Rohit Sharma : వాంఖడే స్టేడియంలో రోహిత్‌తో కూడా డ్యాన్స్ చేయించారుగా.. అందరి డ్యాన్స్ చూసి ఫ్యాన్స్ ఫిదా..!
Rohit Sharma : భారతదేశంలో క్రికెట్ అంటే ఎంత పడిచచ్చిపోతారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. టీమిండియా ఓడిన కూడా ఆ జట్టుని సపోర్ట్ చేస్తూ ఆటగాళ్లని ఎంతో ప్రేమిస్తుంటారు. ఇక వరల్డ్ కప్ గెలిస్తే ఇంకెంత ప్రేమ చూపిస్తారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 13 ఏళ్ల ప్రపంచకప్ నిరీక్షణకు తెరదించుతూ రోహిత్ సేన 2024 టీ20 వరల్డ్ కప్ దక్కించుకున్నారు. ఈ క్రమంలో రోహిత్ సేనను అభినందించడానికి అభిమానులు దేశం నలుమూల నుంచి ముంబైకి చేరుకున్నారు. మరోవైపపు టీమిండియా ఆటగాళ్ల వరల్డ్ కప్ ట్రోఫీని పట్టుకుని అభిమానులకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. ముంబై రోడ్లన్ని కిక్కిరిసిపోయాయి. టీమిండియా ప్రయాణిస్తున్న బస్సు చుట్టూ చీమ కూడా దూరే అంత సందు కనిపించలేదు.
Rohit Sharma ఆ డ్యాన్సే వేరు..
అయితే ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఆటగాళ్లకు సన్మాన కార్యక్రమంలో ఫ్యాన్స్ కు కిక్కిచ్చే సన్నివేశాలు చోటుచేసుకున్నాయి. అద్భుతమైన స్పీచ్ తో అలరించిన రోహిత్, కోహ్లీలు అంతకంటే అద్భుతమైన మాస్ డ్యాన్స్ తో అలరించారు. ప్రస్తుతం ఆ వీడియో ఫ్యాన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంటోంది.టీమిండియా వరల్డ్ కప్ విజయోత్సవ యాత్ర అనంతరం వాంఖడే స్టేడియానికి చేరుకున్న టీమిండియా ఆటగాళ్లు గ్రౌండ్ లో తిరుగుతూ.. అభిమానులను ఉత్సాహపరిచారు. ఈ క్రమంలో జట్టు సభ్యులతో కలిసి విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ మాస్ డ్యాన్స్ చేశారు. తమను తాము మరిచిపోయి.. చిన్న పిల్లల్లా డ్యాన్స్ చేశారు ఈ స్టార్ ప్లేయర్లు.
వీరితో పాటుగా హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్, అక్షర్ పటేల్, మహ్మద్ సిరాజ్ చిందులు వేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే రోహిత్, కోహ్లీలు కలిసి డ్యాన్స్ వేయడం బహుశా ఇదే తొలిసారి అనుకుంటా. దాంతో ఇది కదా మేము కోరుకుంది అని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. బార్బడోస్‌లో ఏర్పడిన తుఫాను వలన కాస్త ఆలస్యంగా ఇండియాకి వచ్చిన భారత ఆటగాళ్లు సెలబ్రేషన్స్‌లో పాల్గొంటూ తెగ ఎంజాయ్ చేస్తున్నారు.
Mentally I will be here for the rest of my life 🥹 pic.twitter.com/zI2y9zJDQN
— CricWatcher (@CricWatcher11) July 4, 2024