Ramoji Rao – Jagan : కరక్ట్ పాయింట్ లో ప్రూఫ్ తో దొరికిన రామోజీరావు – జగన్ కి వెయ్యి ఏనుగుల బలం ! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Ramoji Rao – Jagan : కరక్ట్ పాయింట్ లో ప్రూఫ్ తో దొరికిన రామోజీరావు – జగన్ కి వెయ్యి ఏనుగుల బలం !

Ramoji Rao – Jagan : ఒకప్పుడు ఏపీలో కుల రాజకీయాలు జరిగేవి. ముఖ్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏపీలో దళితులు బిక్కుబిక్కుమంటూ గడిపారు. వాళ్లకు దుర్భర పరిస్థితులు ఉండేవి. ఇక దళిత మహిళలకు అస్సలు రక్షణ ఉండేది కాదు. దళిత మహిళలకు ఎన్నో అవమానాలు జరిగాయి. ఎన్నో దాడులు జరిగాయి. దానికి నిదర్శనం పెందుర్తి మండలం జెర్రిపోతులపాలెంలో జరిగిన ఘటన. 14 దళిత కుటుంబాలు సాగు చేసుకుంటున్న స్థలంపై టీడీపీ అధికారంలోకి […]

 Authored By kranthi | The Telugu News | Updated on :30 March 2023,9:00 pm

Ramoji Rao – Jagan : ఒకప్పుడు ఏపీలో కుల రాజకీయాలు జరిగేవి. ముఖ్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏపీలో దళితులు బిక్కుబిక్కుమంటూ గడిపారు. వాళ్లకు దుర్భర పరిస్థితులు ఉండేవి. ఇక దళిత మహిళలకు అస్సలు రక్షణ ఉండేది కాదు. దళిత మహిళలకు ఎన్నో అవమానాలు జరిగాయి. ఎన్నో దాడులు జరిగాయి. దానికి నిదర్శనం పెందుర్తి మండలం జెర్రిపోతులపాలెంలో జరిగిన ఘటన. 14 దళిత కుటుంబాలు సాగు చేసుకుంటున్న స్థలంపై టీడీపీ అధికారంలోకి వచ్చాక నేతల కన్ను పడింది ఆ స్థలం మీద.కన్ను పడటమే కాదు..

ramoji rao yellow media spread fake news about cm ys jagan

ramoji rao yellow media spread fake news about cm ys jagan

టీడీపీ నాయకులు ఆ స్థలాన్ని స్వాధీనం చేసుకునేందుకు చాలా రకాలుగా ప్రయత్నాలు చేశారు. వాళ్లను అడ్డుకున్న దుర్గమ్మ అనే మహిళ బట్టలు చింపేశారు. దళితులపై దాడి చేశారు. మహిళ అనే కనికరం కూడా లేకుండా టీడీపీ నేతలు టీడీపీ అధిష్ఠానం అండ చూసుకొని కీచకుల్లా వ్యవహరించారు. ఇలాంటి ఘటనలు టీడీపీ హయాంలో కోకొల్లలుగా జరిగాయి. టీడీపీకి మద్దతుగా ఎల్లోమీడియా. దాన్ని అడ్డం పెట్టుకొని చంద్రబాబు చేసిన ఆగడాలు కోకొల్లలు. అప్పట్లో ప్రత్యామ్నాయ మీడియా లేక చంద్రబాబు ఆడిందే ఆట, పాడిందే పాట అయింది. రామోజీ రావును అడ్డం పెట్టుకొని చంద్బరాబు ఎన్నో ఆర్థిక కుట్రలకు తెరలేపారు.

It Is Clear Now - 2024 Will Be Between Jagan And Ramoji

Ramoji Rao – Jagan : ఇలాంటి ఘటనలు కోకొల్లలు

వాటి మీదనే రామోజీరావు కోటలు కట్టారు. ఇవన్నీ ఏపీ ప్రజలకు తెలుసు. అందుకే 2019 ఎన్నికల్లో టీడీపీని పాతరేశారు. 2024 ఎన్నికల్లోనూ అదే రిపీట్ కాబోతోంది. ఎంతో నిజాయితీతో ఒక ప్రభుత్వాన్ని సీఎం జగన్ నడిపిస్తున్నారు. చంద్రబాబు మాత్రం ఐదేళ్లు ఏపీని సర్వనాశనం చేశారు. దళితులు, మహిళలపై దాడికి పాల్పడిన టీడీపీ నేతలపై కేసులు కూడా పెట్టొద్దా? కేసులు పెడితే తప్పు అన్నట్టుగా మాట్లాడుతున్నారు టీడీపీ నేతలు. వాళ్లు ఏం చేసినా తప్పు కాదు. వాళ్ల మీద కేసు పెడితే తప్పు. కానీ.. వాళ్లు దళితులపై ఎలాంటి దాడులు అయినా చేయొచ్చు. దళితులకు టీడీపీ పార్టీ గురించి స్పష్టంగా తెలిసింది కాబట్టే టీడీపీని ఘోరంగా ఓడించారు. 2024 లోనూ ఓడించేందుకు రెడీ అవుతున్నారు.

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది