Nitish Kumar Reddy : ఏంటి… నితీష్ కుమార్ రెడ్డి సన్‌రైజర్స్ జట్టుని వీడుతున్నాడా.. క్లారిటీ ఇచ్చిన హైదరాబాద్ ప్లేయర్..!
ప్రధానాంశాలు:
Nitish Kumar Reddy : ఏంటి... నితీష్ కుమార్ రెడ్డి సన్‌రైజర్స్ జట్టుని వీడుతున్నాడా.. క్లారిటీ ఇచ్చిన హైదరాబాద్ ప్లేయర్..!
Nitish Kumar Reddy : సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH)ను నితీష్ కుమార్ రెడ్డి వీడుతున్నట్లు జరుగా ప్రచారాలు సాగుతున్నాయి. ఈ ప్రచారంపై ఆ జట్టు స్టార్ ఆల్‌రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి స్పష్టత ఇచ్చాడు. తాను సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులోనే కొనసాగుతానని ఎక్స్‌వేదికగా తెలిపాడు. ఐపీఎల్ 2025 సీజన్‌లో తనను లోయర్ ఆర్డర్‌లో బ్యాటింగ్‌కు పంపడంపై నితీష్ కుమార్ రెడ్డి అసంతృప్తితో ఉన్నాడని, జట్టును వీడేందుకు సిద్దమయ్యాడని జోరుగా ప్రచారం జరిగింది.

Nitish Kumar Reddy : ఏంటి… నితీష్ కుమార్ రెడ్డి సన్‌రైజర్స్ జట్టుని వీడుతున్నాడా.. క్లారిటీ ఇచ్చిన హైదరాబాద్ ప్లేయర్..!
Nitish Kumar Reddy : అవన్నీ అవాస్తవాలు..
ఈ ప్రచారంపై సోషల్ మీడియా వేదికగా స్పందించిన నితీష్ కుమార్ రెడ్డి అందరికీ క్లారిటీ ఇచ్చాడు. ‘ఇలాంటి ప్రచారాలకు నేను దూరంగా ఉంటా. కానీ కొన్ని విషయాల్లో స్పష్టత అవసరం. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో నా బంధం నమ్మకం, గౌరవం అనే వాటితో కొన్నేళ్లుగా కొనసాగుతోంది. నేనెప్పుడూ జట్టుతోనే ఉంటా’అని నితీష్ కుమార్ రెడ్డి ట్వీట్ చేశాడు.
ఐపీఎల్ 2023 సీజన్‌లో కనీస ధర రూ. 20 లక్షలతో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులోకి వచ్చిన నితీష్ కుమార్ రెడ్డి కేవలం రెండు మ్యాచ్‌లే ఆడాడు. ఐపీఎల్ 2024 సీజన్‌లో సంచలన ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షించిన ఈ ఆటగాడు 13 మ్యాచ్‌ల్లో 33.67 సగటుతో 303 పరుగులు చేశాడు. ఇందులో మూడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఆల్‌రౌండర్‌గా విలువైన పరుగులు జోడించి సన్‌రైజర్స్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. బౌలింగ్‌లో మూడు వికెట్లు తీసాడు. ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది అవార్డు అందుకున్నాడుత. తాజా సీజన్‌లో నితీష్ రెడ్డి ఆశించిన రీతిలో రాణించలేకపోయాడు. ఈ క్రమంలోనే అతను సన్‌రైజర్స్‌ను వీడేందుకు సిద్దమయ్యాడని వార్తలు వచ్చాయి. కానీ నితీష్ వాటిని ఖండించాడు.