Redmi Note 11S : రెడ్ మీ అదిరిపోయే ఫీచర్స్‌తో సామాన్యులకి అందుబాటులో ఉండే సరికొత్త ఫోన్స్‌ని తీసుకొస్తుంది. రెడ్‌మీ నోట్ 11 సిరీస్‌లో తదుపరి రానున్న ఈ మొబైల్ ఫిబ్రవరి 9న మన దేశంలో లాంచ్ కానుంది. రెడ్‌మీ నోట్ 11 సిరీస్‌లో భారత్‌లో లాంచ్ కానున్న రెండో బడ్జెట్ ఫోన్ ఇది. ఇటీవలే రెడ్‌మీ నోట్ 11టీ 5జీ రాగా, వచ్చే నెల 9న 11ఎస్ రానుంది. ఈ తరుణంలో రెడ్‌మీ నోట్ 11ఎస్ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు తదితర వివరాలు బయటికి వచ్చాయి. ఇందులో అమోఎల్ఈడీ డిస్‌ప్లే ఉండే అవకాశం ఉంది.రెడ్‌మీ నోట్ 11ఎస్‌తో పాటు నోట్ 11 సిరీస్ కూడా లాంచ్ కానుందని తెలుస్తోంది.
రెడ్‌మీ నోట్ 11 మోడల్స్ చైనాలో గతేడాది అక్టోబర్‌లోనే లాంచ్ అయ్యాయి. రెడ్‌మీ ఇండియా అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా ఈ స్మార్ట్ ఫోన్ గురించి తెలియజేసింది. రెడ్‌మీ నోట్ 11ఎస్ వెనుక నాలుగు కెమెరాలు ఉండనుండగా, 108 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాగా ఉంటుందని సమాచారం. రెడ్‌మీ నోట్ 10 ప్రో మ్యాక్స్ లో ఉన్న కెమెరా సెన్సార్ దీంట్లోనూ ఉండే అవకాశం ఉంది. అలాగే 8 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ సెన్సార్, 2 మెగాపిక్సెల్ ఓమ్నీ విజన్ మాక్రో షూటర్, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ ఉండనున్నాయి.సాధారణంగా రెడ్‌మీ నోట్ సిరీస్ స్మార్ట్ ఫోన్లు రూ.20 వేలలోపు ధరతోనే లాంచ్ అవుతాయి. ఈ ఫోన్ ధర కూడా అదే రేంజ్‌లో ఉండే అవకాశం ఉంది.
రెడ్‌మీ నోట్ 11ఎస్‌లో అమోఎల్ఈడీ డిస్‌ప్లేను అందించనున్నట్లు తెలుస్తోంది. బీఐఎస్, ఎన్‌బీటీసీ లిస్టింగ్‌ల్లో కూడా రెడ్‌మీ నోట్ 11ఎస్ కనిపించింది. రెడ్‌మీ నోట్ 11 సిరీస్ గ్లోబల్ లాంచ్ ఈవెంట్‌ను కంపెనీ జనవరి 26వ తేదీన నిర్వహించనుంది. ఈ సిరీస్‌లో రెడ్‌మీ నోట్ 11 4జీ, రెడ్‌మీ నోట్ 11 5జీ, రెడ్‌మీ నోట్ 11 ప్రో, రెడ్‌మీ నోట్ 11 ప్రో ప్లస్ స్మార్ట్ ఫోన్లు ఉండే అవకాశం ఉంది. రెడ్ మీ నోట్ 11 ఎస్ ఫోన్ 5000 ఎంఏహెచ్ బ్యాటరీతో రానుండగా.. 33వాట్ల ఫాస్ట్ చార్జింగ్‌కు సపోర్ట్ చేయనుంది. గరిష్ఠంగా 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజీతో వచ్చే అవకాశం ఉంది.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.