CM KCR : సొంత జిల్లాలో సీఎం కేసీఆర్ కు భారీ షాక్‌.. టీఆర్ఎస్ గ్రాఫ్ త‌గ్గుతుందా..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

CM KCR : సొంత జిల్లాలో సీఎం కేసీఆర్ కు భారీ షాక్‌.. టీఆర్ఎస్ గ్రాఫ్ త‌గ్గుతుందా..?

 Authored By sukanya | The Telugu News | Updated on :13 July 2021,8:00 pm

CM KCR వచ్చే ఎన్నికల నాటికి టీఆర్ఎస్ గ్రాఫ్ తగ్గనుందా.. దీనికి సీఎం కేసీఆర్‌  CM KCR సొంత జిల్లానే నిదర్శనం కానుందా.. లేటెస్ట్ గా .. దుబ్బాకలో నెలకొన్న పరిస్థితులే అందుకు అర్థం పడుతున్నాయా.. అనే అనుమానాలు సర్వత్రా వినిపిస్తున్నాయి. దుబ్బాక ఉప పోరులో బీజేపీ నేత రఘునందన్ రావు గెలుపుతో .. టీఆర్ఎస్ గ్రాఫ్ తగ్గడం   మొదలైందన్న టాక్ వినిపిస్తోంది. తాజాగా దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలోని ముగ్గురు టీఆర్ఎస్ కౌన్సిలర్లు .. బీజేపీలో చేరడంతో, ఈ అభిప్రాయాలు మరింత బలపడుతున్నాయి. దీంతో రోజురోజుకు సిద్ధిపేటలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయని తెలుస్తోంది. టీఆర్ఎస్, కాంగ్రెస్, ఇతర పార్టీలకు చెందిన నేతలు .. కాషాయ కండువా కప్పుకుంటున్నారు. అయితే రానున్న రోజుల్లో మరికొందరు సైతం చేరతారని ఊహాగానాలువినిపిస్తున్నాయి.

KCR

KCR


రాజీనామా అనంతరం సస్పెన్షన్.. CM KCR

దుబ్బాక మున్సిపాలిటీ 3వ వార్డు కౌన్సిలర్ మట్ట మల్లారెడ్డి, ఏడో వార్డు కౌన్సిలర్ దివిటి కనకయ్య, 8వ వార్డు కౌన్సిలర్ బాలకిషన్ గౌడ్ లు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు.   ఈ విషయం తెలుసుకున్న టీఆర్ఎస్ జిల్లా నేతలు ఆఘమేఘాల మీద మీడియా సమావేశం పెట్టి, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డ ఈ ముగ్గుర్నీ పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు   ప్రకటించారు. అయితే టీఆర్ఎస్ నేతల తీరుపైనా సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కౌన్సిలర్లు ముగ్గురూ పార్టీ మారిన తర్వాత .. సస్పెండ్ ఏమిటంటూ సొంతపార్టీ నేతలే చర్చించుకుంటున్నారు. ఒకవేళ సస్పెండ్ చేయాల్సి వస్తే, పార్టీ మారుతున్నారని తెలిసినప్పుడే, చేసి ఉండాల్సిందని అంటున్నారు. దీంతో పార్టీలో ఏం జరుగుతోందన్న చర్చ నేతల్లో, కేడర్ లోనూ వినిపిస్తోంది.

cm kcr big shock Medak district TRS Leaders joine in BJP

cm kcr big shock Medak district TRS Leaders joine in BJP

కంచుకోటకు బీటలు.. CM KCR

టీఆర్ఎస్ కు   కంచుకోటగా ఉన్న సిద్దిపేట గడ్డపై రోజురోజుకు రాజకీయ సమీకరణాలు మారిపోతున్నాయి. తాజా పరిణామాల నేపథ్యంలో సీఎం కేసీఆర్‌ సొంత జిల్లా సిద్ధిపేట నుంచే టీఆర్ఎస్ పతనం ప్రారంభం కానుందా అన్న చర్చ అంతర్గతంగా వినిపిస్తోంది.   అంతేగాక పల్లె పట్టణ ప్రగతి కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన మంత్రిని కొండపాక మండలం తిప్పారం గ్రామ మహిళలు అడ్డుకున్నారు. చేర్యాల పట్టణంలోని చిట్యాల గ్రామంలోనూ జనగామ   ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డిని   అడ్డగించడంతో .. పార్టీకి ఆదరణ తగ్గుతోందని విశ్లేషకులు   అంచనా వేస్తున్నారు. తాజాగా సిద్ధిపేట పర్యటనకు వచ్చిన సీఎం ఎదుటే అధికార పార్టీ   నేతలు, సర్పంచ్ లు, ఎంపీటీసీలు విమర్శలు గుప్పించారు. దీంతో సిద్ధిపేట రాజకీయాలు మారుతున్నాయని విశ్లేషకులు కూడా చెబుతున్నారు.

ఇది కూడా చ‌ద‌వండి ==> Komatireddy brothers : అన్న అలా… త‌మ్ముడు ఇలా… కోమ‌టి బ్ర‌ద‌ర్స్ రాజ‌కీయం అదుర్స్‌…!

ఇది కూడా చ‌ద‌వండి ==> కౌశిక్ రెడ్డి రాజీనామాతో రంజుగా మారిన హుజురాబాద్ రాజకీయం..!

ఇది కూడా చ‌ద‌వండి ==> నెక్స్ ట్ హరీష్ రావేనా… ఫోకస్ పెంచిన కేసీఆర్… ఆ ఎన్నిక ముగియగానే..?

sukanya

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది