Roja : చంద్రబాబుకు అధికారం వస్తే పిల్లల కోడిగుడ్డు కూడా వదలడు

 Authored By prabhas | The Telugu News | Updated on :7 May 2022,7:00 pm

Roja : జగన్ ఒక్క ఛాన్స్ ఇవ్వంటే ఇచ్చారు.. ఇప్పుడు జనాలు బాధ పడుతున్నారు అంటూ చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలపై మంత్రి రోజా తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇంకా చంద్రబాబు నాయుడు పెద్ద ఎత్తున దోచేస్తున్నార అంటూ ఆరోపించాడు. ఆ ఆరోపణలకు కూడా మంత్రి రోజా గట్టి సమాధానం ఇచ్చి తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మరియు నాయకులు మారు మాట్లాడకుండా చేసింది.

తాజాగా ఆమె మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతూ.. చంద్రబాబు నాయుడు చాలా సార్లు సీఎంగా చేశాను… నాకు సీఎం పదవి పై ఆసక్తి లేదంటున్నాడు. జనాలకు మంచి చేస్తానంటూ నమ్మబలుకుతున్నాడు. ఆయన ముఖ్యమంత్రి అయితే ఏం చేస్తాడో అందరికి తెలుసు. చిన్న పిల్లలకు హాస్టల్‌ లో పెట్టే కోడి గుడ్డు మొదలుకుని స్టార్‌ హోటల్స్ లో బిల్లుల వరకు ప్రతి ఒక్కటి కూడా దోచుకుని మూట కట్టుకుంటాడు అంటూ రోజా ఆరోపణలు చేసింది.

roja super coutnter to chandrababu naidu

roja super coutnter to chandrababu naidu

మా సీఎం జగన్ పై సొంతంగా యుద్దం చేసే దమ్ము లేక వారితో వీరితో పొత్తు పెట్టుకోవడం కోసం ప్రాకులాడుతున్న చంద్రబాబు నాయుడుకు అసలు మా పార్టీ గురించి మా సీఎం గురించి మాట్లాడే అర్హత లేదని రోజా ఆరోపించింది. టెన్త్‌ మరియు ఇంటర్ పరీక్ష పేపర్ల లీక్ పూర్తిగా నారాయణ మరియు శ్రీ చైతన్య కాలేజీల నుండి జరుగుతున్నట్లుగా ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు. వాటిని కూడా చంద్రబాబు నాయుడు రాజకీయం చేసి లబ్ది పొందాలని ప్రయత్నాలు చేస్తున్నారంటూ రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు.

prabhas

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి