RaviChandraReddy : మంచి తన ఖాతా.. చెడు మాత్రం జనం ఖాతా.. రవిచంద్రారెడ్డి
RaviChandraReddy : చంద్రబాబు తప్పు జరిగినప్పుడు ఏనాడూ బాధ్యతాయుతంగా వ్యవహరించలేదని, మంచి జరిగితే గొప్పలు చెప్పుకోవడం తప్ప ప్రజలకు ఏనాడూ మంచి చేసిన పాపాన పోలేదుని వైఎస్సార్ సీపీ మీడియా కో ఆర్డినేటర్ రవిచంద్రారెడ్డి విమర్శించారు. ఇదే తరహాలో కందకూరు, గుంటూరు ఘటనలను ప్రమాదాలుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ బాధ్యతారాహిత్యం, చంద్రబాబు పబ్లిసిటీ స్టంట్ల కోసం జరిగిన రోడ్ షో ల్లో అమాయకులు బలైపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్సార్ సీపీ కార్యాలయంలో మీడియా కో ఆర్డినేటర్ రవిచంద్రారెడ్డి గురువారం నాడు మీడియాతో మాట్లాడారు.
చంద్రబాబు నాయుడు ఏ రోజు ఏబాధాకరమైన సంఘటనకు భాద్యత తీసుకోలేదని. ఏదైనా మంచి జరిగితే మాత్రం అది నా వల్లే అని చెప్పుకుంటారని ఎద్దేవా చేశారు. చెడు జరిగితే మాత్రం తనకు సంబంధం లేదని తప్పించుకుంటారని విమర్శించారు. ఆయనలాగే ప్రభుత్వం కూడా భాద్యత లేకుండా ఉంటే ప్రజల ప్రాణాలకు భద్రత ఎలా ఉంటుందని ప్రశ్నించారు? కందకూరు, గుంటూరు ఘటనల నేపథ్యంలో ప్రజల ప్రాణాల రక్షణ కోసం వైస్సార్ సీపీ ప్రభుత్వం జీవో నెంబర్ 1 ని తెచ్చిందన్నారు. చంద్రబాబు ఎల్లో మీడియాతో కలిసి జీవోకు వక్రభాష్యం కట్టి తప్పుడు
ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ జోవో లో ఎక్కడా సభలు పెట్టుకోవద్దని ప్రభుత్వం చెప్పలేదన్నారు. అనుమతి తీసుకుని ఎవరైనా సభలు పెట్టుకోవచ్చని స్పష్టంగా ఉత్తర్వుల్లో పేర్కొన్నట్లు వివరించారు. ఈ జీవో లోని షరతులు కేవలం టీడీపీ మాత్రమే కాదు వైస్సార్ సీపీ తో సహా అన్ని పార్టీలకు వర్తిస్తాయని వివరించారు. చంద్రబాబు మీద కక్ష్యతోనే జీవో తెచ్చారని భావిస్తే ఎన్నో అనవసరమైన వాటికి ప్రభుత్వం మీద కక్ష్యతో కోర్ట్ మెట్లెక్కే చంద్రబాబు ప్రస్తుత జీవోపై నిరభ్యంతరంగా కోర్టుకు వెళ్లొచ్చని పార్టీ మీడియా కో ఆర్డినేటర్ రామచంద్రారెడ్డి సవాల్ విసిరారు.