RR – SRH : ఈ ఐపిఎల్ ఆఖరి లీగ్స్ నేడు.. రెండో స్థానం కోసం నువ్వా.. నేనా అంటున్న RR , SRH..!
RR – SRH : ఐపీఎల్ సీజన్ 17 చివరి దశకు వచ్చేసింది. ఇన్నాళ్లు ఆసక్తికరంగా జరిగిన ఫైట్‌లో నాలుగు టీమ్స్ మాత్రమే ప్లే ఆఫ్స్‌కి చేరుకున్నాయి.అయితే వాటి స్థానాలపై కొంత సస్పెన్స్ ఉంది. ప్రస్తుతానికి 19 పాయింట్లతో కేకేఆర్ టాప్‌లో ఉండగా, ఆర్సీబీ (14 పాయింట్లు) నాలుగో స్థానంలో ఉంది. ఈ రెండు స్థానాల్ కన్‌ఫాం అయినట్టే. అయితే రాజస్థాన్ రాయల్స్ (16 పాయింట్లు), సన్‌రైజర్స్ (15 పాయింట్లు) వరుసగా 2,3 ప్లేస్‌లలో ఉండగా, వీటి స్థానాలు మారే అవకాశం కనిపిస్తుంది. ఆదివారం రోజు రెండు ఇంట్రెస్టింగ్ మ్యాచ్‌లు జరగనుండగా, వాటి రిజల్ట్ బట్టి రెండు స్థానాలపై క్లారిటీ వస్తుంది.
RR – SRH రెండో స్థానం కోసం పోటీ..
రాజస్థాన్ రాయల్స్ 13 మ్యాచ్‌ల్లో 8 విజయాలు, 5 ఓటములు సాధించింది. ఖాతాలో 16 పాయింట్లు ఉన్నాయి. జట్టు రన్ రేట్ 0.273లుగా నిలిచింది. ఇదే స్టేడియంలో జరిగిన చివరి మ్యాచ్‌లో రాజస్థాన్‌ను 5 వికెట్ల తేడాతో పంజాబ్ ఓడించింది. కోల్‌కతాతో జరిగే మ్యాచ్‌లో రాజస్థాన్ గెలిస్తే 18 పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతుంది. అయితే, పంజాబ్ కింగ్స్‌కి ఓటమి పాలయితే, హైదరాబాద్ 17 పాయింట్లతో ఉంటుంది. ఇలాంటి పరిస్థితిలో సన్‌రైజర్స్ హైదరాబాద్ రాజస్థాన్ రాయల్స్‌ను అధిగమించే ఆస్కారం ఉంటుంది. హైదరాబాద్ రెండో స్థానానికి చేరుకుంటుంది. సన్‌రైజర్స్ రన్ రేట్ కూడా రాయల్స్ కంటే మెరుగ్గా ఉంది.
ఈ మ్యాచ్‌లో కేకేఆర్ ఓడినా అగ్రస్థానంలోనే ఉంటుంది. కానీ, రాజస్థాన్ నెగ్గితే 18 పాయింట్లతో టాప్- 2లోకి వస్తుంది. ఒకవేళ ఓడినా లేదా వర్షం కారణంగా మ్యాచ్ రద్దైనా ఆ ప్లేస్ సన్‌రైజర్స్‌కు దక్కుతుంది.అయితే ఆదివారం జరిగే రెండు మ్యాచ్‌లకి వర్షం ముప్పు ఉంది. రెండు మ్యాచ్‌లు వర్షం వలన జరగని పక్షంలో యధాస్థానాలలో ఆయా జట్లు ఉంటాయి. అంటే కేకేఆర్- రాజస్థాన్, క్వాలిఫయర్- 1లో తలపడితే… సన్‌రైజర్స్- ఆర్సీబీ ఎలిమినేటర్‌లో ఢీ కొంటాయి. అయితే టాప్- 2లో ఉంటే క్వాలిఫయర్- 1లో ఓడిన కూడా మరో సారి పోరాడేందుకు ఛాన్స్ ఉంటుంది. కాబట్టి సన్‌రైజర్స్, రాజస్థాన్ రెండో స్థానం కోసం గట్టిగా ఫైట్ చేయాలని భావిస్తున్నాయి.