Realme 9i 5G : అతి తక్కువ ధరలో 5జీ స్మార్ట్ ఫోన్…15 వేలలో రియల్ మీ 9 ఐఫోన్ | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Realme 9i 5G : అతి తక్కువ ధరలో 5జీ స్మార్ట్ ఫోన్…15 వేలలో రియల్ మీ 9 ఐఫోన్

Realme 9i 5G : ఇప్పుడు స్మార్ట్ ఫోన్ల వినియోగం ఎక్కువ అవుతుంది. ఇప్పుడు ప్రతి ఒక్కరికి స్మార్ట్ ఫోన్ లేనిదే తమ జీవనం సాగలేనట్టుగా ఉంది. ప్రతిదీ ఫోన్లోనే చేసుకుంటున్నారు. ఉదాహరణకి షాపింగ్ కూడా ఫోన్ ద్వారా అలా చేస్తున్నారు. కరెంట్ బిల్లు కట్టడం, ఒకరికి మనీ పంపించడం ఇలా ఎన్నో పనులను స్మార్ట్ ఫోన్ల ద్వారానే చేస్తున్నారు. రీఛార్జ్ అయిపోకముందే రీఛార్జ్ కోసం డబ్బులను ముందుగానే పోగు చేసుకుంటున్నారు. అంతా ప్రాముఖ్యత ఉంది. కొందరి […]

 Authored By aruna | The Telugu News | Updated on :7 August 2022,8:20 pm

Realme 9i 5G : ఇప్పుడు స్మార్ట్ ఫోన్ల వినియోగం ఎక్కువ అవుతుంది. ఇప్పుడు ప్రతి ఒక్కరికి స్మార్ట్ ఫోన్ లేనిదే తమ జీవనం సాగలేనట్టుగా ఉంది. ప్రతిదీ ఫోన్లోనే చేసుకుంటున్నారు. ఉదాహరణకి షాపింగ్ కూడా ఫోన్ ద్వారా అలా చేస్తున్నారు. కరెంట్ బిల్లు కట్టడం, ఒకరికి మనీ పంపించడం ఇలా ఎన్నో పనులను స్మార్ట్ ఫోన్ల ద్వారానే చేస్తున్నారు. రీఛార్జ్ అయిపోకముందే రీఛార్జ్ కోసం డబ్బులను ముందుగానే పోగు చేసుకుంటున్నారు. అంతా ప్రాముఖ్యత ఉంది. కొందరి ఇంట్లో అయితే రెండు లేదా మూడు మొబైల్ ఫోన్లను వాడుతున్నారు. మరికొందరు ఎక్కడికి పోయినా ఫోన్ లేకుండా మాత్రం పోరు. ఏదైనా ఊరు వెళ్ళేటప్పుడు పర్స్ మర్చిపోతారేమో కానీ స్మార్ట్ ఫోన్ మాత్రం మర్చిపోరు. అంతలా ప్రాముఖ్యత పెరిగింది.

అయితే ఇప్పటిదాకా స్మార్ట్ ఫోన్లో 4జీ డేటానే అందుబాటులో ఉంది. అయితే మరి కొద్ది రోజుల్లోనే 5జీ సేవలు అందుబాటులోకి వస్తాయని తెలుస్తుంది. మనదేశంలో మరికొన్ని రోజుల్లోనే 5జీ సేవలు అందుబాటులోకి వస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే 5జీ ఫోన్లు మార్కెట్లో సందడి చేస్తున్నాయి. తాజాగా రియల్ మీ కొత్త 5జీ ఫోను లాంచ్ చేస్తున్న ఈ స్మార్ట్ ఫోన్ మీడియా టెక్ డైమండ్ సిటీ 8,10 ప్రాసెసర్ తో పనిచేస్తుంది. మొత్తం మూడు కలర్స్ లో ఫోన్ ను లాంచ్ చేయనున్నారు.

Realme 9i 5G New Realme Smart Phone Brand In 15000 Rs

Realme 9i 5G New Realme Smart Phone Brand In 15000 Rs

6.7 ఇంచెస్ డిస్ప్లేను అందించిన స్మార్ట్ ఫోన్ ధర 15,000 గా ఉండవచ్చు. ఈ స్మార్ట్ ఫోన్ పై ఆగస్టు 18 వ తేదీన స్పష్టత రానుంది. ఈ స్మార్ట్ ఫోన్లో కెమెరాకు అధిక ప్రాధాన్యత ఉంది. ఈ ఫోన్లో 64 మెగా పిక్సెల్, 8, 2 ఎంపీలతో కూడిన ట్రిపుల్ లేయర్ కెమెరా, సెల్ఫీల కోసం 16 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరాలను అందించనున్నారు. 5000 ఎంఏహెచ్ బ్యాటరీ సొంతం. భారత్ లో 5జీ స్మార్ట్ ఫోన్లు అందుబాటులోకి వస్తున్న సమయంలో సామాన్యులకు కూడా అందుబాటులో దొరికేలా ఈ ఫోను లాంచ్ చేయనున్నట్లు రియల్ మీ వారు తెలిపారు.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది