SBI : ఐఎంపీఎస్ సేవలకు చార్జీలు పెంచిన ఎస్బీఐ.. అమలులోకి ఎప్పటి నుంచో తెలుసా? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

SBI : ఐఎంపీఎస్ సేవలకు చార్జీలు పెంచిన ఎస్బీఐ.. అమలులోకి ఎప్పటి నుంచో తెలుసా?

SBI : భారతదేశంలో బ్యాంకింగ్ రంగంలో ఎస్బీఐ ఒకటి. కాగా, ఈ సంస్థకు దేశవ్యాప్తంగా బ్రాంచీలు ఉన్నాయి. ఇకపోతే ప్రభుత్వ ఉద్యోగులు అధిక శాతం తమ శాలరీ అకౌంట్స్ ఇందులో తీసుకుంటుంటారు. ప్రైవేట్ ఉద్యోగులు కూడా ఈ బ్యాంక్ లో అకౌంట్స్ తీసుకుంటారు. ఇకపోతే ఈ బ్యాంక్ అందించే సర్వీస్ ఐఎంపీఎస్ (ఇమీడియెట్ మనీ పేమెంట్ సర్వీస్)కుగాను కొత్తగా కొన్ని చార్జీలను అమలు చేస్తున్నట్లు ఎస్బీఐ తెలిపింది. అవి ఎప్పటి నుంచి అమలులోకి వస్తాయంటే..ఖాతాదారులు ఇక నుంచి […]

 Authored By mallesh | The Telugu News | Updated on :1 February 2022,4:30 pm

SBI : భారతదేశంలో బ్యాంకింగ్ రంగంలో ఎస్బీఐ ఒకటి. కాగా, ఈ సంస్థకు దేశవ్యాప్తంగా బ్రాంచీలు ఉన్నాయి. ఇకపోతే ప్రభుత్వ ఉద్యోగులు అధిక శాతం తమ శాలరీ అకౌంట్స్ ఇందులో తీసుకుంటుంటారు. ప్రైవేట్ ఉద్యోగులు కూడా ఈ బ్యాంక్ లో అకౌంట్స్ తీసుకుంటారు. ఇకపోతే ఈ బ్యాంక్ అందించే సర్వీస్ ఐఎంపీఎస్ (ఇమీడియెట్ మనీ పేమెంట్ సర్వీస్)కుగాను కొత్తగా కొన్ని చార్జీలను అమలు చేస్తున్నట్లు ఎస్బీఐ తెలిపింది. అవి ఎప్పటి నుంచి అమలులోకి వస్తాయంటే..ఖాతాదారులు ఇక నుంచి పాత చార్జీలు కాకుండా కొత్తగా అమలులోకి వచ్చే చార్జీలను చెల్లించాల్సి ఉంటుంది. ఫిబ్రవరి 1 ట్రాంజాకక్షన్ రేట్లను బట్టి చార్జీలను చెల్లించాల్సి ఉంటుంది. ఇకపోతే ఎస్బీఐ ఐఎంపీఎస్‌లో కొన్ని మార్పులు కూడా చేసింది.

గతంలో కేవలం రూ.2 లక్షల వరకే ఆన్ లైన్, ఆఫ్ లైన్ మోడ్ లో మనీ సెండ్ చేసేవారు. కానీ, ఇప్పుడు రూ.5 లక్షల వరకు మనీ సెండ్ చేయొచ్చు.ఐఎంపీఎస్ ట్రాంజాక్షన్స్ చేయడానికి అకౌంట్ హోల్డర్స్ గతంలో లాగా బ్యాంకులకు వెళ్లొచ్చు లేదా ఆన్ లైన్ లోనూ చేసుకోవచ్చు. ఎస్బీఐ కొత్త ఐఎంపీఎస్ చార్జీల ప్రకారం రూ.1,000 వరకు అన్ని ఆఫ్‌లైన్ ట్రాంజాక్షన్స్‌కు ఎటువంటి చార్జీలు ఉండబోవు. రూ.1,000 నుంచి రూ. 10,000 వరకు చేసే ట్రాంజాక్షన్స్ కుగాను వినియోగదారుడి నుంచి రూ.2, జీఎస్టీ వసూలు చేస్తారు.రూ.10,000 నుంచి రూ. 1,00,000 పరిధిలో చేసే ట్రాంజాక్షన్స్ కు గాను రూ.4, జీఎస్టీ చార్జీలు చెల్లించవలసి ఉంటుంది.

sbi imps transactions limit and charges are changing from feb 1

sbi imps transactions limit and charges are changing from feb 1

SBI : ఐఎంపీఎస్ పరిమితిలో మార్పులు..

ఒక లక్ష నుంచి రెండు లక్షల వరకు జరిగే ప్రతీ ట్రాంజాక్షన్ కుగాను ఎస్బీఐ అకౌంట్ హోల్డర్స్ రూ.12 తో పాటు జీఎస్టీ పే చేయాల్సి ఉంటుంది. ఇక రెండు లక్షల నుంచి ఐదు లక్షల వరకు చేసే ప్రతీ ట్రాంజాక్షన్ కు గాను రూ.20 తో పాటు జీఎస్టీ చెల్లించాలి. ఇకపోతే ఆన్ లైన్ లో కూడా ఐఎంపీఎస్ సేవలు అందుబాటులో ఉంటాయి. ఆన్ లైన్ లో అయితే బ్యాంక్ ఎటువంటి జీఎస్టీ చార్జీలను వసూలు చేయదు. ఇంటర్నెట్, మొబైల్ బ్యాంకింగ్, యోన్ యాప్ ద్వారా ట్రాంజాక్షన్స్ చేసుకోవచ్చు.

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది