Bengali style chicken rezala : బెంగాలీ స్టైల్లో రంజాన్ స్పెషల్ చికెన్ రెసిల్ మేనియా.. ఒక్కసారి తిన్నారంటే!
Bengali style chicken rezala : రంజాన్ మాసం పేరు వినగానే గుర్తొచ్చేది ఇఫ్తార్ విందు. నెలంతా సాగే ఒక్కపొద్దులు. అలాగే హలీమ్… ఎక్కడ చూసినా హలీమ్, చికెన్, మటన్ ల ఘుమఘుమలు నోట్లో నీళ్లు ఊరేలా చేస్తాయి. అయితే రంజాన్ స్పెషల్ ఐటమ్ అయిన బెంగాలీ స్టైల్ చికెన్ రెజాలా గురించి మీకు తెలిసే ఉంటుంది. రెస్టారెంట్లలో ఎక్కువగా ఈ పదార్థాన్ని తిని ఉంటారు. అయితే దీన్ని ఇంట్లో కూడా తయారు చేసుకోవాలని తినాలని చాలా మందికి అనిపిస్తుంటుంది. కానీ ఎలా చేసుకోవాలో తెలియక.. రెస్ారెంట్ల చుట్టూ తిరుగుతారు. కానీ ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ లో చికెన్ రెజాలా తయారు చేసుకోండి. అయితే ఎలా తయారు చేసుకోవాలో చూసి మీరు ఓసారి ట్రై చేయండి.
ముందుగా కావాల్సిన పదార్థఆలు.. సన్నగా తరిగిన ఒక ఉల్లిపాయ, ఒక అంగుళం పొడవున్న అల్లం, నాలుగు వెల్లుల్లి రెబ్బలు, 10 జీడిపప్పు, 2 టేబుల్ స్పూన్ల గసగసాలు, 2 బిర్యానీ ఆకులు, 4 లవంగాలు, 2 ఏలకులు, ఒక అంగుళం పొడవున్న దాల్చిన చెక్క, 4 మిరపకాయలు, టేబుల్ స్పూన్ గరం మసాలా, టేబుల్ స్పూన్ మిరియాల పొడి, రుచికి సరిపడా ఉప్పు, 2 టేబుల్ స్పూన్ల ఆవాల నూనె, కిలో చికెన్, కప్పు పెరుగు, ఒక టేబుల్ స్పూన్ చక్కెర, కొద్దిగా కుంకుమ పువ్వు.
తయారీ విధానం… ముందుగా మిక్సీ జార్ లో ఉల్లిపాయలు, అల్లం, వెల్లుల్లి వేసి గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత మిక్సీ జార్ ను బాగా కడిగి.. జీడిపప్పు, గసగసాలు, నీళ్లు పోసి బాగా గ్రైండ్ చేయాలి, తర్వాత ఒక గిన్నెలో.. సగం ఉల్లిపాయ ముద్ద, సగం జీడి పప్పు ముద్ద వేసి అందులో పెరుగు, కావాల్సినంత ఉప్పు, టీస్పూన్ మిరియాల పొడి వేసి కనీసం గంట సేపు ఫ్రిజ్ లో పెట్టాలి. తర్వాత ఫ్రైయింగ్ పాన్ పెట్టి అందులో నూనె పోసి వేడయ్యాక బిర్యానీ ఆకు, పొట్టు, లవంగాలు, యాలకులు, పచ్చి మిర్చి వేసి వేయించాలి. తర్వాత మిగిలిన ఉల్లిపాయ పేస్టు వేసి కొన్ని నిమిషాలు ఉడికించాలి. తర్వాత మిగిలిన జీడిపప్పు ముద్దను వేసి ఒకసారి కలపాలి. చివరగా నానబెట్టిన చికెన్, గరం మసాలా, ఉప్పు వేసి బాగా కలపాలి. మూత పెట్టి తక్కువ వేడి మీదు 25 నిమిషఆలు ఉడక బెట్టాలి. తర్వాత మూత తెరిచి పంచదార, రుచికి సరిపడా ఉప్పు వేసి పైన కాస్త కుంకుమ పువ్వు చల్లితే రుచికరమైన బెంగాలీ స్టైల్ చికెన్ రెసాలా రెడీ.