Revanth reddy : లై డిటెక్టర్ టెస్టుకు రెడీ అంటున్న రేవంత్.. కేసీఆర్ పాల్గొనాలంటూ సవాల్..
Revanth reddy ఇప్పుడు తెలంగాణలో డ్రగ్స్ వ్యవహారంపై రేవంత్, కేటీఆర్ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ట్విట్టర్ వేదికగా ఇద్దరూ సవాళ్లు విసురుకుంటున్నారు. కాగా రీసెంట్‌గా రేవంత్ రెడ్డి విసిరిన వైట్ ఛాలెంజ్‌పై ట్విట్టర్ వేదికగా మంత్రి కేటీఆర్ ఘాటుగా స్పందించారు. రేవంత్ విసిరిన సవాలుకు తాను సిద్ధమని, ఎలాంటి టెస్టుకైనా రెడీ అంటూ చెప్పారు. అయితే తాను ఢిల్లీలోని ఎయిమ్స్‌లో రాహుల్ గాంధీతో డ్రగ్స్ టెస్టుకు సిద్ధమని, ఎందుకంటే తాను చర్లపల్లి జైలుకు వెళ్లొచ్చిన రేవంత్‌తో టెస్టు చేసుకుంటే తన స్థాయి దిగజారిపోతుందని చెప్పారు.
కాబట్టి తాను రాహుల్ గాంధీతో టెస్టుకు రెడీ అని, తాను క్లీన్ చీట్ తెచ్చుకుంటే రేవంత్ క్షమాపణ చెప్పడంతో పాటు టీపీసీసీ పదవికి రాజీనామా చేయాలంటూ సవాల్ విసిరారు. దాంతో పాటు ఓటుకు నోటు కేసులో లై డిటెక్టర్ టెస్టుకు రెడీనా అంటూ సవాల్ విసిరారు. అయితే ఈ సవాల్ పై రేవంత్‌రెడ్డి చాలా స్పీడుగానే స్పందించారు. ప్లేస్ అలాగే టైమ్ చెప్పాలని, లై డిటెక్టర్ టెస్టుకు రెడీ అని అయితే తనతో పాటు కేసీఆర్ కూడా పాల్గొనాలని సవాల్ విసిరారు. గతంలో జరిగిన సహారా ప్రావిడెంట్ ఫండ్ అలాగే ఈఎస్ ఐ హాస్పిటల్‌లో జరిగిన కుంభకోణాల ఆరోపణలతో సీబీఐ కేసులు నడుస్తున్నందున వాటిపై లై డిటెక్టర్ టెస్టుకు కేసీఆర్ రెడీనా అంటూ సవాల్ విసిరారు.