Revanth reddy prashant kishor Meet with Rahul Gandhi
Revanth reddy వరుస విజయాలతో పొలిటికల్ లీడర్లకంటే ఎక్కువే పాపులారిటీ తెచ్చుకున్నారు ప్రశాంత్ కిషోర్ .. రాష్ట్రాల్లో పలు పార్టీలను గెలిపించి.. తాను నెంబర్‌వన్ స్ట్రాటజిస్ట్ అని నిరూపించుకున్నారు. ఇప్పుడు మళ్లీ రాజకీయ చాణక్యం నెరపడంలో బిజీ అయిపోయారు. రాహుల్‌గాంధీ Rahul Gandhi ని ఉమ్మడి ప్రధాని అభ్యర్థిగా ప్రకటించాలని బలంగా ప్రయత్నిస్తోన్న ప్రశాంత్ కిషోర్ .. తాజాగా ఓ కీలక ముందడుగు వేశారు. ఢిల్లీలో రాహుల్ నివాసానికి వెళ్లి ఆయనతో చాలాసేపు చర్చలు జరిపారు. తాజా రాజకీయాలు, పార్టీల పొత్తులు, రాజకీయ సమీకరణాలు తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఇటీవల ముగిసిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజల నాడి ఎలా ఉంది, వచ్చే ఏడాది జరిగే మరికొన్ని రాష్ట్రాల్లో ఫలితాలు ఎలా ఉండనున్నాయి.. ఆ ప్రభావం 2024లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ఎలా ఉండబోతుందన్న తదితర కీలక అంశాలు రాహుల్‌గాంధీ Rahul Gandhi ప్రశాంత్ కిశోర్ prashant kishor వివరించినట్టు సమాచారం.
Revanth reddy prashant kishor Meet with Rahul Gandhi
ఈ భేటీలో ప్రశాంత్ కిషోర్, రాహుల్‌గాంధీ Rahul Gandhi తో పాటు ప్రియాంకాగాంధీ, కాంగ్రెస్ నేతలు కేసీ వేణుగోపాల్, హరీశ్ రావత్ తదితరులు ఉన్నారు. రాహుల్ గాంధీని ప్రధానిని చేయాలని ప్రశాంత్ కిశోర్ గట్టిగా ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. అందుకే, ఇటీవల శరద్ పవార్, యశ్వంత్‌సిన్హా ఆధ్వర్యంలో జరిగిన మూడో కూటమి సన్నాహక సమావేశంపై ప్రశాంత్ కిషోర్ prashant kishor పెదవి విరిచారు. బీజేపీకి వ్యతిరేకంగా మరో కూటమి మనుగడ సాధించలేదని అభిప్రాయపడ్డారు. బీజేపీని ధీటుగా ఎదుర్కొనే సత్తా, సత్తువ కేవలం కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉందని.. అందుకే కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ కూటమికే మోదీని గద్దె దించే శక్తిసామర్థ్యాలు ఉన్నాయని ప్రశాంత్‌కిశోర్ బలంగా నమ్ముతున్నారు. అయితే, యూపీఏ అధికారంలోకి రావాలంటే రాహుల్‌గాంధీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటిస్తేనే ప్రయోజనం ఉంటుందని గట్టిగా వాదిస్తున్నారు. అందుకే, రాహుల్‌గాంధీని పీఎం కేండిడేట్‌గా చేసేందుకు వరుస భేటీలతో ప్రశాంత్‌కిశోర్ ముందస్తు కసరత్తు ముమ్మరం చేశారని అంటున్నారు.
Revanth reddy prashant kishor Meet with Rahul Gandhi
అయితే రాహుల్ గాంధీ కోసం ఢిల్లీలో ప్రశాంత్‌కిశోర్ చేస్తున్న ప్రయత్నాలు తెలంగాణ Telangana రాజకీయాల్లోనూ విశేష ప్రభావం చూపనున్నాయి. రాహుల్‌గాంధీకి రేవంత్‌రెడ్డి Revanth reddy కి మధ్య ఉన్న దోస్తీ .. అందరికీ తెలిసిందే. గత అసెంబ్లీ ఎన్నికల్లో రాహుల్‌గాంధీ-రేవంత్ రెడ్డిలు కలిసి పని చేశారు. తెలంగాణ Telangana వ్యాప్తంగా రేవంత్‌రెడ్డి Revanth reddy సుడిగాలి ప్రచారం చేసేందుకు రాహుల్‌గాంధీ ప్రత్యేకంగా ఓ హెలికాప్టర్ కూడా అరేంజ్ చేశారంటే రేవంత్ రెడ్డిని రాహుల్ గాంధీ ఎంతగా నమ్ముతున్నారో తెలుస్తోంది. తెలంగాణ సీనియర్లంతా సోనియాగాంధీ బ్యాచ్ అయితే.. రేవంత్‌రెడ్డి మాత్రం రాహుల్‌గాంధీ మనిషి. రేవంత్ రెడ్డి Revanth reddy టాలెంట్‌ను గుర్తించడమే కాకుండా ఆయన నాయకత్వాన్ని ప్రమోట్ చేసేలా.. కాంగ్రెస్‌లో చేరిన కొద్దికాలానికే ఆయన్ను వర్కింగ్ ప్రెసిడెంట్ చేసింది రాహుల్‌గాంధీనే. తాజాగా, పీసీసీ ప్రెసిడెంట్‌గా రేవంత్ Revanth reddy ఎంపికలో రాహుల్‌గాంధీ ప్రమేయం ఉందని తెలుస్తోంది. సో.. ఆ లెక్కన.. ప్రశాంత్‌కిశోర్ ప్రయత్నాలు ఫలించి.. 2024లో రాహుల్ గాంధీ ప్రధాని అయితే.. రేవంత్‌రెడ్డికి మరోసారి ప్రమోషన్ గ్యారెంటీ అని టాక్ వినిపిస్తోంది.
పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి Revanth reddy నాయకత్వంలో కాంగ్రెస్ బలం వెయ్యింతలు పెరగడం.. ఈసారి తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తుండటం.. రేవంత్‌రెడ్డికి కలిసిరానుందని విశ్లేషకులు సైతం చెబుతున్నారు. రాహుల్‌గాంధీని ప్రధాని చేసే ప్రక్రియలో భాగంగా కాంగ్రెస్ కోసం ప్రశాంత్‌కిశోర్ prashant kishor పన్నే వ్యూహాలు, వేసే ప్రణాళికలు.. తెలంగాణలోనూ అమలు చేస్తారు. అవి ఫలిస్తే.. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ మెజార్టీ సాధిస్తే.. రాహుల్‌గాంధీ మనిషిగా రేవంత్‌రెడ్డికే ముఖ్యమంత్రి పీఠం పక్కా అంటున్నారు. పీసీసీ పదవిలా సీనియర్లు కిరికిరి పెట్టే అవకాశమే ఉండదని విశ్లేషకులు చెబుతున్నారు. ఎందుకంటే.. ప్రధాని రాహుల్ గాంధీ అయితే.. ఏమాత్రం ఆలోచించకుండా రేవంత్ రెడ్డికే సీఎం సీటు కట్టబెడతారని టాక్ నడుస్తోంది. దీంతో ఢిల్లీలో రాహుల్ గాంధీ కోసం ప్రశాంత్‌కిశోర్ చేస్తున్న ప్రయత్నాలు.. తెలంగాణలో రేవంత్‌రెడ్డికీ కలిసిరానున్నాయి.
ఇది కూడా చదవండి ==> మళ్లీ హస్తం గూటికి.. ఎప్పుడు చేరేది త్వరలో చెబుతా.. కొండా విశ్వేశ్వర్ రెడ్డి
ఇది కూడా చదవండి ==> సొంత జిల్లాలో సీఎం కేసీఆర్ కు భారీ షాక్.. టీఆర్ఎస్ గ్రాఫ్ తగ్గుతుందా..?
ఇది కూడా చదవండి ==> అన్న అలా… తమ్ముడు ఇలా… కోమటి బ్రదర్స్ రాజకీయం అదుర్స్…!
Three MLAs : తెలంగాణ రాజకీయాల్లో అనర్హత వేటు కలకలం రేపుతోంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన…
Hero Vida : భారత ఎలక్ట్రిక్ వాహన రంగంలో గణనీయమైన పురోగతి నమోదు అవుతోంది. దీనిలో భాగంగా హీరో మోటోకార్ప…
PM Kisan : పీఎం కిసాన్ రైతుల కోసం ఆగస్టు 2న 20వ విడత విడుదల అయింది. యూపీలోని వారణాసి…
Dharmasthala : కర్ణాటకలోని ధర్మస్థల మృతదేహాల మిస్టరీని ఛేదించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) రంగంలోకి దిగింది. నేత్రావతి నది…
Gudivada Amarnath : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ముఖ్యమంత్రి…
Annadata Sukhibhava : ఆంధ్రప్రదేశ్‌లో రైతన్నలకు శుభవార్త! ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లా దర్శి మండలం వీరాయపాలెంలో 'అన్నదాత…
Eyebrows Risk : ఈరోజుల్లో ప్రతి ఒక్కరు అందం కోసం బ్యూటీ పార్లర్ చుట్టూ అమ్మాయిలు తెగ తిరిగేస్తూ ఉంటారు.…
Monsoon Season : సాధారణంగా వర్షాకాలం వచ్చిందంటే చాలా మంది వేడి నీళ్లతో స్నానం చేయాలని హిటర్ వాడుతుంటారు. చలికాలంలో…
This website uses cookies.