Sekhar Master : జేబులో రూపాయి లేకుండా.. తినకుండా ఉన్న రోజులు ఎన్నో? ఎమోషనల్ అయిన శేఖర్ మాస్టర్?

0
Advertisement

Sekhar Master : అన్ని రంగాలు ఒక ఎత్తు. సినీ రంగం ఒక ఎత్తు. ఎందుకంటే.. సినీ రంగంలో రాణించాలంటే ఒక పాషన్ ఉండాలి. సినీ రంగం మీద పిచ్చి ఉండాలి. ఆ పిచ్చే సినీ రంగంలో ఉన్నత స్థానానికి తీసుకెళ్తుంది. లేదంటే మాత్రం కష్టమే. అందుకే.. చాలా మంది ఎంతో ఇష్టంతో సినీ రంగంలోకి ఎంట్రీ ఇస్తుంటారు. అయితే.. అందరికీ సినీ రంగం రెడ్ కార్పెట్ వేసి స్వాగతం పలకదు. చాలా కష్టపడాలి. ఎన్నో అవమానాలు భరించాలి. టైమ్ కు తిండి ఉండదు. తిందామన్నా జేబులో డబ్బు ఉండదు. ఆఫీసుల చుట్టూ తిరిగి విసిగి వేసారి పోయి.. మళ్లీ ఇంటికి వెళ్లిపోయి.. తమ పనులు తాము చేసుకునే వాళ్లు ఎందరో? సినీరంగంలో నిలదొక్కుకోవాలంటే.. పాషన్ తో పాటు.. పిచ్చితో పాటు.. సహనం కూడా ఉండాలి. దాన్నే ఓర్పు అంటారు. భూదేవికి ఎంత ఓర్పు ఉంటుందో.. వీళ్లకు కూడా ఉండాలి. అప్పుడే సినీ రంగం రెడ్ కార్పెట్ పరుచుతుంది.

sekhar master emotional in comedy stars show
sekhar master emotional in comedy stars show

సినీ రంగంలోకి ఎంట్రీ ఇవ్వడానికి ఎంతో కష్టపడి.. చివరకు సినీ రంగంలో నిలదొక్కుకున్నాక.. చాలామంది తాము ఇండస్ట్రీలోకి రావడానికి ఎంతో కష్టపడ్డామని.. ఆ పని చేశామని.. ఈ పని చేశామని చెబుతుంటారు. వాళ్లు చెప్పే మాటలు వింటే ప్రతి ఒక్కరు కంట తడి పెట్టాల్సిందే. అలా ఎన్నో కష్టాలను అనుభవించి.. ఇండస్ట్రీలోకి వచ్చి.. సూపర్ సక్సెస్ సాధించిన వాళ్లు కోకొల్లలు. అందులో ఒకరు శేఖర్ మాస్టర్. ఆయన ప్రస్తుతం టాలీవుడ్ లోనే టాప్ కొరియోగ్రాఫర్.

sekhar master emotional in comedy stars show
sekhar master emotional in comedy stars show

Sekhar Master : కామెడీ స్టార్స్ షోలో ఎమోషనల్ అయిన శేఖర్ మాస్టర్

కామెడీ స్టార్స్ షోలో శేఖర్ మాస్టర్ ఎమోషనల్ అయ్యారు. స్టార్ మాలో కామెడీ స్టార్స్ కామెడీ షో వస్తున్న విషయం తెలుసు కదా. ఆ షోకు శేఖర్ మాస్టర్ జడ్జిగా వ్యవహరిస్తున్నారు. అయితే.. ఈ ఆదివారం ప్రసారమయ్యే కామెడీ స్టార్స్ కు సంబంధించిన ప్రోమోను తాజాగా విడుదల చేశారు. ఈ సందర్భంగా పటాస్ హరి, యాదమ్మ రాజు.. సద్దాం.. వీళ్లంతా స్కిట్ చేసి ఆ తర్వాత.. తాము ఇండస్ట్రీలోకి రావడానికి ఎంత కష్టపడ్డారో చెప్పుకొచ్చారు.

sekhar master emotional in comedy stars show
sekhar master emotional in comedy stars show

వెంటనే వాళ్లకు కనెక్ట్ అయిపోయిన శేఖర్ మాస్టర్.. నేను కూడా మీలాగే.. ఎంతో కష్టపడి ఇండస్ట్రీకి వచ్చా. చేతుల్లో రూపాయి లేకుండా తిరిగా. తిండి లేదు.. తిప్పలు లేవు.. అంటూ తాను కూడా ఇండస్ట్రీలోకి వచ్చేందుకు ఎన్ని సమస్యలను అనుభవించారో చెప్పుకొచ్చారు. దానికి సంబంధించిన ప్రోమోను తాజాగా విడుదల చేశారు.

Advertisement