అక్కడ పోలీసులు.. ఇద్దరిని చూసి షాక్ అవుతారు. కన్ఫ్యూజ్ అవుతారు. అసలు.. వీళ్లిద్దరి స్టోరీ ఏంది? సిద్ధార్థ్ ను చంపిన వ్యక్తి ఎవరు? ఆ కేసు ఎంతవరకు ముందుకు వెళ్తుంది? మహిమ.. సిద్ధార్థ ప్రేమను ఒప్పుకుంటుందా? అమృత అయ్యర్ కు ఆదిత్యకు సంబంధం ఏంటి? అనేది మిగితా కథ. అది తెలుసుకోవాలంటే మాత్రం థియేటర్ లో సినిమా చూడాల్సిందే.
ప్లస్ పాయింట్స్
సినిమాకు ప్లస్ పాయింట్స్ తక్కువ. మైనస్ పాయింట్స్ ఎక్కువ అని చెప్పుకోవాలి. సినిమా మొత్తం వన్ మ్యాన్ షోలా ఉంటుంది. రామ్ మొత్తం సినిమా బాధ్యతను భుజాల మీద మోశాడు. రామ్ నటన, స్టయిలిష్ లుక్స్ సినిమాకు ప్లస్. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం అదిరిపోయింది. మణిశర్మ మరోసారి అదుర్స్ అనిపించాడు. ఇక ఇంటర్వల్ మాత్రం సూపర్బ్.
మైనస్ పాయింట్స్
సినిమాకు స్క్రీన్ ప్లే పెద్ద మైనస్. కొన్ని సీన్లను సాగదీశారు. పేరుకు క్రైమ్ థ్రిల్లర్ సినిమానే కానీ.. సినిమాలో ఎక్కడా ఆ థ్రిల్లింగ్ మాత్రం ప్రేక్షకులకు అనిపించదు. బోరింగ్ ఫస్ట్ హాప్.
కన్ క్లూజన్
ఫైనల్ గా చెప్పాలంటే.. ఇది కేవలం రామ్ ఫ్యాన్స్ సినిమా. వాళ్లు ఖచ్చితంగా ఈ సినిమా ఎలా ఉన్నా చూస్తారు. కాస్తో కూస్తో క్రైమ్ థ్రిల్లర్ జానర్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్లు ఈ సినిమాకు వెళ్లొచ్చు. కానీ.. వాళ్లు ఊహించుకున్నంత మేర థ్రిల్లింగ్ అంశాలు అయితే సినిమాలో ఉండవు. అంతకు మించి.. ఇక చెప్పడానికి ఇంకేం లేదు.