RRR నుంచి మరో లీక్.. రామ్ చరణ్ కూడా అలా చెప్పేశాడు! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

RRR నుంచి మరో లీక్.. రామ్ చరణ్ కూడా అలా చెప్పేశాడు!

 Authored By bkalyan | The Telugu News | Updated on :19 February 2021,6:01 pm

RRR : దర్శకధీరుడు రాజమౌళి ఇప్పుడు ఆర్ఆర్ఆర్ షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. క్లైమాక్స్ షూటింగ్ చేస్తూ ముగింపు పలికే దశలో ఉన్నాడు. మొన్న జరిగిన ఉప్పెన సక్సెస్ మీట్‌లో ముఖ్య అతిథిగా వచ్చేసిన రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ షూటింగ్ ఎక్కడ జరుగుతోందో లీక్ చేసేశాడు. పుష్ప సినిమా ఎక్కడైతే షూటింగ్ జరుపుకుందో.. ఇప్పుడు మరి కొన్ని చిత్రాలకే అక్కడే లొకేషన్స్ దొరికినట్టున్నాయి.

Rajamouli RRR Shooting Leak Video

Rajamouli RRR Shooting Leak Video

మారెడుమిల్లిలో షూటింగ్ చేస్తున్నాను. రాజమండ్రితో అనుబంధం ఉందంటూ రామ్ చరణ్ స్పీచ్ ఇచ్చాడు. అలా ఆర్ఆర్ఆర్ షూటింగ్ అక్కడే జరుగుతోందని లీక్ ఇచ్చినట్టు అయింది. అయితే ఇప్పుడు ఏకంగా ఓ వీడియో కూడా బయటకు వచ్చింది. అందులో రాజమౌళి అసిస్టెంట్లు సీన్స్‌ను వివరిస్తున్నట్టు కనిపిస్తోంది. అసలే భారీ ఎత్తున షూట్ చేస్తోన్న ఈ క్లైమాక్స్ సీన్స్ థియేటర్లో ఒళ్లు గగుర్పొడిచేలా ఉంటుందని తెలుస్తోంది.

మొదటి నుంచి కూడా ఆర్ఆర్ఆర్ లీకుల బారిన పడుతూనే ఉంది. ఇలా సినిమా ముగింపుదశకు వచ్చినా కూడా లీకులు ఆగడం లేదు. అలా మొత్తంగా బయటకు వచ్చిన ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. అది అలా ఉంచితే ఇప్పుడు ఆర్ఆర్ఆర్ బిజినెస్ మీద అందరి కళ్లు పడ్డాయి. తమిళ హక్కులను 42 కోట్లకు లైకా అనే సంస్థ చేజిక్కించుకుందనే వార్త వైరల్ అవుతోంది. ఇక ఒక్క తమిళనాటే ఆ రేంజ్ బిజినెస్ అంటే ఇండియా మొత్తం చూస్తే కళ్లు చెదిరిపోవాల్సిందే.

 

View this post on Instagram

 

A post shared by Telugu FilmNagar (@telugufilmnagar)

Advertisement
WhatsApp Group Join Now

bkalyan

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది