Revanth Reddy : బీజేపీ, టీఆర్ఎస్ మధ్య ఉన్న చీకటి ఒప్పందాన్ని ప్రూఫ్స్ తో సహా బయట పెట్టిన రేవంత్ రెడ్డి? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Revanth Reddy : బీజేపీ, టీఆర్ఎస్ మధ్య ఉన్న చీకటి ఒప్పందాన్ని ప్రూఫ్స్ తో సహా బయట పెట్టిన రేవంత్ రెడ్డి?

 Authored By jagadesh | The Telugu News | Updated on :23 April 2021,3:34 pm

Revanth Reddy : కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి ఏం మాట్లాడినా దానికో అర్థం, పరమార్థం ఉంటుంది. ఆయన ప్రూఫ్స్ లేకుండా మాట్లాడరు. అధికార టీఆర్ఎస్ పార్టీ చేస్తున్న అక్రమాలపై ఆయన ఎన్నోసార్లు ప్రూఫ్స్ తో సహా బయటపెట్టారు. కాంగ్రెస్ పార్టీలో దమ్మున్న నాయకుడు అంటే రేవంత్ రెడ్డి అనే చెప్పుకోవాలి. అందుకే.. కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ కూడా ఎక్కువగా రేవంత్ రెడ్డినే హైలెట్ చేస్తోంది. ఇటీవలే ఇంద్రవెల్లికి వెళ్లి అక్కడ 40 ఏళ్ల క్రితం భూమి, భుక్తి కోసం జరిగిన పోరాటంలో అసువులు బాసిన ఆదివాసీలను ఆదుకోవాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

revanth reddy on bjp and trs party

revanth reddy on bjp and trs party

తాజాగా మరోసారి రాష్ట్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. మీడియాతో చిట్ చాట్ లో పాల్గొన్న రేవంత్ రెడ్డి తెలంగాణలో బీజేపీ, టీఆర్ఎస్ పార్టీ మధ్య ఉన్న చీకటి ఒప్పందాన్ని బట్టబయలు చేశారు. బీజేపీలో రెండు వర్గాలు ఉన్నాయి. అందులో ఒక వర్గం టీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఉంటుంది. ఆ వర్గం కోసం ఎప్పటికీ ప్రగతి భవన్ గేట్లు తెరుచుకొనే ఉంటాయి. వాళ్ల కోసం తెరుచుకునే ప్రగతి భవన్ గేట్లు… ప్రజాప్రతినిధుల కోసం, పబ్లిక్ కోసం తెరుచుకోవు.. అని రేవంత్ రెడ్డి విమర్శించారు.

Revanth Reddy : కిషన్ రెడ్డి, బండి సంజయ్ మధ్య కోల్డ్ వార్

బీజేపీలో కిషన్ రెడ్డిది ఒక వర్గం అని… బండి సంజయ్ ది మరో వర్గం అని… కిషన్ రెడ్డి వర్గం టీఆర్ఎస్ తో చీకటి ఒప్పందం చేసుకుందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఆ వర్గం కేసీఆర్ కు అనుకూలంగా ఉంటుంది. మరోవైపు కిషన్ రెడ్డి, బండి సంజయ్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఇద్దరి మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. వీళ్ల మధ్యలో రామచందర్ రావును బలిపశువును చేసేందుకు కుట్ర జరిగింది. టీఆర్ఎస్ పార్టీ, బీజేపీ రెండూ కుమ్మక్కు అయ్యాయి కాబట్టే… లింగోజిగూడ ఎన్నికలో పోటీ చేయలేదు. చాలా చోట్ల రెండు పార్టీలు కలిసి ఏకగ్రీవం చేసుకున్నాయి.. అని ప్రూఫ్స్ తో బయటపెట్టారు రేవంత్ రెడ్డి.

జల్ పల్లిలో టీఆర్ఎస్, బీజేపీ కలిసి ఏకగ్రీవం చేశాయి. అప్పుడు ఎంఐఎంకు రెండు పార్టీలు మద్దతు ఇచ్చాయి. అలాగే నల్గొండ కార్పొరేషన్ లో 26వ వార్డ్ నెంబర్ దుబ్బాక కాంతమ్మ చనిపోతే… రెండు పార్టీలు తమ అభ్యర్థులను బరిలోకి దింపాయి. ఆమె కాంగ్రెస్ అభ్యర్థి. అదే లింగోజీగూడలో చనిపోతే ఎందుకు టీఆర్ఎస్, బీజేపీ పోటీ చేయడం లేదు. నల్గొండలో మాత్రం.. బీజేపీ, టీఆర్ఎస్ తో పాటు ఎంఐఎం కూడా ఎందుకు పోటీ చేస్తున్నాయి అని ప్రశ్నించారు. కనీసం చనిపోయిన మహిళ దళిత వర్గానికి చెందిన మహిళ అని కూడా కనికరం లేకుండా…. పోటీలో నిలిచారు. కిషన్ రెడ్డి చెబితేనే రామచందర్ రావు… ప్రగతి భవన్ మెట్లు ఎక్కారు. ఎలాగైనా కిషన్ రెడ్డిని కేంద్రమంత్రి పదవి నుంచి తప్పించాలని బండి సంజయ్ విపరీతంగా ట్రై చేస్తున్నారు. కిషన్ రెడ్డి కూడా బండి సంజయ్ ని తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి నుంచి తప్పించాలని తెగ ప్రయత్నాలు చేస్తున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు.

Advertisement
WhatsApp Group Join Now

jagadesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది