Harish Rao : హరీష్ రావుని కే‌సీ‌ఆర్ దగ్గర పర్ఫెక్ట్ గా ఇరికించేశాడుగా సజ్జల.. హహ సూపర్ అంటోన్న వైసీపీ శ్రేణులు | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Harish Rao : హరీష్ రావుని కే‌సీ‌ఆర్ దగ్గర పర్ఫెక్ట్ గా ఇరికించేశాడుగా సజ్జల.. హహ సూపర్ అంటోన్న వైసీపీ శ్రేణులు

Harish Rao : ఏపీ, తెలంగాణ ప్రభుత్వాల మధ్య ప్రస్తుతం పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంతలా వార్ నడుస్తోంది. నిజానికి.. ఒకప్పుడు అంటే 2019 ఎన్నికల్లో జగన్ ముఖ్యమంత్రి అయ్యాక… తెలంగాణ ప్రభుత్వం.. ఏపీతో బాగానే ఉండేది. కానీ.. తర్వాత ఏపీ ప్రభుత్వంపై తెలంగాణ ప్రభుత్వం కొన్ని విషయాల్లో విమర్శిస్తూ రావడం వల్ల రెండు ప్రభుత్వాల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. తాజాగా తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావుపై… ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి […]

 Authored By jagadesh | The Telugu News | Updated on :30 September 2022,6:30 pm

Harish Rao : ఏపీ, తెలంగాణ ప్రభుత్వాల మధ్య ప్రస్తుతం పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంతలా వార్ నడుస్తోంది. నిజానికి.. ఒకప్పుడు అంటే 2019 ఎన్నికల్లో జగన్ ముఖ్యమంత్రి అయ్యాక… తెలంగాణ ప్రభుత్వం.. ఏపీతో బాగానే ఉండేది. కానీ.. తర్వాత ఏపీ ప్రభుత్వంపై తెలంగాణ ప్రభుత్వం కొన్ని విషయాల్లో విమర్శిస్తూ రావడం వల్ల రెండు ప్రభుత్వాల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. తాజాగా తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావుపై… ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి (sajjala rama krishna reddy ) ఆగ్రహం వ్యక్తం చేశారు.

మీకు తెలంగాణలో సమస్యలు లేవా.. తెలంగాణలో సమస్యలు వదిలేసి… ఏపీపై కామెంట్ చేయడం కరెక్టా? ఏపీ గురించి మీకెందుకు.. ఏపీపై కామెంట్ చేయడం కరెక్ట్ కాదంటూ సజ్జల హితువు పలికారు. మంత్రి హరీశ్ రావు (harish rao ) .. ఏపీలో టీచర్ల గురించి, వ్యవసాయ మోటార్లకు గురించి చేసిన వ్యాఖ్యలపై సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్రస్థాయిలో స్పందించారు. తాము ఎప్పుడూ వేరే రాష్ట్రం గురించి కామెంట్ చేయలేదని ఆయన ఈసందర్భంగా గుర్తు చేశారు.

Harish Rao : హరీశ్ రావు ఎందుకు అలా మాట్లాడారో అర్థం కావడం లేదు

sajjala rama krishna reddy strong counter to telangana minister harish rao

sajjala rama krishna reddy strong counter to telangana minister harish rao

ఇది కేవలం రెండు రాష్ట్రాల మధ్య అంశం కాదని.. అసలు హరీశ్ రావు ఎందుకు అలా మాట్లాడారో అర్థం కావడం లేదన్నారు. ఆయనకు ఎందుకు ఆవేశం వచ్చిందో.. కావాలని సీఎం జగన్ ను విమర్శించి రెచ్చగొట్టాలని చూస్తున్నారు. టీఆర్ఎస్ పార్టీపై మేము ఏనాడూ విమర్శలు చేయడం లేదు. హరీశ్ రావుకు వ్యక్తిగతంగా ఏవైనా సమస్యలు ఉంటే ఉండొచ్చు. ఏ రాష్ట్రం సమస్యలను వాళ్లు చూసుకుంటే మంచిది. మాకు మాత్రం ఏపీ ప్రయోజనాలే ముఖ్యం. మేము ఏ ఫ్రంట్ లో చేరడం లేదు.. అంటూ సజ్జల హరీశ్ వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

jagadesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది