SBI : భారతదేశంలో బ్యాంకింగ్ రంగంలో ఎస్బీఐ ఒకటి. కాగా, ఈ సంస్థకు దేశవ్యాప్తంగా బ్రాంచీలు ఉన్నాయి. ఇకపోతే ప్రభుత్వ ఉద్యోగులు అధిక శాతం తమ శాలరీ అకౌంట్స్ ఇందులో తీసుకుంటుంటారు. ప్రైవేట్ ఉద్యోగులు కూడా ఈ బ్యాంక్ లో అకౌంట్స్ తీసుకుంటారు. ఇకపోతే ఈ బ్యాంక్ అందించే సర్వీస్ ఐఎంపీఎస్ (ఇమీడియెట్ మనీ పేమెంట్ సర్వీస్)కుగాను కొత్తగా కొన్ని చార్జీలను అమలు చేస్తున్నట్లు ఎస్బీఐ తెలిపింది. అవి ఎప్పటి నుంచి అమలులోకి వస్తాయంటే..ఖాతాదారులు ఇక నుంచి పాత చార్జీలు కాకుండా కొత్తగా అమలులోకి వచ్చే చార్జీలను చెల్లించాల్సి ఉంటుంది. ఫిబ్రవరి 1 ట్రాంజాకక్షన్ రేట్లను బట్టి చార్జీలను చెల్లించాల్సి ఉంటుంది. ఇకపోతే ఎస్బీఐ ఐఎంపీఎస్‌లో కొన్ని మార్పులు కూడా చేసింది.
గతంలో కేవలం రూ.2 లక్షల వరకే ఆన్ లైన్, ఆఫ్ లైన్ మోడ్ లో మనీ సెండ్ చేసేవారు. కానీ, ఇప్పుడు రూ.5 లక్షల వరకు మనీ సెండ్ చేయొచ్చు.ఐఎంపీఎస్ ట్రాంజాక్షన్స్ చేయడానికి అకౌంట్ హోల్డర్స్ గతంలో లాగా బ్యాంకులకు వెళ్లొచ్చు లేదా ఆన్ లైన్ లోనూ చేసుకోవచ్చు. ఎస్బీఐ కొత్త ఐఎంపీఎస్ చార్జీల ప్రకారం రూ.1,000 వరకు అన్ని ఆఫ్‌లైన్ ట్రాంజాక్షన్స్‌కు ఎటువంటి చార్జీలు ఉండబోవు. రూ.1,000 నుంచి రూ. 10,000 వరకు చేసే ట్రాంజాక్షన్స్ కుగాను వినియోగదారుడి నుంచి రూ.2, జీఎస్టీ వసూలు చేస్తారు.రూ.10,000 నుంచి రూ. 1,00,000 పరిధిలో చేసే ట్రాంజాక్షన్స్ కు గాను రూ.4, జీఎస్టీ చార్జీలు చెల్లించవలసి ఉంటుంది.
ఒక లక్ష నుంచి రెండు లక్షల వరకు జరిగే ప్రతీ ట్రాంజాక్షన్ కుగాను ఎస్బీఐ అకౌంట్ హోల్డర్స్ రూ.12 తో పాటు జీఎస్టీ పే చేయాల్సి ఉంటుంది. ఇక రెండు లక్షల నుంచి ఐదు లక్షల వరకు చేసే ప్రతీ ట్రాంజాక్షన్ కు గాను రూ.20 తో పాటు జీఎస్టీ చెల్లించాలి. ఇకపోతే ఆన్ లైన్ లో కూడా ఐఎంపీఎస్ సేవలు అందుబాటులో ఉంటాయి. ఆన్ లైన్ లో అయితే బ్యాంక్ ఎటువంటి జీఎస్టీ చార్జీలను వసూలు చేయదు. ఇంటర్నెట్, మొబైల్ బ్యాంకింగ్, యోన్ యాప్ ద్వారా ట్రాంజాక్షన్స్ చేసుకోవచ్చు.
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…
Wheat Flour : ప్రస్తుతం మార్కెట్లో దొరికే ప్రతి వస్తువు కూడా కల్తీ గా మారింది. అలాగే ఎక్కడ చూసినా కూడా…
This website uses cookies.