Revanth Reddy తెలంగాణ Telangana లో కాంగ్రెస్ పార్టీకి జవసత్వాలు నింపే ప్రయత్నం చేస్తున్నారు టీపీసీసీ చీఫ్, మల్కాజ్‌గిరి ఎంపీ ఎ.రేవంత్‌రెడ్డి Revanth reddy . గ్రూపు రాజకీయాలకు కేరాఫ్‌గా ఉన్న కాంగ్రెస్ పార్టీలో ఐక్యత తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు రేవంత్. ఈ క్రమంలోనే టీపీసీసీ చీఫ్‌గా నియమితులైన నాటి నుంచి సీనియర్ నేతల మద్దతు కోరుతున్నారు. ఇకపోతే కాంగ్రెస్ పార్టీని క్రియాశీల పోరాటాల వైపు మరల్చే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఇంద్రవెల్లిలో జరిపిన దళిత, గిరిజన ఆత్మ గౌరవ దండోరా సభతో కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో జోష్ వచ్చింది.
ఈ క్రమంలోనే ఓ వైపు టీఆర్ఎస్ సర్కారు, కేసీఆర్‌ను టార్గెట్ చేస్తూనే మరో వైపున బీజేపీపై యుద్ధం ప్రకటిస్తున్నారు. పెట్రోల్, డీజిల్ ధరలు, రైతుల సమస్యలపై వరుస నిరసనలకు ప్లాన్ చేస్తున్న రేవంత్ రెడ్డి దళిత బంధుకు కౌంటర్ అటాక్‌గా దళిత, గిరిజన ఆత్మగౌరవ దండోరా ప్లాన్ చేసిన విషయం తెలిసిందే. ఈమేరకు రెండు సభలు విజయవంతం కావడంతో రేవంత్ రెడ్డి దూకుడు షురూ అయిందన్న టాక్ రాజకీయవర్గాల్లో వినిపిస్తోంది.
ఇంద్రవెల్లి సభ ఫుల్ సక్సెస్ కాగా, రెండో సభ ఇబ్రహీంపట్నంలో ప్లాన్ చేసింది కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధిష్టానం. అయితే, అనూహ్య మార్పులతో రావిర్యాలలో రెండో సభ జరిగింది. ఇక అప్పుడే మూడో సభ గురించి రేవంత్ ఆలోచించారని సమాచారం. మెదక్ పార్లమెంటరీ నియోజకవర్గంలో ఈ సభ ఉండేలా ప్లాన్ చేయాలనుకుంటున్నట్లు తెలుస్తోంది. అది కూడా ఈ నెల 24న నిర్వహించాలని, మెదక్ పార్లమెంటరీ నియోజకవర్గంలో సభ నిర్వహించడం ద్వారా ఓ వైపు కేసీఆర్, టీఆర్ఎస్‌ను, మరో వైపు బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ కుమార్‌ను కూడా టార్గెట్ చేసినట్లవుతుందని రేవంత్ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తంగా రేవంత్ టీఆర్ఎస్, బీజేపీ రెండిటినీ టార్గెట్ చేస్తూ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పాగా వేసేలా ప్లాన్ చేస్తున్నట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో ఇప్పటికే జోష్ మీదున్న కాంగ్రెస్ .. మరింత జోష్ లోకి వస్తుందని, ఇదే ఊపు కొనసాగిస్తే, వచ్చే ఎన్నికల నాటికి టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా మారుతుందని విశ్లేషకులు సైతం చెబుతున్నారు.
అదే సమయంలో రేవంత్ రెడ్డి రావిర్యాల దళిత దండోరా సభలో చేసిన పలు వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయవర్గాల్లో కొత్త చర్చకు తెరలేపాయి. తెలంగాణలో దళిత అధికారులకు ప్రాధాన్యత లేదని వ్యాఖ్యానించిన రేవంత్ రెడ్డి.. పలువురు అధికారుల పేర్లను ప్రస్తావించారు. అందులో భాగంగా ఇటీవల తన ఐపీఎస్ ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి వచ్చిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పేరును రేవంత్ రెడ్డి ప్రస్తావించారు.
మరో ఆరేళ్ల పాటు ఉద్యోగంలో కొనసాగే అవకాశం ఉండి.. డీజీపీ అయ్యే అవకాశం ఉన్న ప్రవీణ్ కుమార్ వివక్షను తట్టుకోలేక తన ఉద్యోగానికి రాజీనామా చేశారని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించడం చర్చనీయాంశంగా మారింది.రాజకీయాల్లోకి ప్రవేశించిన మాజీ ఐపీఎస్ ప్రవీణ్ కుమార్ సైతం టీఆర్ఎస్ పైనే ఆరోపణాస్త్రాలు ఎక్కుపెట్టారు. ఇప్పటివరకు కాంగ్రెస్ పై ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలు చేయలేదు. దీంతో ప్రవీణ్ కుమార్ ను తమకు అనుకూలంగా మలుచుకోవడమో లేక బీఎస్పీతో పొత్తు పెట్టుకుని ఆయనతో కలిసి పని చేయడమో చేయాలనే ఉద్దేశ్యంతోనే రేవంత్ రెడ్డి ఆయన పట్ల సానుకూలంగా స్పందించి ఉంటారని తెలంగాణ రాజకీయవర్గాల్లో చర్చ మొదలైంది.
IPL 2025 Schedule : క్రికెట్ ప్రేమికులకి మంచి మజా అందించే గేమ్ ఐపీఎల్. ధనాధన్ ఆటతో ప్రేక్షకులకి మంచి…
PM YASASVi : పీఎం యంగ్ అచీవర్స్ స్కాలర్ షిప్ అవార్డ్ స్కీం అనేది భారత ప్రభుత్వం నుంచి ఒక…
Cough And Cold : సీజన్ మారుతున్న టైమ్ లో హఠాత్తుగా జలుబు చేయడం సర్వసాధారణమైన విషయం. ముఖ్యంగా చెప్పాలంటే ఈ…
Zodiac Signs : నవగ్రహాలకు రాజుగా పిలవబడే సూర్యుడి సంచారం కారణంగా కొన్ని రాశుల వారి జీవితం ప్రభావితం అవుతూ…
IDBI JAM : ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ( IDBI Bank ) వివిధ పోస్టుల కోసం…
Onion And Garlic : భారతదేశంలోని ప్రతి ఒక్కరి ఇంట్లో దాదాపుగా ఉల్లిపాయాలను వెల్లుల్లిని విరివిగా వినియోగిస్తూ ఉంటారు. అయితే…
Mechanic Rocky Movie Review : ఈ ఇయర్ ఆల్రెడీ గామీ, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ ఫినాలే ఎపిసోడ్కి దగ్గర పడింది. టాప్ 5కి ఎవరు వెళతారు,…
This website uses cookies.