Savings Plan : 2022లో ఈ స్కీమ్స్‌లో సేవింగ్స్ చేయండి.. బోలెడన్ని బెన్‌ఫిట్స్.. | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Savings Plan : 2022లో ఈ స్కీమ్స్‌లో సేవింగ్స్ చేయండి.. బోలెడన్ని బెన్‌ఫిట్స్..

 Authored By mallesh | The Telugu News | Updated on :28 December 2021,10:20 am

Savings Plan : నూతన సంవత్సరం వస్తున్నది అనగానే ప్రతీ ఒక్కరు ఆ సంవత్సరంలో ఏయే పనులు చేస్తే బాగుంటుందని అనుకుంటుంటారు. అందుకుగాను సరికొత్త ప్రణాళికలను సిద్ధం చేసుకుంటు ముందుకు సాగుతారు. రాబోయే రోజుల్లో అనగా భవిష్యత్తులో తమకు ఎటువంటి ఎకానమికల్ ఇష్యూస్ రాకుండా ఉండేందుకుగాను, ఫైనాన్షియల్‌గా స్ట్రాంగ్‌గా ఉండేందుకుగాను డబ్బులు సంపాదించాలనుకుంటారు. ఈ క్రమంలోనే సంపాదించిన మనీలో కొంత సేవింగ్స్ చేయాలనుకుంటారు. కాగా, సేవింగ్స్‌లోనూ కొన్ని టెక్నిక్స్ ఉంటాయి. డబ్బును పన్ను మినహాయింపు పథకాలలో పెట్టడం వలన ఇన్‌కమ్ ట్యాక్స్ ఎగ్జెంప్షన్ పొందొచ్చు. కొత్త సంవత్సరంలో ఏయే స్కీమ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే మంచిదో తెలుసుకుందాం.

Savings Plan : ఈ పథకాలలో పెట్టుబడి ద్వారా.. ఆదాయపు పన్ను మినహాయింపు..

savings plan will give you good returns in the year 2022

savings plan will give you good returns in the year 2022

మనం తెలుసుకోబోయే ఈ స్కీమ్స్‌లో మనీ ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఇన్‌కమ్ ట్యాక్స్ ఎగ్జెంప్షన్ ఉంటుంది. ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్..ఈ ఈక్విటీ ఫండ్‌లో సేవింగ్స్ చేయడం చాలా మంచి ఆప్షన్. ఇందులో ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80 సి కింద రూ.1.50 లక్షల వరకు మినహాయింపు ఉంటుంది. ఈ మ్యూచువల్ ఫండ్ త్రీ ఇయర్స్ టైం కలిగి ఉంటుంది. ఫిక్స్ డ్ డిపాజిట్‌లో పెట్టుబడి పెట్టడం కూడా ఉత్తమం. దీని ద్వారా పర్టికులర్ పీరియడ్ ఆఫ్ టైం వరకు మనీ సేఫ్ గా ఉంటుంది. ఆ తర్వాత 80 సి కింద పన్ను మినహాయింపు ఉంటుంది. అయితే, ఎఫ్ డీలలో ఇన్వెస్ట్ చేసే ముందర వడ్డీ రేట్లు చెక్ చేసుకోవాలి.

సుకన్య సమృద్ధి యోజన చిన్న పొదుపు స్కీం. కాగా, ఇందులో మ్యగ్జిమమ్ రూ.1.50 లక్షల వరకు డిపాజిట్ చేయొచ్చు. ఇందులో ఇన్ కమ్ ట్యాక్స్ ఎగ్జెంప్షన్ ఉంటుంది. పదేళ్ల కంటే తక్కువ వయసున్న ఆడపిల్లల కోసం ఈ స్కీమ్ తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ స్కీంలో ఏటా రూ.1.50 లక్షల వరకు ఇన్వెస్ట్ చేయొచ్చు. దీనిపై ప్రభుత్వ హామీ ఉంటుంది. సెక్షన్ 80 సి కింద పెట్టుబడిపై ఇన్ కమ్ ట్యాక్స్ ఎగ్జెంప్షన్ ఉంటుంది. నేషనల్ పెన్షన్ సిస్టమ్.. పదవీ విరమణ పొందిన ప్రభుత్వ ఉద్యోగులకు ఉపయోగపడుతుంది. మొత్తం రూ.2 లక్షల వరకు ఈ స్కీమ్ లో మినహాయింపు ఉంటుంది.

Also read

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది