Ramoji Rao : కరక్ట్ పాయింట్ లో దొరికావయ్యా రామోజీరావు !!
Ramoji Rao : ఎల్లో మీడియా గురించి తెలుసు కదా. దాని గురించి ప్రత్యేకంగా చెప్పుకునేది ఏం లేదు కానీ.. ఎల్లో మీడియా చేసే రచ్చ మాత్రం మామూలుగా ఉండదు. ఈ ఎల్లో మీడియాను అడ్డం పెట్టుకొని టీడీపీ అధినేత చంద్రబాబు.. వైసీపీ ప్రభుత్వంపై చెలరేగిపోతారు. ఈనాడు కావచ్చు.. ఆంధ్రజ్యోతి కావచ్చు.. మీడియా ఏదైనా వాళ్ల టార్గెట్ ఒక్కటే. అదే జగన్. ఆయన ప్రవేశపెట్టే పథకాలపై బురద జల్లడం, ఇతరత్రా ఆరోపణలు చేయడం సర్వసాధారణం. జగన్ ను బ్లేమ్ చేయాలని సంకల్పించి ఎంతో కష్టపడి మరీ.. సీఎం జగన్ పై బురద జల్లే కార్యక్రమంలో ఒక్కోసారి వాళ్లే అడ్డంగా దొరికిపోతుంటారు.
తాజాగా అదే జరిగింది. జగనన్న విద్య కానుక పథకంపై నిప్పులు చెరిగింది. ఆ పథకం గుత్తేదార్లకే అంటూ ఓ కథనాన్ని ఈనాడు తాజాగా ప్రచురించింది. కానీ.. ఆ కథనం అంతా ఉత్తుత్తి కథనం అని తాజాగా వెల్లడైంది. ఈనాడు ఆరోపణలు ఏంటంటే.. బూట్లపై రూ.14 అధికంగా తీసుకున్నారని కానీ.. వాస్తవం ఏంటంటే.. జీవో 172 ప్రకారం.. ఒక జత షూలు, 2 జతల సాక్సులు.. వీటికి ఆమోదించిన వ్యయం రూ.200 అయితే.. రివర్స్ టెండర్ ప్రక్రియ ద్వారా రూ.187.48 కే ప్రభుత్వం టెండర్ ఖరారు చేసింది.
Ramoji Rao : ఈనాడు ఆరోపణలు ఏంటి.. వాస్తవాలు ఏంటి?
అందుకే ప్రభుత్వం ఆమోదించిన ధర కంటే ఇది 10 శాతం తక్కువ. అలాగే.. బ్యాగుపై కూడా అధిక ధర వేస్తున్నారంటూ ఈనాడు ఆరోపించింది. కాంట్రాక్టర్లు కూడా పాతవాళ్లే అంటూ చెప్పుకొచ్చింది. కానీ.. అవన్నీ బూటకాలే. టెండర్ నిబంధనల ప్రకారమే కొత్త కాంట్రాక్టర్లను కూడా పాల్గొనేలా అవకాశం కల్పించారు. ఇవన్నీ తెలియక.. ఈనాడు బూటకపు ఆరోపణలు చేసింది. ఇవన్నీ తప్పుడు కథనాలు అని దాన్ని చదివే ప్రతి ఒక్క తెలుగోడికి అర్థం అవుతుంది. ఇంతకన్నా ఎల్లో మీడియా దుష్ప్రచారాల గురించి ఇంకేం చెప్పాలి అంటూ వైసీపీ నేతలు ఎల్లో మీడియాను ఏకిపారేస్తున్నారు.