ariyana glory reacts to the fan desire
Ariyana : అరియానా.. ఈ పేరు ఒకప్పుడు చాలా తక్కువ మందికి తెలుసు. రామ్ గోపాల్ వర్మ ఆమె ఫిగర్ గురించి కామెంట్ చేయడంతో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యింది. అలా యాంకర్ అరియానా పేరు మార్మోగిపోగా… ఇమేజ్ వచ్చిపడింది. ఇక బిగ్‌బాస్‌లోకి ఎంట్రీ ఇచ్చి తన గడుసు తనంతో… తన చిలిపి తనంతో.. తెలుగు ప్రేక్షకుల మనసు గెలుచుకున్నారు. సెలబ్రిటీగా ఫేమస్ అయిపోయింది. మోడల్ గా … యాంకర్‌గా, నటిగా ఇలా తనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ అదరగొడుతుంది.బిగ్ బాస్ షో అరియానా కెరీర్ కి బాగానే ఉపయోగపడింది. బయటికి వచ్చాక అరియానాకు మంచి ఆఫర్స్ దక్కాయి. ఇటీవల బిగ్ బాస్ సీజన్ 5 ముగిసింది.
ఇక బిగ్ బాస్ బజ్ షోకి అరియానా యాంకర్ గా వ్యవహరించారు. ఎలిమినేటైన కంటెస్టెంట్స్ ని వరుసగా ఇంటర్వ్యూలు చేశారు. రాహుల్ సింప్లిగంజ్ బాధ్యత అరియానా తీసుకున్నారు. అందరి నుండి ఆసక్తికర ప్రశ్నలు అడుగుతూ ఫుల్‌గానే ఎంటర్‌టైన్ చేసింది. ఇక వీలున్నప్పుడల్లా మెహబూబ్, సోహెల్‌లతో కలిసి అరియానా రీల్ వీడియోలు చేస్తుంటుంది. రీసెంట్‌గా ఓ రీల్ వీడియోను షేర్ చేసింది. దానిపై ఓ నెటిజన్ స్పందించింది.అడ్వాన్స్ హ్యాపీ బర్త్ డే అరియానా గ్లోరీ, నేను నీకు పెద్ద అభిమానిని. నువ్వే నాకు స్ఫూర్తి.. నాకు మెసెజ్‌కు రిప్లై ఇస్తే నాకు అదే పెద్ద అచ్చీవ్ మెంట్.. అదే నాకు ఎక్కువ..
ariyana glory reacts to the fan desire
నాకు రిప్లై ఇవ్వండి ప్లీజ్ అని వేడుకుంది. దీంతో అరియానా స్పందించింది. థ్యాంక్యూ సో మచ్.. టేక్ కేర్ అని రిప్లై పెట్టేసింది. దీంతో అభిమాని ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. పట్టలేని సంతోషంతో ఉప్పొంగిపోతుంది. కాగా, అరియానా అనుభవించు రాజా సినిమాతో తెరంగేట్రం చేసింది అరియానా. ఆ సినిమా అంతగా వర్కవుట్ కాలేదు. అరియానాకు కూడా అంత మంచి పేరేమీ రాలేదు. దీంతో మంచి సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుంది.
CMF Phone 2 Pro | దసరా పండగ సీజన్ సందడిలో ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ జోష్‌తో సాగుతోంది.…
Corona | కరోనా మహమ్మారి వెనుకడుగు వేసినా… దాని ప్రభావాలు ఇప్పటికీ చాలా మందిపై కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఘ్రాణశక్తి…
AP Farmers | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2025-26 పత్తి సీజన్‌కు సంబంధించి కీలక మార్గదర్శకాలను విడుదల చేసింది. రైతుల సంక్షేమాన్ని…
TGSRTC | దసరా పండుగను పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ) ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. పండుగ సందర్భంగా…
OG Collections | సుజీత్ దర్శకత్వంలో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన ఓజీ బారీ అంచనాల మధ్య సెప్టెంబర్…
OG | పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘ఓజీ’ (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) టికెట్ ధరల పెంపుపై తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ…
Coconut | కొబ్బరి అంటేనే మనం వెంటనే ఆరోగ్యానికి మంచిదని భావిస్తాం. పచ్చి కొబ్బరి, కొబ్బరి నీళ్లు, కొబ్బరి నూనె…
Jackfruit seeds | రోజురోజుకూ మారుతున్న వాతావరణం, పుట్టుకొస్తున్న కొత్త వైరస్‌లు ప్రజల ఆరోగ్యాన్ని ముప్పుతిప్పులు పెడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో…
This website uses cookies.