Roasted Chicken : సండే స్పెష‌ల్ – కొత్త రుచితో చికెన్ రోస్ట్ ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Roasted Chicken : సండే స్పెష‌ల్ – కొత్త రుచితో చికెన్ రోస్ట్ ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది.

Roasted Chicken : నాన్ వెజ్ ప్రియులు చికెన్ తో ఎన్నో రకాల వెరైటీస్ చేసుకుని తింటూ ఉంటారు. ఈ చికెన్ తో ఎప్పుడు ఏదో ఒక కొత్త వెరైటీ చేసుకుని తినవచ్చు. ఎప్పుడూ ఒకటే లాగా కాకుండా. అయితే ఇప్పుడు కొత్త టేస్ట్ చికెన్ రోస్ట్ ఈ విధంగా చేసి తిన్నారంటే ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. ఇప్పుడు దాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం.. కావాల్సిన పదార్థాలు : చికెన్, కొత్తిమీర, ఉప్పు, […]

 Authored By aruna | The Telugu News | Updated on :25 September 2022,4:00 pm

Roasted Chicken : నాన్ వెజ్ ప్రియులు చికెన్ తో ఎన్నో రకాల వెరైటీస్ చేసుకుని తింటూ ఉంటారు. ఈ చికెన్ తో ఎప్పుడు ఏదో ఒక కొత్త వెరైటీ చేసుకుని తినవచ్చు. ఎప్పుడూ ఒకటే లాగా కాకుండా. అయితే ఇప్పుడు కొత్త టేస్ట్ చికెన్ రోస్ట్ ఈ విధంగా చేసి తిన్నారంటే ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. ఇప్పుడు దాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం.. కావాల్సిన పదార్థాలు : చికెన్, కొత్తిమీర, ఉప్పు, కారం, ధనియా పౌడర్, జీలకర్ర పౌడర్ ,గరం మసాలా, కరివేపాకు ,పచ్చిమిర్చి, అల్లం, ఎల్లిపాయలు, ఉల్లిపాయలు, దాల్చిన చెక్క, సాజీర, లవంగాలు, యాలకులు, అనాసపువ్వు, స్టార్ ,బిర్యాని ఆకు, పసుపు, టమాట ముక్కలు, ఆయిల్ , కసూరి మేతి మొదలైనవి..

తయారీ విధానం : ముందుగా బోన్లెస్ చికెన్ ని తీసుకొని శుభ్రం చేసుకుని పక్కన ఉంచుకోవాలి. ఇక ఒక గుప్పెడు కొత్తిమీరని, నాలుగైదు పచ్చిమిర్చి కొంచెం ఉప్పు, 4 లవంగాలు, ఒక దాల్చిన చెక్క, నాలుగు యాలకులు, కొద్దిగా అల్లం ముక్కలు ,కొద్దిగా ఎల్లిపాయలు, వేసి మెత్తని పేస్టులా పట్టుకొని దీనిని చికెన్ లో వేసి బాగా కలిపి పక్కన ఉంచుకోవాలి. తర్వాత స్టౌ పై ఒక కడాయి పెట్టుకుని దానిలో నాలుగైదు స్పూన్ల ఆయిల్ వేసుకొని ముందుగా సాజీర, దాల్చిన చెక్క, నాలుగు యాలకులు, నాలుగు లవంగాలు, ఒక స్టార్, అనాసపువ్వు, బిర్యానీ ఆకు వేసి కొద్దిసేపు వేయించుకొని తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ ని దాంట్లో వేసి స్టవ్ ని హై లో పెట్టుకుని కలుపుతూ 15 నిమిషాల పాటు వేగనివ్వాలి.

Roasted Chicken with new taste Try Making This

Roasted Chicken with new taste Try Making This..

తర్వాత దానిలోంచి ఆయిల్ సపరేట్ అయిన తర్వాత దానిలోకి ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు, ఒక కప్పు టమాటా ముక్కలు, వేసి బాగా వేయించుకోవాలి. తర్వాతదానిలో ఒక స్పూన్ కారం, ఒక స్పూన్ ఉప్పు, ఒక స్పూన్ ధనియా పౌడర్, ఒక స్పూన్ జీలకర్ర పొడి ఒక స్పూన్ గరం మసాలా, కొంచెం కరివేపాకు, కొద్దిగా కసూరి మేతి వేసి సిమ్లో పెట్టుకుని ఒక పది నిమిషాల పాటు వేగనివ్వాలి. తర్వాత చికెన్ బాగా కలర్ మారిన తర్వాత స్టవ్ ఆపి కొంచెం కత్తిమీర చల్లుకొని దింపి సర్వ్ చేసుకోవచ్చు.. దీన్ని ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. అంత రుచిగా ఉంటుంది. దీనిని స్నాక్ లాగా తీసుకోవచ్చు. అలాగే పప్పు చారు లాంటి వాటిలో కూడా తీసుకోవచ్చు.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది