Roja : ఈ సారైనా ఆశ నెరవేరేనా.. మినిస్టర్‌గా రోజా? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Roja : ఈ సారైనా ఆశ నెరవేరేనా.. మినిస్టర్‌గా రోజా?

 Authored By mallesh | The Telugu News | Updated on :15 January 2022,9:00 pm

Roja : ప్రముఖ సినీ నటి, నగరి ఎమ్మెల్యే రోజా వైసీపీ ఫైర్ బ్రాండ్ లీడర్‌గా ఏపీ రాజకీయాల్లో పేరు తెచ్చుకుంది. వైసీపీ వాదనను ఎప్పటికప్పుడూ బలపరుస్తూ ప్రతిపక్షాలను టార్గెట్ చేస్తుంటుంది రోజా. అయితే, వైసీపీలో ఆమె పోషించిన క్రియాశీలక పాత్రకుగాను ఆమెకు ఎప్పుడో మంత్రి పదవి ఇవ్వాల్సిందని ఆమె వర్గీయులు అనుకుంటుంటారు. కాగా, త్వరలోనే ఆమెను మంత్రి పదవి వరిస్తుందని ఊహాగానాలు వస్తున్నాయి.అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్ల తర్వాత కేబినెట్ పూర్తి స్థాయిలో మార్పులు చేర్పులుంటాయని, మంత్రి వర్గ విస్తరణ ఉంటుందని జగన్ గతంలో చెప్పారు.

ఈ క్రమంలోనే ఏపీ కేబినెట్ విస్తరణపై చాలా కాలం నుంచి వార్తలొస్తున్నాయి. కానీ, కరోనా పరిస్థితులు, ఇతర కారణాల రిత్యా ఏపీ కేబినెట్ అలానే కొనసాగుతున్నది. తాజాగా వస్తున్న వార్తల ప్రకారం.. త్వరలో కంపల్సరీగా ఏపీ కేబినెట్ లో మార్పులుంటాయని సమాచారం.వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నపుడు చంద్రబాబును ఎదుర్కోవడంలో దూకుడుగా వ్యవహరించిన రోజాకు ఈ సారి మంత్రి పదవి వస్తుందని ఈ సందర్భంగా వార్తలొస్తున్నాయి. వైసీపీ వర్గాల్లో ఈ మేరకు ప్రచారం కూడా జరుగుతుంది. కానీ, వైసీపీ అధినేత జగన్ మనసులో ఏముందో తెలియదు. సామాజిక వర్గాల సమీకరణాల దృష్ట్యా చూసినా ఈ సారి రోజాకు కేబినెట్ లో బెర్త్ ఖాయమైందని కొందరు అంటున్నారు. కానీ, చివరి వరకు చెప్పలేమని మరి కొందరు చెప్తున్నారు.

roja will be inducted into Ys jagan cabinet soon

roja will be inducted into Ys jagan cabinet soon

Roja : త్వరలో కేబినెట్‌లో మార్పులు..!

గతంలో ఆమెకు ఏఐసీసీ చైర్ పర్సన్ పదవి ఇచ్చారు. కొద్ది రోజుల తర్వాత ఆ పదవి కూడా తప్పించారు. కాగా, ఈ సారి కేబినెట్ మంత్రిగా అవకాశమిస్తారని పలువురు అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.. అయితే, రోజాకు మంత్రి పదవి ఇస్తే ఇంకా దూకుడుగా వ్యవహరించి వైసీపీని రాష్ట్రవ్యాప్తంగా బలోపేతం చేస్తుందని, కేడర్ కు దిశా నిర్దేశం చేస్తుందని కొందరు వైసీపీ నేతలు అభిప్రాయపడుతున్నారు.

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది