Revanth Reddy : కోమటిరెడ్డి వెంకటరెడ్డికి భేషరతు క్షమాపణ చెప్పిన రేవంత్ రెడ్డి.!

Revanth Reddy ; మునుగోడు ఉప ఎన్నిక విషయమై ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ప్రసన్నం చేసుకునేందుకు తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నానా తంటాలూ పడుతున్నారు. రేవంత్ రెడ్డిని ఇరకాటంలో పడేయడానికి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తనదైన స్టయిల్లో ప్రయత్నిస్తూనే వున్నారు.సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడి, మునుగోడు ఎమ్మెల్యే పదవికీ రాజీనామా చేసిన దరిమిలా, ఆ మునుగోడు ఉప ఎన్నిక బాధ్యత తన మీద ఎక్కడ పడుతుందోనని ఆందోళన చెందుతున్నారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఆ అసహనం నుంచి బయటపడేందుకు, రేవంత్ రెడ్డిని ఇరకాటంలో పడేయాలన్నది వెంకటరెడ్డి వ్యూహం. అయితే, రాజగోపాల్ రెడ్డి చేసిన తప్పు నేపథ్యంలో వెంకటరెడ్డిని ఇరికించేసి, తాను ఎస్కేప్ అవ్వాలన్నది రేవంత్ రెడ్డి వ్యూహంగా కనిపిస్తోంది.

మునుగోడులో కాంగ్రెస్ గెలిస్తే, ఆ గెలుపు రేవంత్ రెడ్డి ఖాతాలో పడుతుంది. ఓడితే, బాధ్యత వహించాల్సింది ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్యా ఇంట్రెస్టింగ్ ‘వార్’ నడుస్తోంది.అయితే, మునుగోడులో ఇటీవల కాంగ్రెస్ నిర్వహించిన బహిరంగ సభలో కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్, వెంకటరెడ్డి మీద తీవ్ర విమర్శలు చేశారు. దాన్ని అడ్డం పెట్టుకుని, మునుగోడు ఉప ఎన్నికకు దూరంగా వుండాలని వెంకటరెడ్డి భావిస్తున్నారు. కానీ, ఆయన్ని అడ్డంగా బుక్ చేసే క్రమంలో, వెంకటరెడ్డికి క్షమాపణ కూడా చెప్పేశారు రేవంత్ రెడ్డి. అద్దంకి తయాకర్‌ని పార్టీ నుంచి బయటకు పంపే దిశగా కూడా రేవంత్ రెడ్డి చర్యలు తీసుకుంటున్నారట. ఇటు వెంకటరెడ్డి అటు రేవంత్ రెడ్డి..

Revanth Reddy Unconditional Sorry To Komatireddy Venkat Reddy

ఈ ఇద్దరూ ఒకరి మీద ఒకరు ఆధిపత్య పోరు నడపడం కాదు, ఆ తెలివితేటలేవో పార్టీ బాగు కోసం ఉపయోగించి వుంటే, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బలపడేదే కదా.? ‘నేను మోస్ట్ సీనియర్..’ అని చెప్పుకుంటున్న వెంకటరెడ్డి కావొచ్చు, తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కావొచ్చు.. ఇద్దరూ కలిసి మునుగోడు వేదికగా కాంగ్రెస్ పార్టీని ఓ ప్రయోగశాలగా మార్చేసి, పార్టీని భ్రష్టుపట్టించేస్తున్నారన్నది సర్వత్రా వినిపిస్తోన్న వాదన. ఇందులో నిజం లేకపోలేదు కూడా.! ఈ మొత్తం ఆటలో లాభపడుతున్నది భారతీయ జనతా పార్టీ. అందుకే, మునుగోడు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా తన గెలుపుపై బోల్డంత ధీమాగా వున్నారు. అంతర్గత కుమ్ములాటలున్నా, మునుగోడులో టీఆర్ఎస్ కూడా కాస్తో కూస్తో లాభపడే అవకాశాల్లేకపోలేదు, కాంగ్రెస్ రాజకీయాల కారణంగా.

Recent Posts

New Pension Rules: కొత్త పెన్షన్ రూల్స్‌పై క్లారిటీ ఇచ్చిన కేంద్ర సర్కార్

కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివాహం విఫలమై ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న మహిళలకు గొప్ప ఊరటను కలిగించే వార్తను…

4 hours ago

BC Youth Employment : బీసీలకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్..

BC Youth Employment : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు…

5 hours ago

Wife Killed : ప్రియుడి కోసం భర్తను చంపిన భార్య..అది కూడా పెళ్లైన 30ఏళ్లకు..ఏంటి ఈ దారుణం !!

wife Killed Her Husband : నిర్మల్ జిల్లాలో దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వివాహ…

6 hours ago

Hair-Pulling Fight : మెట్రో ట్రైన్ లో పొట్టుపొట్టుగా కొట్టుకున్న ఇద్దరు మహిళలు

డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…

8 hours ago

Lord Vinayaka | సబ్బులు, షాంపూలతో గణనాథుడు..అంద‌రిని ఆక‌ట్టుకుంటున్న వినాయ‌కుడి ప్ర‌తిమ‌

Lord Vinayaka |  తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…

9 hours ago

Vodafone | రూ.1కే రూ.4,999 విలువైన Vi ప్లాన్.. వోడాఫోన్ ఐడియా వినియోగదారులకు బంపర్ ఆఫర్!

Vodafone | వోడాఫోన్-ఐడియా (Vi) తమ వినియోగదారుల కోసం అద్భుతమైన గేమ్ బేస్డ్ ప్రమోషనల్ ఆఫర్‌ను తీసుకువచ్చింది. అత్యుత్తమ ప్రయోజనాలతో…

10 hours ago

Manchu Manoj | ఆమె త‌మిళ‌నాట పెద్ద రౌడీ… ఆ హీరోయిన్ గురించి మ‌నోజ్ అలా అన్నాడేంటి?

Manchu Manoj | ఇటీవలే భైరవ సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన హీరో మంచు మనోజ్, సినిమాలతో పాటు…

11 hours ago

Lord Ganesh | పూజ‌లు అందుకోకుండానే గ‌ణేషుని నిమ‌జ్జ‌నం.. అలా ఎందుకు చేశారంటే..!

Lord Ganesh | వినాయక చవితి వేడుకలు ఇంకా ప్రారంభం కాకముందే హైదరాబాద్‌లో అపశృతి చోటుచేసుకుంది. గణేష్‌ విగ్రహాన్ని మండపానికి తీసుకెళ్తుండగా…

12 hours ago