Revanth Reddy : పోలెపల్లి ఎల్లమ్మపై ఒట్టేసి చెబుతావా? ఆ విషయంపై కేటీఆర్ కు రేవంత్ రెడ్డి సవాల్ ?
Revanth Reddy నిజంగా రేవంత్ రెడ్డి అంటేనే ఓ ఫైర్ బ్రాండ్. తెలంగాణలో రేవంత్ రెడ్డి లాంటి డేర్ ఉన్న నేత అయితే లేరు. ఆయనకు తెలంగాణలో ఉన్న ఫ్యాన్ ఫాలోయింగే వేరు. ముఖ్యంగా ఆయన డేర్ నెస్ కు చాలామంది ఫిదా అయిపోతారు. ఎదుటివారు ఎంతటివారు అయినా సరే.. వాళ్లను విమర్శించడంలో రేవంత్ రెడ్డి దిట్ట. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను విమర్శించడానికి చాలామంది నేతలు భయపడతారు కానీ.. రేవంత్ రెడ్డి మాత్రం డైరెక్ట్ గానే కేసీఆర్ ను విమర్శిస్తారు. కేటీఆర్ పై విమర్శనాస్త్రాలు సంధిస్తారు. టీఆర్ఎస్ పార్టీనే ఇరకాటంలో పడేస్తారు.

revanth reddy direct challenge to minister ktr
Revanth Reddy కొడంగల్ అభివృద్ధిపై మంత్రి కేటీఆర్ కు సవాల్
తాజాగా మంత్రి కేటీఆర్ కు ఎంపీ రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. కొడంగల్ అభివృద్ధి విషయంలో రేవంత్ రెడ్డి.. మంత్రి కేటీఆర్ కు సవాల్ విసిరారు. కొడంగల్ లో అభివృద్ధి నాహయాంలోనే జరిగింది. నేనే కొడంగల్ ఆత్మగౌరవాన్ని నిలబెట్టాను. కాదని ఎవరైనా అంటారా? అబద్ధాలు ప్రచారం చేసేది మీరు. పాత పథకాలకు కొత్త రంగులు వేసి పేపర్ లో అబద్ధాలు రాసి ప్రచారం చేస్తున్నారు. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పటి నుంచి అంటే 2009 నుంచి 2018 వరకు కొడంగల్ ఎంత అభివృద్ధి చెందిందో కొడంగల్ ప్రజలకు తెలుసు. 2019 నుంచి ఇప్పటి వరకు కొడంగల్ లో ఒక్క పథకమైనా మీది వచ్చినట్టు పోలేపల్లి ఎల్లమ్మపై ఒట్టేసి ఆధారం చూపించగలవా కేటీఆర్.. అంటూ రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు.