2000 Notes : 2000 రూపాయల నోట్లు మీ దగ్గర ఉన్నాయా? ఏం టెన్షన్ పడకండి. ఈరోజు నుంచి మీరు 2000 రూపాయల నోట్లను మార్చుకోవచ్చు. 2000 రూపాయల నోట్లను మే 19న ఆర్బీఐ రద్దు చేసిన విషయం తెలిసిందే. రద్దు చేసినా కూడా అవి లీగల్ గా చలామణిలో ఉంటాయని.. కాకపోతే వాటిని వెంటనే మార్చుకోవాలని ఆర్బీఐ సూచించింది. ప్రజలు తమ దగ్గర ఉన్న నోట్లను మే 23 నుంచి దగ్గర్లోని బ్యాంకులో మార్చుకోవచ్చని ఆర్బీఐ తెలిపింది.
అంటే ఈరోజు నుంచి బ్యాంకులలో 2000 రూపాయల నోట్లను మార్చుకోవచ్చు. కాకపోతే కొన్ని కండిషన్లను ఆర్బీఐ పెట్టింది. బ్యాంక్ ఖాతా ఉన్నవాళ్లు తమ అకౌంట్లలో 2000 రూపాయల నోట్లను జమ చేసుకోవచ్చు. ఖాతా లేనివాళ్లు.. ఏదైనా బ్యాంకుకు వెళ్లి రూ.20000 మాత్రమే మార్చుకోగలరు. అంటే 2000 నోట్లు 10 మాత్రమే మార్చుకునే చాన్స్ ఉంది. లేదా వాటిని నేరుగా తమ అకౌంట్లలో జమ చేసుకోవచ్చు.
అయితే.. 2000 నోట్లను నేరుగా తమ అకౌంట్లలో జమ చేయాలనుకుంటే ఇది వరకు ఎలాంటి నిబంధనలు ఉన్నాయో అవే ఇప్పుడు కూడా వర్తిస్తాయి. కానీ.. రూ.50 వేల రూపాయల డిపాజిట్ దాటితే మాత్రం ఖచ్చితంగా పాన్ కార్డు వివరాలు ఇవ్వాలి. అధిక మొత్తంలో లక్షల రూపాయలు కేవలం రూ.2000 నోట్లనే డిపాజిట్ చేస్తే మాత్రం ఇన్ కమ్ టాక్స్ డిపార్ట్ మెంట్ కు బ్యాంకులు సంబంధిత ఖాతాదారుడి వివరాలను బ్యాంకులు పంపిస్తాయి. మరోవైపు రూ.2000 నోట్ల రద్దు ప్రకటనతో బంగారం కొనుగోళ్లు ఒక్కసారిగా పెరిగాయి. దీంతో బంగారం రేట్లను వ్యాపారులు ఒక్కసారిగా పెంచారు.
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివాహం విఫలమై ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న మహిళలకు గొప్ప ఊరటను కలిగించే వార్తను…
BC Youth Employment : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు…
wife Killed Her Husband : నిర్మల్ జిల్లాలో దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వివాహ…
డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…
Lord Vinayaka | తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…
Vodafone | వోడాఫోన్-ఐడియా (Vi) తమ వినియోగదారుల కోసం అద్భుతమైన గేమ్ బేస్డ్ ప్రమోషనల్ ఆఫర్ను తీసుకువచ్చింది. అత్యుత్తమ ప్రయోజనాలతో…
Manchu Manoj | ఇటీవలే భైరవ సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన హీరో మంచు మనోజ్, సినిమాలతో పాటు…
Lord Ganesh | వినాయక చవితి వేడుకలు ఇంకా ప్రారంభం కాకముందే హైదరాబాద్లో అపశృతి చోటుచేసుకుంది. గణేష్ విగ్రహాన్ని మండపానికి తీసుకెళ్తుండగా…
This website uses cookies.