kcr : కేసీఆర్, పీకే టీంకు ఒప్పందం కుదిరిందా… సీఏం అగ్రెసివ్ బిహేవియర్ కు కారణం అదేనా..!
kcr : ప్రశాంత్ కిషోర్ దేశ రాజాకీయాల్లో పెను సంచలనం సృష్టిస్తున్నారు. తను ఎక్కడ అడుగు పెడితే అక్కడ విజయం తనదే అన్న రీతిలో ఇప్పటికే దేశ వ్యాప్తంగా అతని పేరు మారుమోగుతోంది. పీకే రాజకీయ వ్యూహకర్తగా సేవలందించిన ప్రతి పార్టీ… అధికారంలోకి వస్తూ ఉండటంతో ఆయనకు డిమాండ్ భారీ స్థాయిలో పెరుగుతూ వస్తోంది. ప్రశాంత్ కిషోర్ ను నమ్మి… ఆయనను అనుసరిస్తే తప్పకుండా అధికారంలోకి వస్తామనే అభిప్రాయం అన్ని రాజకీయ పార్టీలలోనూ నెలకొంది. ఏపీ లో జగన్ తో కలిసి తెలుగు దేశం పార్టీని చావుదెబ్బ కొట్టి వైసీపీ కి గ్రాండ్ విక్టరీని అప్పగించిన ఘనత కూడా ప్రశాంత్ కిషోర్ దే. మొన్నటికి మొన్న పశ్చిమ బెంగాల్ లో మోడీతో ఢీ కొట్టిన దిదీ చెంత చేరి ఆమెకు కూడా విజయాన్ని కట్ట బెట్టిన తీరు అద్భుతమనే చెప్పాలి. అయితే ఇప్పుడు మనం ఇంతలా పీకే గురించి ఎందుకు చర్చించుకోవాల్సి వచ్చిందంటే… తెలంగాణ సీఏం కేసీఅర్ కూడా ఇప్పుడు పీకే తో చేతులు కలిపినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
kcr: తెరాసతో పీకే ఒప్పందం
తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రశాంత్ కిషోర్ తో కలవడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది.ఈ మేరకు ఇరువురి మధ్య ఒప్పందం కూడా జరిగినట్లు సమాచారం. భాజపా వ్యతిరేక పార్టీలకు మద్దతుగా రాజకీయ వ్యూహాలు అందించేందుకు ఆసక్తిగా ఉండే పీకే కూడా కేసీఆర్ తో దోస్తికి చేతులు కలిపారని పలువురు రాజకీయ ప్రముఖులు అంటున్నారు. తెరాసకు అనుకూలంగా పీకే బృందం పని చేయబోతోందని గతంలో ఒకటి రెండు సార్లు ప్రచారం జరిగింది. మళ్ళీ ఇటీవల ఢిల్లీ పర్యటనల్లో కూడా కేసీఆర్ ప్రశాంత్ తో భేటీ అయ్యారని భాజపా నేతలు అంటున్నారు. ఆయన సలహాలతోనే సీఏం విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా తిట్ల రాజకీయం చేస్తున్నారని భాజపా ఎమ్మెల్యే రఘునందనరావు ఆరోపిస్తున్నారు.
kcr : ఏపీలోలాగే తెలంగాణా లోనూ
తమిళనాడులో స్టాలిన్ కు సైతం విజయం అందించిన ప్రశాంత్.. ఏపీలో కూడా వైసీపీకి అండగా నిలుస్తున్నారు. అక్కడ ప్రతిపక్షం ఎంత దారుణమైన పరిస్థితులను ఎదుర్కొంటుందో చూస్తూనే ఉన్నాం. కేసిఆర్ కూడా పీకే మార్క్ రాజకీయ వ్యూహాలు అమలు చేస్తున్నారన్న విషయం తెలంగాణ రాజకీయాల్లో సహజంగానే వ్యక్తమవుతోంది. ఏదీ ఏమైనప్పటికీ అన్ని పక్కన పెడితే ఏపీలో ఎదురైనట్టే తెలంగాణలోనూ రాజకీయాలు మరింత దిగజారిపోతాయా అన్న అనుమానం ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.