Komatireddy brothers : అన్న అలా… తమ్ముడు ఇలా… కోమటి బ్రదర్స్ రాజకీయం అదుర్స్…!
Komatireddy brothers కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఒక్కసారిగా రూటు మార్చారు.. గతంలో కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా హాట్ కామెంట్లు చేసిన కాక రేపిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇప్పుడు మళ్లీ మరో చర్చకు కారణమయ్యారు. కాంగ్రెస్ అధిష్టానం తప్పుడు నిర్ణయాల తీసుకోవడం మూలంగానే తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ రెండు సార్లు ఓడిపోయిందన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి .. ఇప్పుడు దీనికి సరైన నాయకత్వం లేకపోవడమే కారణమని అన్నారు.. సోనియాగాంధీ, రాహుల్ గాంధీ ఏ తప్పు చేయలేదని, . తెలంగాణ ఇచ్చి కాంగ్రెస్ కార్యకర్తలు తలెత్తుకునేలా చేశారని వ్యాఖ్యానించారు. గత ఎన్నికల్లో పొత్తుల విషయంలో, ప్రజా సమస్యల పోరాటంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ స్పందించకపోవడం వల్లే తాను ఘాటుగా స్పందించాల్సి వచ్చిందన్నారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్ లేదు అని మాట్లాడిన మాట వాస్తవమేనని, రాహుల్ గాంధీ పదవికి రాజీనామా చేయడంతో నిరుత్సాహంతోనే మాట్లాడానని చెప్పుకొచ్చారు.
కిషన్ రెడ్డితో వెంకటరెడ్డి భేటీ.. Komatireddy brothers
ఇక రేవంత్ రెడ్డిని టీపీసీసీ అధ్యక్షుడుగా నియమించడంపై ప్రశ్నించగా.. తాను రేవంత్ ను విమర్శించడం గానీ, పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడాలని గానీ అనుకోవడం లేదని అన్నారు. ఇదిలా ఉంటే, తాజాగా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈటల రాజేందర్ బాటలో నడిచే అవకాశాలు లేకపోలేదని టాక్ వినిపిస్తోంది. తెలుస్తోంది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి.. కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జీ కిషన్ రెడ్డితో సమావేశమయ్యారు. తాజాగా రేవంత్ పైనా ఆరోపణలు గుప్పించడంతో, ఈ భేటీపై రచ్చ షురూ అవుతోంది. పీసీసీ అధ్యక్ష పదవికి రేవంత్ రెడ్డి పేరును కాంగ్రెస్ అధిష్ఠానం ఖరారు చేసిన రోజే ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. తాను గాంధీ భవన్ మెట్లు ఎక్కబోనని స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి అసలైన కాంగ్రెస్‌వాది కాదంటూ చెప్పుకొచ్చారు. ఆ తరువాత… కూడా తన నిరసన గళాన్ని వినిపించడం తగ్గించారే తప్ప.. పార్టీ నిర్ణయాన్ని సమర్థించట్లేదు. రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకార కార్యక్రమానికీ గైర్హాజరయ్యారు. ఈ పరిస్థితుల్లో కోమటిరెడ్డి.. జీ కిషన్ రెడ్డిని కలవడానికి అటు రాజకీయంగానూ ప్రాధాన్యత ఏర్పడింది.
ఎవరికి వారే .. Komatireddy brothers
తమ్ముడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు, అన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీరు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ కాంగ్రెస్ లో కీలక నేతలుగా ఉన్న ఈ అన్నదమ్ములిద్దరూ .. భిన్న వ్యతిరేక వ్యాఖ్యలతో రచ్చ రేకెత్తిస్తూనే ఉన్నారు. గతంలో పీసీసీకి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పోటీ పడుతుండగా, తమ్ముడు రాజగోపాల్ రెడ్డి .. బీజేపీలోకి వెళ్లిపోతానంటూ, భవిష్యత్ ఆ పార్టీదేనంటూ వ్యాఖ్యానాలు చేశారు. ఈ వ్యాఖ్యలు వెంకటరెడ్డికి మైనస్ గా మారాయి.. అప్పుడు కాంగ్రెస్ పై కారాలు మిరియాలు నూరిన రాజగోపాల్ రెడ్డి .. ఇప్పుడిలా యూటర్న్ తీసుకోవడం .. మరీ ముఖ్యంగా వెంకటరెడ్డికి బీజేపీకి దగ్గరవుతున్నారన్న వేళ .. ఈ కామెంట్లు .. మరింత చర్చనీయాంశంగా మారాయి.
ఇది కూడా చదవండి ==> కౌశిక్ రెడ్డి రాజీనామాతో రంజుగా మారిన హుజురాబాద్ రాజకీయం..!
ఇది కూడా చదవండి ==> నెక్స్ ట్ హరీష్ రావేనా… ఫోకస్ పెంచిన కేసీఆర్… ఆ ఎన్నిక ముగియగానే..?
ఇది కూడా చదవండి ==> TRS : పదవి ఇస్తారా..? వేరే పార్టీలోకి వెళ్లాలా..? అధిష్ఠానానికి అసంతృప్త నేతల సవాల్..?