2000 Notes : ఈరోజు నుంచే 2000 నోటు మార్చుకోవచ్చు.. కానీ ఒక షరతు..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

2000 Notes : ఈరోజు నుంచే 2000 నోటు మార్చుకోవచ్చు.. కానీ ఒక షరతు..!

2000 Notes : 2000 రూపాయల నోట్లు మీ దగ్గర ఉన్నాయా? ఏం టెన్షన్ పడకండి. ఈరోజు నుంచి మీరు 2000 రూపాయల నోట్లను మార్చుకోవచ్చు. 2000 రూపాయల నోట్లను మే 19న ఆర్బీఐ రద్దు చేసిన విషయం తెలిసిందే. రద్దు చేసినా కూడా అవి లీగల్ గా చలామణిలో ఉంటాయని.. కాకపోతే వాటిని వెంటనే మార్చుకోవాలని ఆర్బీఐ సూచించింది. ప్రజలు తమ దగ్గర ఉన్న నోట్లను మే 23 నుంచి దగ్గర్లోని బ్యాంకులో మార్చుకోవచ్చని ఆర్బీఐ […]

 Authored By kranthi | The Telugu News | Updated on :23 May 2023,7:00 pm

2000 Notes : 2000 రూపాయల నోట్లు మీ దగ్గర ఉన్నాయా? ఏం టెన్షన్ పడకండి. ఈరోజు నుంచి మీరు 2000 రూపాయల నోట్లను మార్చుకోవచ్చు. 2000 రూపాయల నోట్లను మే 19న ఆర్బీఐ రద్దు చేసిన విషయం తెలిసిందే. రద్దు చేసినా కూడా అవి లీగల్ గా చలామణిలో ఉంటాయని.. కాకపోతే వాటిని వెంటనే మార్చుకోవాలని ఆర్బీఐ సూచించింది. ప్రజలు తమ దగ్గర ఉన్న నోట్లను మే 23 నుంచి దగ్గర్లోని బ్యాంకులో మార్చుకోవచ్చని ఆర్బీఐ తెలిపింది.

అంటే ఈరోజు నుంచి బ్యాంకులలో 2000 రూపాయల నోట్లను మార్చుకోవచ్చు. కాకపోతే కొన్ని కండిషన్లను ఆర్బీఐ పెట్టింది. బ్యాంక్ ఖాతా ఉన్నవాళ్లు తమ అకౌంట్లలో 2000 రూపాయల నోట్లను జమ చేసుకోవచ్చు. ఖాతా లేనివాళ్లు.. ఏదైనా బ్యాంకుకు వెళ్లి రూ.20000 మాత్రమే మార్చుకోగలరు. అంటే 2000 నోట్లు 10 మాత్రమే మార్చుకునే చాన్స్ ఉంది. లేదా వాటిని నేరుగా తమ అకౌంట్లలో జమ చేసుకోవచ్చు.

guidelines for 2000 notes exchange

2000 Notes : అధిక మొత్తంలో డిపాజిట్ చేస్తే ఎలా?

అయితే.. 2000 నోట్లను నేరుగా తమ అకౌంట్లలో జమ చేయాలనుకుంటే ఇది వరకు ఎలాంటి నిబంధనలు ఉన్నాయో అవే ఇప్పుడు కూడా వర్తిస్తాయి. కానీ.. రూ.50 వేల రూపాయల డిపాజిట్ దాటితే మాత్రం ఖచ్చితంగా పాన్ కార్డు వివరాలు ఇవ్వాలి. అధిక మొత్తంలో లక్షల రూపాయలు కేవలం రూ.2000 నోట్లనే డిపాజిట్ చేస్తే మాత్రం ఇన్ కమ్ టాక్స్ డిపార్ట్ మెంట్ కు బ్యాంకులు సంబంధిత ఖాతాదారుడి వివరాలను బ్యాంకులు పంపిస్తాయి. మరోవైపు రూ.2000 నోట్ల రద్దు ప్రకటనతో బంగారం కొనుగోళ్లు ఒక్కసారిగా పెరిగాయి. దీంతో బంగారం రేట్లను వ్యాపారులు ఒక్కసారిగా పెంచారు.

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది