Minister Roja : పిల్ల పిత్రే గాడు అంటూ లోకేష్ పై రోజా సెటైర్లు వీడియో వైరల్..!!
ఏపీ వైసీపీ మంత్రి రోజా టీడీపీ యువనేత లోకేష్ పై సెటైర్లు వేశారు. వార్డు మెంబర్ కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ పిల్లగాడు లోకేష్ అని వ్యంగ్యంగా విమర్శలు చేశారు. లోకేష్ తన పాదయాత్రలో వెళ్లే ప్రతి నియోజకవర్గంలో అక్కడి వైసీపీ ఎమ్మెల్యేలను మంత్రులను రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. వార్తల్లో చర్చనీయాంశం అవటానికి పెద్ద చిన్న లేకుండా లోకేష్ రెచ్చగొట్టే ధోరణితో ఆలంబిస్తున్నారు. లోకేష్ ని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్న..
అధికారంలోకి వస్తే వైసీపీ ఎమ్మెల్యేలను కార్యకర్తలను ఊరికించి కొడతామని చేసిన వ్యాఖ్యలను.. లోకేష్ వెనక్కి తీసుకోవాలని రోజా డిమాండ్ చేశారు. లేకపోతే ఇప్పుడు తమ అధికారంలో ఉన్నాం.. ఆ పని మేమే చేయాల్సి వస్తుందని అన్నారు. ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజల కష్టాలను తన కష్టాలుగా భావించి అందరికీ సంక్షేమాన్ని అందిస్తూ అభివృద్ధి చేస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు పరుగులు చేయించేలా సీఎం జగన్ పాలిస్తున్నారని తెలిపారు. అటువంటి ముఖ్యమంత్రి జగన్ ని తన ఛానల్స్ ద్వారా తిట్టిస్తే 2024లో
చంద్రబాబుకి పుట్టగతులు ఉండవని జీరోకి పడిపోతారని మంత్రి రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో వెన్నుపోటు పొడిచి గెలిచి ఇప్పుడు కుల రాజకీయాలు చంద్రబాబు తెరపైకి తీసుకొస్తున్నారని రోజా ఆరోపించారు. గతంలో కుల రాజకీయాలు కారణంగానే తాను ప్రతిపక్షంలో ఉన్న సమయంలో చంద్రబాబు అసెంబ్లీ నుండి సస్పెండ్ చేయించారని రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజలకు ఇచ్చిన మాట నెరవేర్చే విషయంలో జగన్ కి.. చంద్రబాబుకి నక్కకి నాగలోకానికి మధ్య అంత తేడా ఉంది అంటూ రోజా కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది.
