Sabarimala | శబరిమల ఆలయంలో బంగారం స్కామ్ కలకలం .. గర్భగుడిలోని యోగదండం మిస్సింగ్!
Sabarimala | శబరిమల ఆలయ గర్భగుడిలో ఉండాల్సిన పవిత్రమైన యోగదండం (బంగారు పూతతో కూడిన పూర్వకాలిక దండం) కనిపించకుండా పోయిందన్న విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఇది సగటు ఆస్తి కాదు, భక్తుల విశ్వాసానికి, ఆధ్యాత్మిక పరమైన ఆచారాలకు ప్రతీకగా భావించబడే అమూల్యమైన వస్తువు.
#image_title
2018లో తీసుకెళ్లిన యోగదండం.. తిరిగిరాలేదా?
వివరాల్లోకి వెళితే, 2018లో ఆ యోగదండాన్ని బంగారు పూత పూయించేందుకు ఆలయం నుంచి తీసుకెళ్లారు. అయితే, పూత పూర్తైన తర్వాత తదుపరి బదిలీ అయిన దండం కొత్తదిగా తయారై ఆలయానికి తిరిగి వచ్చింది. అసలు దండాన్ని మాత్రం తిరిగి ఆలయానికి ఇవ్వలేదన్న అనుమానాలు వెలుగులోకి వచ్చాయి.
అదే సమయంలో రుద్రాక్ష మాలకు కూడా బంగారు పూత పూయించాలని భావించినా, కేరళ హైకోర్టు అనుమతి ఇవ్వలేదు. దీంతో ఆ మాలను బయటకు తీసుకెళ్లే అవకాశం రాలేదు. అయితే ఇప్పుడు ఆ రెండు – యోగదండం, రుద్రాక్ష మాల – రెండూ కనిపించకుండా పోయాయని ఆలయ వర్గాల సమాచారం.ఈ విలువైన వస్తువుల గురించి స్ట్రాంగ్‌రూమ్ రిజిస్టర్‌లో ఎలాంటి ఎంట్రీ లేదు. తూకాలు, రికార్డులు, రిజిస్ట్రేషన్ – అన్నీ గోప్యంగా ఉండిపోయాయి. ఇది ఆలయ పరిపాలనపై తీవ్రమైన ప్రశ్నలు లేవనెత్తుతోంది.