
Roasted Chicken with new taste Try Making This..
Roasted Chicken : నాన్ వెజ్ ప్రియులు చికెన్ తో ఎన్నో రకాల వెరైటీస్ చేసుకుని తింటూ ఉంటారు. ఈ చికెన్ తో ఎప్పుడు ఏదో ఒక కొత్త వెరైటీ చేసుకుని తినవచ్చు. ఎప్పుడూ ఒకటే లాగా కాకుండా. అయితే ఇప్పుడు కొత్త టేస్ట్ చికెన్ రోస్ట్ ఈ విధంగా చేసి తిన్నారంటే ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. ఇప్పుడు దాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం.. కావాల్సిన పదార్థాలు : చికెన్, కొత్తిమీర, ఉప్పు, కారం, ధనియా పౌడర్, జీలకర్ర పౌడర్ ,గరం మసాలా, కరివేపాకు ,పచ్చిమిర్చి, అల్లం, ఎల్లిపాయలు, ఉల్లిపాయలు, దాల్చిన చెక్క, సాజీర, లవంగాలు, యాలకులు, అనాసపువ్వు, స్టార్ ,బిర్యాని ఆకు, పసుపు, టమాట ముక్కలు, ఆయిల్ , కసూరి మేతి మొదలైనవి..
తయారీ విధానం : ముందుగా బోన్లెస్ చికెన్ ని తీసుకొని శుభ్రం చేసుకుని పక్కన ఉంచుకోవాలి. ఇక ఒక గుప్పెడు కొత్తిమీరని, నాలుగైదు పచ్చిమిర్చి కొంచెం ఉప్పు, 4 లవంగాలు, ఒక దాల్చిన చెక్క, నాలుగు యాలకులు, కొద్దిగా అల్లం ముక్కలు ,కొద్దిగా ఎల్లిపాయలు, వేసి మెత్తని పేస్టులా పట్టుకొని దీనిని చికెన్ లో వేసి బాగా కలిపి పక్కన ఉంచుకోవాలి. తర్వాత స్టౌ పై ఒక కడాయి పెట్టుకుని దానిలో నాలుగైదు స్పూన్ల ఆయిల్ వేసుకొని ముందుగా సాజీర, దాల్చిన చెక్క, నాలుగు యాలకులు, నాలుగు లవంగాలు, ఒక స్టార్, అనాసపువ్వు, బిర్యానీ ఆకు వేసి కొద్దిసేపు వేయించుకొని తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ ని దాంట్లో వేసి స్టవ్ ని హై లో పెట్టుకుని కలుపుతూ 15 నిమిషాల పాటు వేగనివ్వాలి.
Roasted Chicken with new taste Try Making This..
తర్వాత దానిలోంచి ఆయిల్ సపరేట్ అయిన తర్వాత దానిలోకి ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు, ఒక కప్పు టమాటా ముక్కలు, వేసి బాగా వేయించుకోవాలి. తర్వాతదానిలో ఒక స్పూన్ కారం, ఒక స్పూన్ ఉప్పు, ఒక స్పూన్ ధనియా పౌడర్, ఒక స్పూన్ జీలకర్ర పొడి ఒక స్పూన్ గరం మసాలా, కొంచెం కరివేపాకు, కొద్దిగా కసూరి మేతి వేసి సిమ్లో పెట్టుకుని ఒక పది నిమిషాల పాటు వేగనివ్వాలి. తర్వాత చికెన్ బాగా కలర్ మారిన తర్వాత స్టవ్ ఆపి కొంచెం కత్తిమీర చల్లుకొని దింపి సర్వ్ చేసుకోవచ్చు.. దీన్ని ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. అంత రుచిగా ఉంటుంది. దీనిని స్నాక్ లాగా తీసుకోవచ్చు. అలాగే పప్పు చారు లాంటి వాటిలో కూడా తీసుకోవచ్చు.
Rice | మన రోజువారీ ఆహారంలో అన్నం (బియ్యం) కీలకమైన భాగం. ఇది శరీరానికి తక్షణ శక్తిని అందించే ప్రధాన…
Montha Effect | ఆంధ్రప్రదేశ్ తీరంపై మొంథా తుఫాను (Cyclone Montha) బీభత్సం సృష్టిస్తోంది. ఇవాళ (అక్టోబర్ 28) సాయంత్రం లేదా…
Harish Rao | హైదరాబాద్‌లో బీఆర్ఎస్ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు…
Brown Rice |బియ్యం తింటే లావు అవుతారనే భావన చాలా మందిలో ఉంది. అందుకే చాలామంది తెల్ల బియ్యానికి బదులుగా…
Health Tips | అక్టోబర్ నెలాఖరులో వాతావరణం క్రమంగా చల్లబడుతోంది. ఈ సీజన్ మార్పు సమయంలో చాలామంది దగ్గు, జలుబు,…
Chanakya Niti | ఆచార్య చాణక్యుడు ..కేవలం రాజకీయ చతురుడు మాత్రమే కాదు, ఆర్థిక జ్ఞానానికి ప్రతీక. వేల సంవత్సరాల…
Phone | కొత్త స్మార్ట్ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్లో పవర్ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
This website uses cookies.