Dresses | ఫ్యాషన్ కోసం ఆరోగ్యాన్ని పణంగా పెట్టకండి .. బిగుతుగా ఉండే దుస్తులు కలిగించే ప్రమాదాలు
Dresses | ఈ రోజుల్లో ఫ్యాషన్ అంటే అందరికీ మక్కువ. స్టైలిష్‌గా, ట్రెండీగా కనిపించాలన్న కోరికతో చాలా మంది ఫిట్టెడ్ జీన్స్, లెగ్గింగ్స్, బాడీకాన్ డ్రెస్సులు, స్ట్రెచబుల్ టాప్స్ వంటి దుస్తులను తరచుగా ధరిస్తున్నారు. అవి లుక్‌ను మెరుగుపరచినా, ఆరోగ్యపరంగా మాత్రం ప్రతికూల ప్రభావాలు చూపుతాయని తాజా పరిశోధనలు చెబుతున్నాయి.
#image_title
పరిశోధనల ప్రకారం…
హెల్త్‌లైన్ పబ్లిష్ చేసిన నివేదిక ప్రకారం, ఎక్కువసేపు టైట్ దుస్తులు ధరించడం శరీరానికి అసౌకర్యం కలిగించడమే కాకుండా అనేక సమస్యలకు దారితీస్తుంది. చర్మం ఎర్రబడడం, చికాకు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి సమస్యలు ఎక్కువగా కనిపిస్తాయి. ముఖ్యంగా షేప్‌వేర్, బ్రాలు, ప్యాంటీహోస్ వంటి లోదుస్తులు చర్మంపై ఎక్కువ ఒత్తిడిని కలిగించి చర్మ రుగ్మతలకు కారణమవుతాయి.
జీర్ణక్రియపై ప్రభావం
రిజిస్టర్డ్ డైటీషియన్ మిచెల్ రౌచ్ వివరించిన ప్రకారం, బిగుతుగా ఉండే దుస్తులు కడుపు, ప్రేగులపై అదనపు ఒత్తిడి పెంచి యాసిడ్ రిఫ్లక్స్, గుండెల్లో మంట వంటి సమస్యలను పెంచుతాయి. దీర్ఘకాలంలో ఇవి అన్నవాహిక సమస్యలకు దారితీస్తాయి. ఉబ్బరం ఉన్నవారికి ఇవి మరింత ఇబ్బంది కలిగిస్తాయి.
టైట్ ప్యాంటులు, బెల్టులు ధరించడం వల్ల శ్వాసలో ఇబ్బంది ఏర్పడటమే కాకుండా చెమట పట్టడం వల్ల ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉంటుంది. అంతేకాకుండా, బిగుతుగా ఉండే బెల్టులు లేదా ప్యాంటులు “మెరాల్జియా పరేస్తేటికా” అనే నరాల సమస్యకు దారితీస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీనివల్ల తొడ బయటి భాగంలో జలదరింపు, తిమ్మిరి లేదా మంట వంటి లక్షణాలు కనిపిస్తాయి.