RBI : రుణ గ్రహీతలకు RBI శుభవార్త… EMI భారం తగ్గింపు…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

RBI : రుణ గ్రహీతలకు RBI శుభవార్త… EMI భారం తగ్గింపు…!

 Authored By ramu | The Telugu News | Updated on :11 April 2024,4:05 pm

ప్రధానాంశాలు:

  •  RBI : రుణ గ్రహీతలకు RBI శుభవార్త... EMI భారం తగ్గింపు...!

RBI : ఇటీవల జరిగిన ద్రవ్య విధాన సమావేశాలలో RBI కీలక నిర్ణయాన్ని ప్రకటించింది. దీనిలో భాగంగానే ఈసారి రెపో రేట్లలో ఎలాంటి మార్పు చేయలేదు. అంటే 7వ సారి కూడా రేట్లు స్థిరంగానే ఉంచిందని చెప్పాలి. ఒకవేళ ఆర్.బి.ఐ రెపో రేట్లను మార్చినట్లయితే దాని ప్రభావం మీరు బ్యాంకులో తీసుకున్న రుణాలపై పడే అవకాశంశం ఉంటుంది. అంటే మీ EMI విపరీతంగా పెరుగుతుందన్నమాట. అయితే ప్రస్తుత కాలంలో చాలామంది బ్యాంకులలో వివిధ రకాలుగా రుణాలను తీసుకుంటున్నారు. గృహ రుణం ,వాహన రుణం ఇతర ఏవైనా రుణాలు తీసుకున్నట్లయితే ఈ EMI లో కాస్త మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది.

RBI : రెపో స్థిరత్వం

తాజాగా జరిగిన ద్రవ్య విధాన సమావేశాలలో ఆర్.బీ.ఐ వరుసగా 7వ సారి కూడా రెపో రేట్లను స్థిరంగా ఉంచేందుకు నిర్ణయం తీసుకుంది. దీంతో రెపో రేట్లు ప్రభావితం ఇప్పుడు రుణాలపై పడే అవకాశం లేదు కాబట్టి రుణ గ్రహీతల లోన్స్ EMI ప్రస్తుతానికి అలాగే కొనసాగుతాయి.  ఉదాహరణకు. .. మీరు ఒక 20 సంవత్సరాలకు గాను 8.60% వడ్డీటు తో 25 లక్షల గృహరుణాన్ని తీసుకున్నారు అనుకోండి. దీనికి గాను నెలకు EMI రూ.21,854 అవుతుంది. ఇదే నిబంధన ప్రకారం 40 లక్షల రుణాన్ని పొందినట్లయితే దానికి గాను నెలకు EMI రూ.34,967 ,అవుతుంది. అయితే ప్రస్తుతం ఆర్.బి.ఐ రెపో రేట్లలో ఎలాంటి మార్పు చేయలేదు కాబట్టి మీ యొక్క EMI లలో కూడా ఎలాంటి మార్పు ఉండదు.

RBI రుణ గ్రహీతలకు RBI శుభవార్త EMI భారం తగ్గింపు

RBI : రుణ గ్రహీతలకు RBI శుభవార్త… EMI భారం తగ్గింపు…!

RBI భవిష్యత్తులో జరిగే మార్పులు..

రాబోయే కాలంలో ఒకవేళ RBI ద్వారా రెపో రేట్లు ఏమైనా మార్పులు చెందినట్లయితే బ్యాంకులలో మరియు ఆర్థిక సంస్థల ద్వారా తీసుకున్న రుణాలపై వడ్డీ రేట్లు పై కూడా సవరణలు జరుగుతాయి. ఒకవేళ రెపో రేట్లు పెరిగినట్లయితే రుణ వడ్డీ రేట్లు కూడా పెరిగిపోతాయి. దీనికి విరుద్ధంగా RBI రెపో రేటు తగ్గించినట్లయితే వడ్డీ రేట్లు కూడా తగ్గే అవకాశం ఉంటుంది. ఫలితంగా మీరు మరింత సరసమైన రుణాలను అందుకుంటారు. మొత్తానికి ఇప్పుడు రెపో రేట్లు స్థిరత్వంగా ఉండటం వలన రుణ గ్రహీతలు ప్రయోజనాలను పొందారనే చెప్పాలి.

Tags :

ramu

Tandu Ramalingaiah ( Ramu ) is experienced in Media field. He worked in various Telugu media houses for about 15 years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Chief Editor of thetelugunews.com website. Contact Details : thetelugunews1@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి