Ravindra Jadeja Wife : గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలలో 50 వేల మెజార్టీతో గెలిచిన క్రికెటర్ జడేజా భార్య..!!
Gujarat Elections 2022 : గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలలో టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య రివాబా జడేజా ఎమ్మెల్యేగా గెలుపొందారు. గుజరాత్ లోని జాంనగర్ నియోజకవర్గం నుండి బీజేపీ పార్టీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసి భారీ మెజార్టీతో గెలుపొందారు. 2019లో జడేజా భార్య బీజేపీలో జాయిన్ అయింది. ఈ క్రమంలో బిజెపి అధిష్టానం సిట్టింగ్ ఎమ్మెల్యే ధర్మేంద్ర సీన్హాకి టికెట్ ఇవ్వకుండా జడేజా భార్యకి..
టికెట్ ఇవ్వడంతో ప్రచారంలో బాగా కష్టపడి విజయం సాదించింది.రివాబా ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా గెలిచి గుజరాత్ అసెంబ్లీలో ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతుంది. ఇదిలా ఉంటే ఇదే ఎన్నికలలో రివాబా ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి జడేజా తండ్రి మరియు సోదరి ఆయనకు మద్దతు తెలపడం జరిగింది. ఈ క్రమంలో భార్య గెలుపు కోసం జడేజా.. ప్రచారంలో కీలకంగా రాణించాడు. పోటాపోటిగా జరిగిన ఎన్నికలలో భార్య..
బీజేపి గెలవటంతో జడేజా ఫుల్ సంతోషంగా ఉన్నారట. మరోపక్క T20 వరల్డ్ కప్ టోర్నీ ఆడకుండా.. గాయం కారణంగా హాస్పిటల్లో ఉండి తర్వాత ఎన్నికల ప్రచారంలో జడేజా పాల్గొనడంతో చాలామంది విమర్శలు చేయడం జరిగింది. జరిగిన ఈ అసెంబ్లీ ఎన్నికలలో రివాబా 50 వేల మెజార్టీతో గెలవడం జరిగింది. దీంతో భార్య గెలుపుతో జాంనగర్ లో ఆమెతో కలిసి జడేజా భారీ ర్యాలీ నిర్వహించి.. ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు.