KCR : జానారెడ్డి పెట్టిన బిక్షతోనే కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యారు? కాంగ్రెస్ సీనియర్ నేత షాకింగ్ కామెంట్స్?
Jana reddy : ప్రస్తుతం తెలంగాణలో సాగర్ ఉపఎన్నిక గురించే చర్చ. ముఖ్యంగా జానారెడ్డి గురించి తీవ్రంగా చర్చ నడుస్తోంది. సాగర్ ఉపఎన్నిక ముందు వరకు కూడా జానారెడ్డి గురించి పట్టించుకున్న నాథుడు లేడు కానీ.. తాజాగా సాగర్ ఉపఎన్నికలో కాంగ్రెస్ పార్టీ తరుపున జానారెడ్డి నిలబడటంతో.. ఒక్కసారిగా జానారెడ్డి… తెలంగాణలో ట్రెండింగ్ టాపిక్ అయిపోయారు. అందులోనూ సాగర్… జానారెడ్డి కంచుకోట. జానారెడ్డి ఎంత చెబితే అంత సాగర్ లో. సాగర్ ను అభివృద్ధి చేసింది కూడా నా హయాంలోనే అని జానారెడ్డి ఎప్పుడూ చెబుతుంటారు.
ఈనేపథ్యంలో జానారెడ్డిపై ఇటీవల కేసీఆర్… షాకింగ్ వ్యాఖ్యలు చేశారని కాంగ్రెస్ నేతలంతా మండిపడుతున్నారు. జానారెడ్డికి ఇక పర్మినెంట్ రెస్ట్ ఇవ్వడం మంచిది అని కేసీఆర్ వ్యాఖ్యలు చేశారని కాంగ్రెస్ నేతలు తీవ్రస్థాయిలో కేసీఆర్ పై మండిపడుతున్నారు.అసలు… కేసీఆర్ ముఖ్యమంత్రి అయింతే… జానారెడ్డి పెట్టిన బిక్షతో అంటూ కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి షబ్బీర్ అలీ పెద్ద బాంబ్ పేల్చారు. ఒక సీనియర్ నేతను పట్టుకొని అలా అంటారా? కేసీఆర్ వ్యాఖ్యలను నేను ఖండిస్తున్నా. తెలంగాణ రావడానికి కారణం జానారెడ్డి… అంటూ షబ్బీర్ అలీ ఆగ్రహం వ్యక్తం చేశారు.జానారెడ్డికి సీఎం పదవి ఆఫర్ వచ్చినా కాదనుకున్నారు.
నాకు ముఖ్యమంత్రి పదవి ఇస్తే… తెలంగాణ రాదు కాబట్టి… తెలంగాణ రానప్పుడు నాకు ఎటువంటి పదవి అవసరం లేదు అని జానారెడ్డి ఖరాఖండిగా చెప్పారు. జానారెడ్డి తన దశాబ్దాల రాజకీయ చరిత్రలో ఏనాడైనా తన కొడుకులను కానీ… కుటుంబ సభ్యులను కానీ రాజకీయాల్లోకి తీసుకొచ్చారా? అంటూ షబ్బీర్ అలీ ప్రశ్నించారు.కానీ.. కేసీఆర్ మాత్రం తన కుటుంబంలో అందరికీ ఉద్యోగాలు ఇచ్చుకొని.. అందరికీ పదవులు ఇచ్చారు. మచ్చలేని నాయకుడైన జానారెడ్డిపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి.. అని అలీ డిమాండ్ చేశారు.
KCR : కేసీఆర్… మీ డబ్బు, మీ మాటలు జానారెడ్డి ముందు పనిచేయవు
జానారెడ్డి పెట్టిన బిక్షతో సీఎం అయిన కేసీఆర్… ఇప్పుడు జానారెడ్డిపై విమర్శలు చేయడం తగదన్నారు షబ్బీర్ అలీ. జానారెడ్డి సీఎం పదవిని త్యాగం చేస్తే… కేసీఆర్ సీఎం పదవి కోసం ఏదైనా చేయడానికి సిద్ధమయ్యారు. రాజకీయాలకు జానారెడ్డి ఒక దిక్సూచి. కేసీఆర్ నీ డబ్బు.. నీ మాటలు ఏవీ జానారెడ్డి ముందు పనిచేయవు. కేసీఆర్ దుబ్బాక ఉపఎన్నిక తర్వాత ఫామ్ హౌస్ కే పరిమితమయ్యారు. దుబ్బాకలోనే కేసీఆర్ రాజకీయ పతనం ప్రారంభమైంది. నాగార్జున సాగర్ ఉపఎన్నిక తర్వాత కేసీఆర్ కు శాశ్వతంగా రెస్ట్ ఇస్తాం… అంటూ షబ్బీర్ అలీ సంచలన వ్యాఖ్యలు చేశారు.