PAN Card : పాన్ కార్డ్ లో తండ్రి పేరు లేకుంటే.. రెవెన్యూ శాఖ కొత్త ఆర్డర్ తెలుసా..?
PAN Card : పర్మినెంట్ అకౌంట్ నెంబర్ అదే పాన్ కార్డ్ అనేది ఇప్పుడు ఆర్ధిక పరమైన లావాదేవీలకు కీలకంగా మారింది. డబ్బుకి సంబందించిన పెట్టుబడులు ఆర్ధిక కార్యకలాపాల కోసం ఇది ఉపయోగపడుతుంది. బ్యాంక్ ఖాతాలు ఉన్న వారికి ఇది అవసరం. బ్యాంక్ ఖాతాలన్నీ కూడా పాన్ కార్డ్ కి లింక్ చేయబడి ఉంటాయి. అందుకే పాన్ కార్డ్ అనేది చాలా ఇంపార్టెంట్ అంటుంటారు.పాన్ కార్డ్ లో తండ్రి పూర్తి పేరు చేర్చే విషయంపై సోషల్ మీడియాలో […]
ప్రధానాంశాలు:
PAN Card : పాన్ కార్డ్ లో తండ్రి పేరు లేకుంటే.. రెవెన్యూ శాఖ కొత్త ఆర్డర్ తెలుసా..?
PAN Card : పర్మినెంట్ అకౌంట్ నెంబర్ అదే పాన్ కార్డ్ అనేది ఇప్పుడు ఆర్ధిక పరమైన లావాదేవీలకు కీలకంగా మారింది. డబ్బుకి సంబందించిన పెట్టుబడులు ఆర్ధిక కార్యకలాపాల కోసం ఇది ఉపయోగపడుతుంది. బ్యాంక్ ఖాతాలు ఉన్న వారికి ఇది అవసరం. బ్యాంక్ ఖాతాలన్నీ కూడా పాన్ కార్డ్ కి లింక్ చేయబడి ఉంటాయి. అందుకే పాన్ కార్డ్ అనేది చాలా ఇంపార్టెంట్ అంటుంటారు.పాన్ కార్డ్ లో తండ్రి పూర్తి పేరు చేర్చే విషయంపై సోషల్ మీడియాలో కాస్త రకరకాల వార్తలు వచ్చాయి. ఐతే వీటిపై క్లారిటీ ఇస్తూ పాన్ కార్డ్ లో తండ్రి పూర్తి పేరు లేకపోతే అది పరిగణించబడదని అలాంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే వెంటనే తగిన సమచారంతో అప్ డేట్ చేయాలని అంటున్నారు.
PAN Card తండ్రి పూర్తి పేరు బదులుగా అక్షరాలు..
ఐతే ఈ సమస్య గురించి స్పష్టం చేస్తూ ఇన్కం ట్యాక్స్ డిపార్ట్ మెంట్ ఒక వివరణ ఇచ్చింది. తండ్రి పూర్తి పేరు లేని పాన్ కార్డ్ చెల్లదని వస్తున్న వార్తలు అవాస్తవమని ఈ శాఖ తెలిపంది. పాన్ కార్డ్ లో తండ్రి పూర్తి పేరు బదులుగా అక్షరాలు మాత్రమే ఉన్నా అది చెల్లిబాటు అవుతుందని తెలిపిబంది.
ఈ వదంతుల వల్ల హడావిడిగా పాన్ కార్డ్ పై పేరు మార్చుకోవాల్సిన అవసరం లేదని ఆదాయ పన్ను శఖ పేర్కొంది. ఐతే తండ్రి పూర్తి పేరు మార్చుకోవాలనుకునే వారు పాన్ కార్డ్ ను మళ్లీ అప్లై చేసి అందులో వివరాలు సరిగా ఇవ్వాల్సి ఉంటుందని చెప్పారు. ఒక వ్యక్తికి ఒక్కసారి మాత్రమే పాన్ కార్డ్ వస్తుంది. దాన్నే వాడాల్సి ఉంటుంది. ఐతే కొందరు ఆల్రెడీ పాన్ కార్డ్ ఉన్నా కూడా మరో పాన్ కార్డ్ కోసం ప్రయత్నిస్తారు కానీ అలా చేసినా వారికి పాన్ కార్డ్ రాదని స్పష్టం గా చెబుతున్నారు.