RBI Bans 2000 Notes : అసలు ఆర్బీఐ 2000 నోట్లను ఎందుకు బ్యాన్ చేసిందో తెలుసా? అసలు కారణం ఏంటో తెలిస్తే ముక్కున వేలేసుకుంటారు
RBI bans 2000 Notes : మీకు గుర్తుందా? అది 2016వ సంవత్సరం. ఒక రోజు రాత్రి సడెన్ గా అన్ని టీవీల్లో ప్రధాని మోదీ ప్రత్యక్షమయ్యారు. ఈరోజు రాత్రి నుంచి రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేస్తున్నామని ప్రకటించారు. ఆ నోట్లు ఇక చెల్లవని ఆ నోట్లు ఉన్నవాళ్లు వెంటనే బ్యాంకులకు వెళ్లి మార్చుకోవాలని చెప్పారు. దీంతో ప్రజలంతా బ్యాంకుల ముందు క్యూ కట్టారు. వాటిని రద్దు చేసి వాటి స్థానంలో కొత్త రూ.500, రూ.100 నోట్లను తీసుకొచ్చారు. ఇదివరకు ఎప్పుడూ చెలామణిలో లేని రూ.2000 నోట్లను కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది.
ఇప్పుడు ఆ రెండు వేల రూపాయల నోట్లను కూడా రద్దు చేస్తున్నట్టు కేంద్రం తాజాగా ప్రకటించింది. వెంటనే అన్ని బ్యాంకులు రూ.2 వేల నోట్లను వినియోగదారులకు ఇవ్వకుండా నిలిపివేయాలని ఆర్బీఐ ఆదేశాలు జారీ చేసింది. అసలు ఇంత సడెన్ గా ఆర్బీఐ రెండు వేల రూపాయల నోట్లను ఎందుకు బ్యాన్ చేసింది.. అంటే రెండు వేల నోటు అనేది చాలా పెద్దది. ప్రస్తుతం నల్లధనం అనేది ఎక్కువగా ఈ నోట్ల రూపంలోనే ఉంది. వాటి నకిలీ నోట్లు కూడా చలామణిలో ఉన్నట్టు ఆర్బీఐకి తెలిసింది.ఎవరైనా నల్లధనాన్ని దాయాలనుకుంటే రూ.2 వేల నోట్లనే దాస్తున్నారు. అవి ఎక్కువ కట్టలు అవసరం ఉండదు. తక్కువ నోట్లు.. ఎక్కువ మొత్తంలో దాయొచ్చు.
RBI bans 2000 Notes : ఆర్థిక వ్యవస్థకు ముప్పు కలిగించే నకిలీ రూ.2 వేల నోట్లు
అలాగే.. రూ.2 వేల నకిలీ నోట్లు కూడా మార్కెట్ లోకి వస్తున్నాయి. అవి ఎక్కువ సంఖ్యలో వస్తే అది దేశ ఆర్థిక వ్యవస్థకే తీవ్ర ముప్పు కలిగిస్తుంది. నిజానికి.. 2019 సంవత్సరంలోనే రూ.2 వేల నోట్ల ముద్రణను ఆర్బీఐ ఆపేసింది. దేశంలో ఇప్పుడు రూ.3.52 లక్షల కోట్ల వాల్యూ ఉన్న రూ.2 వేల నోట్లు చలామణిలో ఉన్నాయి. ఇది ఎన్నికల కాలం కావడం, త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పార్టీలు విచ్చలవిడిగా రూ.2 వేల నోట్లను ప్రజలకు ఎరగా చూపిస్తూ ఖర్చు చేస్తున్నాయనే ఆరోపణలు కూడా ఉన్నాయి. అందుకే.. కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. చూద్దాం మరి.. ఈ నిర్ణయం దేశంలో ఎంత మేరకు మార్పు తీసుకొస్తుందో?