sajjala rama krishna reddy strong counter to telangana minister harish rao
Harish Rao : ఏపీ, తెలంగాణ ప్రభుత్వాల మధ్య ప్రస్తుతం పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంతలా వార్ నడుస్తోంది. నిజానికి.. ఒకప్పుడు అంటే 2019 ఎన్నికల్లో జగన్ ముఖ్యమంత్రి అయ్యాక… తెలంగాణ ప్రభుత్వం.. ఏపీతో బాగానే ఉండేది. కానీ.. తర్వాత ఏపీ ప్రభుత్వంపై తెలంగాణ ప్రభుత్వం కొన్ని విషయాల్లో విమర్శిస్తూ రావడం వల్ల రెండు ప్రభుత్వాల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. తాజాగా తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావుపై… ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి (sajjala rama krishna reddy ) ఆగ్రహం వ్యక్తం చేశారు.
మీకు తెలంగాణలో సమస్యలు లేవా.. తెలంగాణలో సమస్యలు వదిలేసి… ఏపీపై కామెంట్ చేయడం కరెక్టా? ఏపీ గురించి మీకెందుకు.. ఏపీపై కామెంట్ చేయడం కరెక్ట్ కాదంటూ సజ్జల హితువు పలికారు. మంత్రి హరీశ్ రావు (harish rao ) .. ఏపీలో టీచర్ల గురించి, వ్యవసాయ మోటార్లకు గురించి చేసిన వ్యాఖ్యలపై సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్రస్థాయిలో స్పందించారు. తాము ఎప్పుడూ వేరే రాష్ట్రం గురించి కామెంట్ చేయలేదని ఆయన ఈసందర్భంగా గుర్తు చేశారు.
sajjala rama krishna reddy strong counter to telangana minister harish rao
ఇది కేవలం రెండు రాష్ట్రాల మధ్య అంశం కాదని.. అసలు హరీశ్ రావు ఎందుకు అలా మాట్లాడారో అర్థం కావడం లేదన్నారు. ఆయనకు ఎందుకు ఆవేశం వచ్చిందో.. కావాలని సీఎం జగన్ ను విమర్శించి రెచ్చగొట్టాలని చూస్తున్నారు. టీఆర్ఎస్ పార్టీపై మేము ఏనాడూ విమర్శలు చేయడం లేదు. హరీశ్ రావుకు వ్యక్తిగతంగా ఏవైనా సమస్యలు ఉంటే ఉండొచ్చు. ఏ రాష్ట్రం సమస్యలను వాళ్లు చూసుకుంటే మంచిది. మాకు మాత్రం ఏపీ ప్రయోజనాలే ముఖ్యం. మేము ఏ ఫ్రంట్ లో చేరడం లేదు.. అంటూ సజ్జల హరీశ్ వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
Weight | బరువు తగ్గాలనుకునే వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. అయితే చాలామంది సరైన మార్గాన్ని ఎంచుకోకపోవడం వల్ల బరువు…
Liver Cancer | మన శరీరంలో అత్యంత కీలకమైన అవయవాల్లో కాలేయం (Liver) ఒకటి. ఇది శరీరాన్ని డిటాక్స్ చేస్తూ,…
Navaratri | నవరాత్రులు అనగానే దేశవ్యాప్తంగా భక్తి, శ్రద్ధతో దుర్గాదేవిని పూజించే మహోత్సవ కాలం. తొమ్మిది రోజులపాటు దుర్గాదేవి తొమ్మిది…
Xiaomi 17 Pro Max vs iPhone 17 Pr o max| టెక్ వరల్డ్‌లో మరో ఆసక్తికర పోటీ…
Bonus | తెలంగాణ సింగరేణి బొగ్గు గనుల కార్మికులకు మరోసారి తీపి వార్త అందింది. ఇటీవలే దసరా పండుగ సందర్భంగా…
Vijaywada | విజయవాడలోని పవిత్ర ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రుల సందర్భంగా కనకదుర్గమ్మ దర్శనార్థం భక్తులు భారీగా తరలివస్తున్నారు. అమ్మవారు ప్రతి రోజూ…
AP Free Bus Scheme | ఆంధ్రప్రదేశ్‌లో ఆగస్టు 15న ప్రారంభమైన స్త్రీ శక్తి పథకం విజయవంతంగా కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా…
Telangana IPS Transfers | తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారీ స్థాయిలో ఐపీఎస్ అధికారుల బదిలీలు చేపట్టింది. పోలీసు వ్యవస్థతో…
This website uses cookies.