Revanth Reddy : ఎన్టీఆర్ , వైయస్సార్ బాటలోనే రేవంత్ రెడ్డి .. అదే సెంటిమెంట్ రిపీట్ ..!
Revanth Reddy : తెలంగాణ రెండవ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఈరోజు(డిసెంబర్ 7)న ప్రమాణ స్వీకారం చేశారు. భాగ్యనగరం నడి బొడ్డును ఎల్బీ స్టేడియంలో తెలంగాణ ప్రజల నడుమ తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు రేవంత్ రెడ్డి. ఈ క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డి ఓ సెంటిమెంటును ఫాలో అయ్యారని జనం చెప్పుకుంటున్నారు. సాధారణంగా సీఎం ప్రమాణ స్వీకార వేడుక రాజ్ భవన్ లోనే జరుగుతుంది. కానీ అందుకు భిన్నంగా ప్రజల మధ్య ప్రమాణ స్వీకారం చేసి తొలిసారి ట్రెండ్ క్రియేట్ చేశారు ఎన్టీ రామారావు. 1994లో తెలుగుదేశం పార్టీని ఘనంగా గెలిపించి ఎల్బీ స్టేడియంలో నాటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు ప్రమాణస్వీకారం చేశారు. అచ్చ తెలుగులో మాట్లాడి తెలుగు ప్రజల మెప్పును పొందారు. ఆ తర్వాత వైయస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్రతో కాంగ్రెస్ ని గెలిపించి అదే ఎల్బీ స్టేడియంలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించిన తర్వాత ఈ ప్రమాణ స్వీకారం జరిగింది.
వెంటనే వైయస్సార్ ఉచిత విద్యుత్ పై తొలి సంతకం చేశారు. ఇక ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా అదే ట్రెండును కంటిన్యూ చేస్తూ మరో చరిత్ర సృష్టించారు. ఎన్టీఆర్, వైయస్సార్ బాటలోనే అదే ఎల్బీ స్టేడియంలో తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. ఆ వెంటనే ఎన్నికలకు ముందు చెప్పిన ఆరు గ్యారెంటీ లపై తొలి సంతకం చేశారు. రేవంత్ రెడ్డి అనే నేను అంటూ రాజ్యాంగబద్ధంగా ప్రమాణ స్వీకారం చేసిన ఆయన చివర్లో అంతఃకరణ చిత్తశుద్ధితో తన బాధ్యతలను నెరవేరుస్తాను అని రేవంత్ రెడ్డి అన్నారు. సాధారణంగా అందరూ అంతఃకరణ శుద్ధితో అని అంటారు. గవర్నర్ తమిళ్ సై సౌందరరాజన్ ఆయనతో అదే పలికించారు. కానీ రేవంత్ రెడ్డి అంతఃకరణ చిత్త శుద్ధితో అంటూ తన చిత్తశుద్ధి ఇదే అనే సంకేతం ఇచ్చారు.
ఇక రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం జరుగుతున్న సమయంలో ఎల్బీ స్టేడియం మారుమ్రోగిపోయింది. తెలంగాణ ప్రజలంతా ఈ వేడుకను కన్నుల పండుగగా తిలకించారు. ఇక రేవంత్ రెడ్డికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలుపుతూ పలువురు సినీ రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియాలో సందేశాలు పోస్ట్లు చేశారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పై ప్రజల్లో చాలా అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా యువత, నిరుద్యోగులు, రైతులు, మహిళలు ఆయనపై చాలా ఆశలు పెట్టుకున్నారు. ఇచ్చిన హామీలను ఆయన చిత్తశుద్ధితో నెరవేర్చాలని కోరుకుంటున్నారు. సీఎం అయిన తర్వాత రేవంత్ రెడ్డి తొలి సంతకం ఆరు గ్యారెంటీ లపై చేయగా, రెండో సంతకం దివ్యాంగురాలు అయిన రజినీకి ఉద్యోగం కల్పిస్తూ ఫైల్ పై సంతకం చేశారు.
Hero Vida : భారత ఎలక్ట్రిక్ వాహన రంగంలో గణనీయమైన పురోగతి నమోదు అవుతోంది. దీనిలో భాగంగా హీరో మోటోకార్ప…
PM Kisan : పీఎం కిసాన్ రైతుల కోసం ఆగస్టు 2న 20వ విడత విడుదల అయింది. యూపీలోని వారణాసి…
Dharmasthala : కర్ణాటకలోని ధర్మస్థల మృతదేహాల మిస్టరీని ఛేదించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) రంగంలోకి దిగింది. నేత్రావతి నది…
Gudivada Amarnath : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ముఖ్యమంత్రి…
Annadata Sukhibhava : ఆంధ్రప్రదేశ్లో రైతన్నలకు శుభవార్త! ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లా దర్శి మండలం వీరాయపాలెంలో 'అన్నదాత…
Eyebrows Risk : ఈరోజుల్లో ప్రతి ఒక్కరు అందం కోసం బ్యూటీ పార్లర్ చుట్టూ అమ్మాయిలు తెగ తిరిగేస్తూ ఉంటారు.…
Monsoon Season : సాధారణంగా వర్షాకాలం వచ్చిందంటే చాలా మంది వేడి నీళ్లతో స్నానం చేయాలని హిటర్ వాడుతుంటారు. చలికాలంలో…
Samudrik Shastra : ప్రస్తుత కాలంలో అమ్మాయిలు కొంతమంది కడుపు మీద వెంట్రుకలు ఉంటే చాలా బాధపడిపోతుంటారు. పొట్ట మీద…
This website uses cookies.