Ramoji Rao – Jagan : ఒకప్పుడు ఏపీలో కుల రాజకీయాలు జరిగేవి. ముఖ్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏపీలో దళితులు బిక్కుబిక్కుమంటూ గడిపారు. వాళ్లకు దుర్భర పరిస్థితులు ఉండేవి. ఇక దళిత మహిళలకు అస్సలు రక్షణ ఉండేది కాదు. దళిత మహిళలకు ఎన్నో అవమానాలు జరిగాయి. ఎన్నో దాడులు జరిగాయి. దానికి నిదర్శనం పెందుర్తి మండలం జెర్రిపోతులపాలెంలో జరిగిన ఘటన. 14 దళిత కుటుంబాలు సాగు చేసుకుంటున్న స్థలంపై టీడీపీ అధికారంలోకి వచ్చాక నేతల కన్ను పడింది ఆ స్థలం మీద.కన్ను పడటమే కాదు..
టీడీపీ నాయకులు ఆ స్థలాన్ని స్వాధీనం చేసుకునేందుకు చాలా రకాలుగా ప్రయత్నాలు చేశారు. వాళ్లను అడ్డుకున్న దుర్గమ్మ అనే మహిళ బట్టలు చింపేశారు. దళితులపై దాడి చేశారు. మహిళ అనే కనికరం కూడా లేకుండా టీడీపీ నేతలు టీడీపీ అధిష్ఠానం అండ చూసుకొని కీచకుల్లా వ్యవహరించారు. ఇలాంటి ఘటనలు టీడీపీ హయాంలో కోకొల్లలుగా జరిగాయి. టీడీపీకి మద్దతుగా ఎల్లోమీడియా. దాన్ని అడ్డం పెట్టుకొని చంద్రబాబు చేసిన ఆగడాలు కోకొల్లలు. అప్పట్లో ప్రత్యామ్నాయ మీడియా లేక చంద్రబాబు ఆడిందే ఆట, పాడిందే పాట అయింది. రామోజీ రావును అడ్డం పెట్టుకొని చంద్బరాబు ఎన్నో ఆర్థిక కుట్రలకు తెరలేపారు.
వాటి మీదనే రామోజీరావు కోటలు కట్టారు. ఇవన్నీ ఏపీ ప్రజలకు తెలుసు. అందుకే 2019 ఎన్నికల్లో టీడీపీని పాతరేశారు. 2024 ఎన్నికల్లోనూ అదే రిపీట్ కాబోతోంది. ఎంతో నిజాయితీతో ఒక ప్రభుత్వాన్ని సీఎం జగన్ నడిపిస్తున్నారు. చంద్రబాబు మాత్రం ఐదేళ్లు ఏపీని సర్వనాశనం చేశారు. దళితులు, మహిళలపై దాడికి పాల్పడిన టీడీపీ నేతలపై కేసులు కూడా పెట్టొద్దా? కేసులు పెడితే తప్పు అన్నట్టుగా మాట్లాడుతున్నారు టీడీపీ నేతలు. వాళ్లు ఏం చేసినా తప్పు కాదు. వాళ్ల మీద కేసు పెడితే తప్పు. కానీ.. వాళ్లు దళితులపై ఎలాంటి దాడులు అయినా చేయొచ్చు. దళితులకు టీడీపీ పార్టీ గురించి స్పష్టంగా తెలిసింది కాబట్టే టీడీపీని ఘోరంగా ఓడించారు. 2024 లోనూ ఓడించేందుకు రెడీ అవుతున్నారు.
Onion And Garlic : భారతదేశంలోని ప్రతి ఒక్కరి ఇంట్లో దాదాపుగా ఉల్లిపాయాలను వెల్లుల్లిని విరివిగా వినియోగిస్తూ ఉంటారు. అయితే…
Mechanic Rocky Movie Review : ఈ ఇయర్ ఆల్రెడీ గామీ, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ ఫినాలే ఎపిసోడ్‌కి దగ్గర పడింది. టాప్ 5కి ఎవరు వెళతారు,…
Google Sundar Pichai : అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ Donald Trump మరియు Google గూగుల్ సీఈఓ…
India : కొన్నేళ్లుగా భారత్- కెనడా దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుండడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే తాజాగా,…
Bank Account : ఒకప్పుడు ఒక వ్యక్తికి ఒక బ్యాంక్ ఖాతా మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు ఒక్కో వ్యక్తికి…
Periods : ప్రస్తుతం మన జీవనశైలి మరియు ఆహారపు అలవాట్లలో వచ్చిన మార్పుల కారణం చేత యువతను ఎన్నో రకాల…
Bobby : రచయితగా కెరియర్ స్టార్ట్ చేసిన బాబి తర్వాత ఆ అసిస్టెంట్ డైరెక్టర్‌గా మారాడు. పవర్ సినిమాకి బాబీ…
This website uses cookies.