Rambutan | రాంబుటాన్ పండు ఆరోగ్య రహస్యాలు .. రోగనిరోధకత నుంచి క్యాన్సర్ నివారణ వరకు..
Rambutan | మనకు కొంచెం అపరిచితమైనా, పోషక విలువల పరంగా ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన ఫలాల్లో రాంబుటాన్ (Rambutan) ఒకటి. దక్షిణాసియా దేశాల్లో విరివిగా పెరిగే ఈ పండు, ఇప్పుడు భారత్‌లోనూ సులభంగా లభిస్తోంది. గులాబీ రంగులో, వింత ఆకృతిలో ఉండే ఈ పండు రుచితో పాటు అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉంది.
#image_title
రాంబుటాన్ పండులో
ఐరన్, యాంటీఆక్సిడెంట్లు, కార్బోహైడ్రేట్లు,విటమిన్ B3, విటమిన్ C,కాల్షియం, ఫాస్ఫరస్, ప్రోటీన్, ఫైబర్ వంటి అనేక పోషకాలున్నాయి.వీటితో పాటు మంచి నీటి శాతం ఉండటం వల్ల హైడ్రేషన్‌కి ఎంతో మేలు చేస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. రాంబుటాన్‌లో అధికంగా ఉండే విటమిన్ C శరీరానికి మేలు చేస్తూ, రోగనిరోధకతను మెరుగుపరుస్తుంది.శరీరంలోకి వచ్చే వైరస్లు, బ్యాక్టీరియాలపై పోరాడుతుంది. టాక్సిన్లను బయటకు పంపిస్తుంది
జీర్ణక్రియ, మలబద్ధకం సమస్యలకి చెక్
ఈ పండులో ఫైబర్ అధికంగా ఉండటం వల్ల:
జీర్ణవ్యవస్థ మేలుగా పనిచేస్తుంది
మలబద్ధకం నుంచి ఉపశమనం కలుగుతుంది
మెటబాలిజం వేగంగా జరుగుతుంది
కంటి ఆరోగ్యం, చర్మ సంరక్షణ
రాంబుటాన్‌లోని యాంటీఆక్సిడెంట్లు:
కంటి ఆరోగ్యాన్ని కాపాడతాయి
చర్మాన్ని కాంతివంతంగా ఉంచుతాయి
ముడతలు, వృద్ధాప్య లక్షణాల్ని తగ్గిస్తాయి
గాయాలను త్వరగా మాన్చుతాయి
క్యాన్సర్ నివారణకు సహాయపడే పండు!
రాంబుటాన్‌లోని శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు:
హానికరమైన ఫ్రీ రాడికల్స్‌ను నిరోధిస్తాయి
వాపును తగ్గిస్తాయి
కణజాల నష్టం నుంచి రక్షణ కలిగిస్తాయి
కొన్ని పరిశోధనల ప్రకారం, ఇది కాలేయ క్యాన్సర్ చికిత్సలో సహాయపడే అవకాశం కూడా ఉంది
ప్రతిరోజూ 5 రాంబుటాన్ పండ్లు తినడం వల్ల క్యాన్సర్ రిస్క్ తగ్గుతుందని నిపుణులు సూచిస్తున్నారు