September : ఆగస్ట్ నెల ముగియడానికి సిద్ధంగా ఉంది. మరి కొద్ది రోజులలో సెప్టెంబర్ మొదలు కానుంది. అటువంటి పరిస్థితిలో కొత్త నెల నుండి చాలా పెద్ద మార్పులు కనిపిస్తాయి. ఇది సాధారణ ప్రజల జేబులపై నేరుగా ప్రభావం చూపుతుంది. సెప్టెంబర్ నెల నుండి అలాంటి కొన్ని ప్రత్యేక మార్పులు జరగనున్నాయి. ఇది మీ జేబుపై ప్రభావం చూపుతుంది. ఈ మార్పులలో ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ధర నుండి క్రెడిట్ కార్డ్‌ల నియమాల వరకు అన్నీ ఉంటాయి. అలాగే ప్రభుత్వ ఉద్యోగులకు డియర్‌నెస్ అలవెన్స్‌కు సంబంధించి ప్రత్యేక ప్రకటనలు ఉండవచ్చు. ప్రభుత్వాలు, సంస్థలు తీసుకొనే నిర్ణయాలు, ఆయా పాలసీల్లో మార్పులు ప్రజల జీవితంపై ప్రభావం చూపుతాయి.
కీలక మార్పులను ముందుగానే తెలుసుకోవడం ద్వారా ప్రయోజనాలు కోల్పోకుండా జాగ్రత్త పడవచ్చు. మరి కొద్ది రోజుల్లోనే సెప్టెంబర్ మొదలు కాబోతుంది. కొత్త నెలలో చాలా మార్పులు చోటు చేసుకోనున్నాయి. ప్రతి నెల మొదటి తేదీన భారత ప్రభుత్వం ఎల్‌పీజీ ధరను సవరిస్తుంది. వాణిజ్య గ్యాస్ సిలిండర్లు, గృహోపయోగం కోసం ఉపయోగించే గ్యాస్ సిలిండర్ల ధరల్లో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ఈసారి కూడా ఎల్‌పీజీ సిలిండర్ ధరలో మార్పు వస్తుందని భావిస్తున్నారు. గత నెలలో వాణిజ్య ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ధర రూ.8.50 పెరిగింది. జూలైలో దీని ధర రూ.30 తగ్గింది. ఎల్‌పీజీ సిలిండర్ల ధరలతో పాటు, చమురు మార్కెటింగ్ కంపెనీలు ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ఏటీఎఫ్) , సిఎన్‌జి-పిఎన్‌జి ధరలను కూడా సవరిస్తాయి. దీని కారణంగా, మొదటి తేదీన వాటి ధరల్లో కూడా మార్పులు చూడవచ్చని భావిస్తున్నారు.
మరోవైపు నకిలీ కాల్స్, నకిలీ సందేశాలను అరికట్టేందుకు టెలికాం కంపెనీలను ట్రాయ్ హెచ్చరించింది. దీని కోసం ట్రాయ్ కఠినమైన మార్గదర్శకాలను జారీ చేసింది. జియో, ఎయిర్‌టెల్, వోడాఫోన్, ఐడియా, బిఎస్‌ఎన్‌ఎల్ వంటి టెలికాం కంపెనీలు 140 మొబైల్ నంబర్‌లతో ప్రారంభించి బ్లాక్‌చెయిన్ ఆధారిత డిఎల్‌టి (డిస్ట్రిబ్యూటెడ్ లెడ్జర్ టెక్నాలజీ ప్లాట్‌ఫామ్)కు టెలిమార్కెటింగ్ కాల్స్, వాణిజ్య సందేశాలను పంపాలని ట్రాయ్ కోరింది. సెప్టెంబర్ 1 నుండి, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ యుటిలిటీ బిల్ చెల్లింపు లావాదేవీలపై రివార్డ్ పాయింట్‌ల పరిమితిని నిర్ణయించనుంది. దీని కింద కస్టమర్‌లు ఈ లావాదేవీలపై నెలకు 2,000 పాయింట్‌లను మాత్రమే పొందగలరు.థర్డ్ పార్టీ యాప్‌ల ద్వారా చెల్లింపులు చేయడంపై హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ ఎలాంటి రివార్డ్‌లను అందించదు.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.