Revanth Reddy పీసీసీ చీఫ్ అయినప్పటి నుంచీ రేవంత్‌రెడ్డి Revanth Reddy నోరును బాగా వాడేస్తున్నారు. సీఎం కేసీఆర్‌ను, మంత్రి కేటీఆర్‌ను ఓ ఆట ఆడుకుంటున్నారు. రేవంత్ ఎన్ని విమర్శలు చేస్తున్నా.. ఎంత పరుష పదజాలం వాడుతున్నా.. ఇన్నాళ్లూ కేసీఆర్ KTR, కేటీఆర్ మౌనంగా భరించారు. బహుశా, రేవంత్ పేరు ఎత్తడం ఇష్టం లేకనో, లేక, ఆ వ్యాఖ్యలపై స్పందించి అంతగా ఇంపార్టెన్స్ ఇవ్వకూడదనో.. కారణం ఏదైనా వాళ్లిద్దరూ సైలెంట్గా ఉంటూ వచ్చారు. ఇక చాలంటూ, ఇక భరించలేనంటూ.. కేటీఆర్ మౌనాన్ని వీడారు. తాను సైతం నోటికి పని చెప్పడం స్టార్ట్ చేశారు.
ఇక అంతే. అప్పటి వరకూ ఉన్న కంఫర్ట్ జోన్ చేజారిపోయిందంటున్నారు. ఎప్పుడైతే కేటీఆర్ KTR నోటికి పని చెప్పారో.. అప్పట్నుంచే కేటీఆర్ కు ఇబ్బందులు మొదలయ్యాయని చెబుతున్నారు. అనవసరంగా రేవంత్‌రెడ్డిని ఏదో అనబోయి.. అనుకోని చిక్కులు, ఇబ్బందులు కొనితెచ్చుకున్నారు. తనతో పాటు కేసీఆర్‌నూ కష్టాల్లో పడేశారని అంటున్నారు. రాజకీయ ఎత్తులు, జిత్తుల్లో ఆరితేరిన రేవంత్‌రెడ్డి వ్యూహాలు, ట్రాపుల ముందు కేటీఆర్ నిలవలేకపోతున్నారు. అనవసరంగా అందులో చిక్కుకుపోతున్నారు. రేవంత్‌రెడ్డి సృష్టించిన వైట్ ఛాలెంజ్‌లో ఇరుక్కుపోయి.. వెనక్కిరాలేక, ముందుకుపోలేక.. విలవిల్లాడుతున్నారని టాక్ వినిపిస్తోంది.
రేవంత్‌రెడ్డి పదే పదే చేస్తున్న డ్రగ్స్ ఆరోపణలకు చెక్ పెట్టాలనుకున్న కేటీఆర్.. తనకు డ్రగ్స్‌తో సంబంధం లేదని కావాలంటే బ్లడ్, లివర్ టెస్టులకు రెడీ అంటూ సవాల్ విసిరి తాను మిస్టర్ క్లీన్ అని చెప్పదలచుకున్నారు. భలే మంచి ఛాన్స్ అంటూ చిట్‌చాట్‌గా అన్న ఆ డైలాగ్‌ను రేవంత్‌రెడ్డి బహు బాగా వాడేసుకున్నారు. వైట్ ఛాలెంజ్ అంటూ కేటీఆర్‌ను ఊబిలోకి లాగేశారు. ఓ ప్లేసు, ముహూర్తం పెట్టేసి అక్కడి వస్తా.. నువ్ కూడా రా అంటూ కేటీఆర్‌ను కవ్వించారు. కేటీఆర్ ఎలానూ రారు కాబట్టి మరింత కార్నర్ చేసేలా.. కొండా విశ్వేశ్వరరెడ్డితో కలిపి వైట్ ఛాలెంజ్ అనే ట్రాప్ తయారు చేశారు. అది ట్రాప్ అని తెలిసినా, అందులో చిక్కకుండా ఎంత తప్పించుకుందామంటే.. అంతలా మరింత చిక్కుకుపోతున్నారు కేటీఆర్. కేటీఆర్ కాస్త హుషారుతనం ప్రదర్శించి డ్రగ్ టెస్టులకు తాను రెడీ కానీ.. రాహుల్‌గాంధీ కూడా రెడీ అయితే.. ఢిల్లీ ఎయిమ్స్‌లో టెస్టులకు ఓకే అన్నారు.
పనిలో పనిగా రేవంత్ Revanth Reddy ను కార్నర్ చేసేలా.. ఓటుకు నోటు కేసులో లైడిటెక్టర్ పరీక్షలకు సిద్ధమా? అంటూ తానేదో కాంగ్రెస్‌ను బాగా కార్నర్ చేశాననుకొని తెగ ఖుషీ అయినట్టున్నారు. కానీ, పాదరసంలా స్పందించిన రేవంత్‌రెడ్డి.. ఏకంగా కేసీఆర్‌నే అందులో ఇరికిస్తూ.. లైడిటెక్టర్ టెస్ట్‌కు తాను రెడీ అంటూనే, ఈఎస్ఐ కేసు, సహారా పీఎఫ్ అక్రమాలపై లైడిటెక్టర్ పరీక్షలకు కేసీఆర్ సిద్ధమా? అని రేవంత్ మరింత రచ్చ రాజేశారు. రేవంత్ నుంచి ఇలాంటి కౌంటర్ వస్తుందని.. తాను రాహుల్‌ను ఇరికించాలనుకుంటే, రేవంతేమో కేసీఆర్‌ను ఇబ్బందుల్లో పడేస్తారని అస్సలు ఊహించి ఉండకపోవచ్చు.
ఇక వైట్ ఛాలెంజ్‌తోనూ కేటీఆర్ ఫుల్‌గా ఇరుక్కుపోయారంటున్నారు. కేటీఆర్ ఎలాగూ స్పందించరని.. వ్యూహాత్మకంగా కొండా విశ్వేశ్వరరెడ్డిని రంగంలోకి దింపారు రేవంత్‌రెడ్డి. ఇక కొండా విశ్వేశ్వరరెడ్డి వైట్ ఛాలెంజ్‌కి రెడీ అంటూ.. మరో ఇద్దరిని నామినేట్ చేశారు. అందులో ఒకరు బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ కావడం రాజకీయంగా కీలకంగా మారింది. బండి సంజయ్ గనుక ఆ ఛాలెంజ్‌ను స్వీకరించకపోతే.. ఇకపై డ్రగ్స్‌పై గొంతెత్తే నైతిక అర్హత కోల్పోవాల్సి వచ్చేది. కానీ, అనూహ్యంగా బండి సంజయ్ సైతం వైట్ ఛాలెంజ్‌ను స్వీకరించారు. అక్టోబర్ 2 తర్వాత ఎప్పుడైనా టెస్టులకు తాను సిద్దమన్నారు. పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ విసిరిన ఛాలెంజ్‌కి.. బీజేపీ చీఫ్ బండి సంజయ్ సైతం సై అనడం.. కేటీఆర్‌కు మరింత కష్టాలు తెచ్చిపెట్టిందని అంటున్నారు.
కాంగ్రెస్‌కు బద్ద శత్రువైన బీజేపీనే రెడీ అంటుంటే.. కేటీఆర్ మాత్రం సైలెంట్‌గా ఉంటే.. ఏదో ఉందనే అనుమానం రాకుండా ఉంటుందా? అందులోనూ రేవంత్‌రెడ్డి Revanth Reddy పదే పదే కేటీఆర్, డ్రగ్స్.. గోవా.. రకుల్.. అంటూ ఫెవికాల్ లింకులు పెడుతుంటే.. అందులోనుంచి లాక్కోలేక, బయటపడలేక కేటీఆర్ తెగ ఇదై పోతున్నారట. అయినా, ఏదోరకంగా తాను సచ్చీలుడని నిరూపించుకునే యత్నంలో రేవంత్‌రెడ్డిపై పరువునష్టం దావా వేసి.. ఆ విధంగా నరుక్కొచ్చే ప్రయత్నం చేస్తున్నారని అంటున్నారు.
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…
This website uses cookies.