Revanth Reddy : నెక్స్ ట్ వికెట్ హరీశ్ రావే? రేవంత్ రెడ్డి షాకింగ్ కామెంట్స్?
Revanth Reddy : తెలంగాణలో ప్రస్తుతం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల సమరం మొదలైంది. ఎలాగైనా ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలవాలని.. అధికార పార్టీతో పాటు.. ఇతర పార్టీలు కూడా పావులు కదుపుతున్నాయి. ముఖ్యంగా అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య అయితే పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది.
ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగాల విషయంలో అధికార టీఆర్ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ మధ్య మాటల యుద్ధం నడిచిన విషయం తెలిసిందే. అలాగే.. తన పాదయాత్రలో భాగంగా ఇప్పటికే టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి చాలా సార్లు అధికార పార్టీపై, సీఎం కేసీఆర్ పై దుమ్మెత్తి పోశారు.
తాజాగా మరోసారి రేవంత్ రెడ్డి గ్రాడ్యుయేట్ ఎన్నికల విషయంలో సీఎం కేసీఆర్ పై విరుచుకుపడ్డారు. రాజకీయ స్వార్థం కోసమే సీఎం కేసీఆర్ పీవీ నరసింహారావు కూతురుకు అవకాశం ఇచ్చారని.. అక్కడ టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలవరని అందరికీ తెలుసని.. కావాలని.. పీవీ కూతురును బరిలో నిలిపి.. పీవీని అవమానిస్తున్నారని రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు.
పీవీ కూతురును బరిలోకి దింపి.. ఏకంగా ఏఐసీసీ అధ్యక్షుడు పీవీ ఫోటోను పెట్టుకొని కేసీఆర్ ఓట్లడుగుతున్నారు. అసలు కేసీఆర్ కు కొంచెమైనా ఉందా? అంటూ రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు.
Revanth Reddy : ఇప్పుడు ఈటల.. రేపు హరీశ్ రావు
అలాగే.. టీఆర్ఎస్ పార్టీలో జరుగుతున్న అంతర్గత విభేదాలపై కూడా రేవంత్ రెడ్డి మాట్లాడారు. టీఆర్ఎస్ జెండాలో మాకూ వాటా ఉందని ఈటల అనడం.. ఆ తర్వాత ఈటలను కేసీఆర్ పక్కన పెట్టడం వెంటనే జరిగిపోయాయి. ఇవాళ ఈటలను పక్కన పెట్టిన కేసీఆర్.. రేపు హరీశ్ రావును కూడా పక్కన పెట్టేయబోతున్నారు. అందుకే ఓడిపోయే ప్రాంతానికి కేసీఆర్.. హరీశ్ రావుకు బాధ్యతలు అప్పగించారు. గెలిచే చోట కేటీఆర్ కు, ఓడిపోయే చోట హరీశ్ కు బాధ్యతలు అప్పగించడం వెనుక ఎంత కుట్ర జరుగుతున్నదో తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోగలరని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.